జైపూర్ మండలంలో మీసేవ కేంద్రాల పనితీరుపై తహసీల్దార్ సమీక్ష
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం మీసేవ కేంద్రాల ఆపరేటర్లతో తహసీల్దార్ వనజ రెడ్డి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం మాత్రమే దరఖాస్తుదారుల నుండి రుసుములు వసూలు చేయాలని స్పష్టం చేశారు.దరఖాస్తులను ఎలాంటి తప్పులు లేకుండా సమర్పించి,సంబంధిత పత్రాలను సక్రమంగా అప్లోడ్ చేయాలని ఆదేశించారు.అలాగే ప్రతి మీసేవ కేంద్రంలో సిటిజెన్ చార్టర్ బోర్డును తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, కేంద్రానికి వచ్చే పౌరులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు.ఈ సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్,గిర్దావర్‌లు,గ్రామ పాలనా అధికారులు పాల్గొన్నారు.
