హీరాబాద్: 12 వరకు ఓపెన్ స్కూల్ అడ్మిషన్ గడువు పెంపు

హీరాబాద్: 12 వరకు ఓపెన్ స్కూల్ అడ్మిషన్ గడువు పెంపు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి సోమవారం తెలిపిన వివరాల ప్రకారం, ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ అడ్మిషన్ల దరఖాస్తు గడువును ఈనెల 12వ తేదీ వరకు పెంచారు. అడ్మిషన్ ఫీజును మీసేవ కేంద్రాల్లో మాత్రమే చెల్లించాలని, నేరుగా అధ్యయన కేంద్రాల్లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గడువు పెంపును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ఐటీఆర్ ఫైలింగ్ గడువు పెంచాలని డిమాండ్..మరో ఛాన్స్ ఇస్తారా..

ఐటీఆర్ ఫైలింగ్ గడువు పెంచాలని డిమాండ్..మరో ఛాన్స్ ఇస్తారా..

 

 

సెప్టెంబర్ మాసం రాగానే ఐటీఆర్ ఫైలింగ్‌ గడువుకు సంబంధించి మళ్లీ పొడిగింపు డిమాండ్ ఊపందుకుంది. ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక చాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (FKCCI), చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ సూరత్ (CAAS) వంటి ప్రముఖ సంస్థలు ఐటీఆర్ గడువును మరింత పెంచాలని కోరుతున్నాయి.

సాధారణంగా ప్రతి ఏడాది జూలై 31తో ఐటీఆర్ ఫైలింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది, అంటే 2024-25 ఆర్థిక సంవత్సరానికి (2025-26 అసెస్మెంట్ ఇయర్) సంబంధించి కొన్ని టెక్నికల్ సమస్యలు, లేట్‌గా యుటిలిటీలు రిలీజ్ కావడం, డేటా మిస్‌ మ్యాచ్‌ వంటి కారణాలతో గడువు పెంచారు. దీంతో ఇప్పటికే ఐటీ డిపార్ట్‌మెంట్ ఒకసారి గడువును జూలై 30 నుంచి సెప్టెంబర్ 15, 2025 వరకు పొడిగించింది (ITR Filing Deadline 2025). ఇది ఆడిట్ అవసరం లేని వ్యక్తులు, HUFs, ఇతర సాధారణ ట్యాక్స్‌పేయర్లకు వర్తిస్తుంది.

గడువు పెంచాలి..

కానీ, ఇంకొంచెం టైం కావాలని ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక చాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (FKCCI), చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ సూరత్ (CAAS) లాంటి బాడీలు CBDTకి లేఖలు రాసి మరోసారి గడువు పెంచాలని విజ్ఞప్తి చేశాయి. ఈ ఏడాది ITR ఫారమ్‌లలో చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులకు అనుగుణంగా సిస్టమ్‌లో కూడా మార్పులు చేయాల్సి వచ్చింది. దీంతో టెక్నికల్ గ్లిచ్‌లు, పోర్టల్ స్లో ఉండడం, యుటిలిటీలు ఆలస్యం కావడం వంటి సమస్యలు ఎదురయ్యాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version