సీఎం ఆర్ ఎఫ్ చెక్కు అందజేత..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/congress.wav?_=1

సీఎం ఆర్ ఎఫ్ చెక్కు అందజేత..

రామాయంపేట,  నేటి ధాత్రి 

రామాయంపేట మున్సిపల్ పరిధిలోని 6వ వార్డుకు చెందిన బీర సత్యనారాయణకు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుండి రూ.60,000 విలువైన చెక్కును అందజేశారు. గౌరవనీయులైన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో ఈ ఆర్థిక సహాయం లభించిందని స్థానిక నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ దేమే యాదగిరి మాట్లాడుతూ
ప్రభుత్వం అందిస్తున్న సాయం లబ్ధిదారులకు ఉపయుక్తమవుతుందని, అవసరమైన వారు సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డేమే యాదగిరి. కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లాడి వెంకట్. బిర రామచంద్రం. మంగలి సత్యం. దోనేటి గోపాల్. మంగళ్ పవన్. వివేక్ తదితరులు పాల్గొన్నారు.

“సంగారెడ్డి, మెదక్‌లో భారీ వర్షాలు”……

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-8-6.wav?_=2

సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాకపోకలు తీవ్రంగా అంతరాయానికి గురయ్యాయి.

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌లో అత్యధికంగా 17.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కౌడిపల్లి 17.2, పెద్ద శంకరంపేట 16.4, దామరంచ 15.8, మాసాయిపేట 14.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా కంగ్టిలో 17 సెంటీమీటర్లు, కల్హేర్ 11.9, కడ్పాల్ 10.6, అన్నసాగర్ 10.3 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది.

ఇక నిన్న సిద్దిపేట జిల్లాలోని గౌరారం అత్యధికంగా 23.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు చేసింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసి రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైంది.

హైదరాబాద్‌లోనూ రాత్రి నుంచి ఉదయం వరకు వర్షం కురిసి పలు ప్రాంతాలు నీటమునిగాయి. హైదర్‌నగర్ 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు చేసింది. మల్కాజిగిరి, కూకట్‌పల్లి, కాప్రా, శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, అల్వాల్ వంటి ప్రాంతాల్లో 4 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

స్థానిక మంజీర విద్యాలయంలో శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-41-1.wav?_=3

స్థానిక మంజీర విద్యాలయంలో శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

రామాయంపేట నేటి ధాత్రి (మెదక్)

ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణుని దివ్యచరిత్రను , శ్రీకృష్ణుడు జన్మించినప్పటి నుండి గోకులలో చేసిన చిలిపి చేష్టలను తో పాటు గోవర్ధన గోవర్ధనగిరి నెత్తి గోపులాని ఎలా కాపాడాడు కన్నుల కట్టినట్టు చూపించారు. శ్రీకృష్ణ పూజ అనంతరం మోహన్ పంతులుగారు విద్యార్థులకు శ్రీకృష్ణుని చిలిపి చేష్టలను వివరించారు.శ్రావణమాసంలో లభించే పండ్లు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, మీగడ, మీగడ వంటి రుచికరమైన పదార్థాలు, వంటకాలు స్వామివారికి నైవేద్యంగా పెట్టారు.

Sri Krishna Ashtami

శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అందంగా అలంకరించి, ఊయలలో పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, శ్రావ్యమైన కీర్తనలు పాడారు. చిన్నారి విద్యార్థిని విద్యార్థులు గోపిక మరియు శ్రీకృష్ణ వేషాదరణలో వచ్చి చూపరులను ఆకట్టుకున్నారు.

 

అలాగే శ్రీకృష్ణ గోపికలచే ఉట్టి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జితేందర్ రెడ్డి వాసవి హెడ్మాస్టర్ సురేష్ మౌనిక మీనా సౌమ్య శ్రీనివాస్ జయప్రకాష్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు

మెదక్ లో వర్గ పోరు మొదలైనట్టేనా?

మెదక్ లో వర్గ పోరు మొదలైనట్టేనా?

ఎవరికి వారే పలు కార్యక్రమాలు…

ఉమ్మడిగా ముందుకు రాని వైనం…

ఎటు పోవాలో తెలియక అయోమయంలో పడుతున్న కార్యకర్తలు..

రామాయంపేట మే 13 నేటి ధాత్రి :

 

 

టిఆర్ఎస్ కు కంచుకోట ఉమ్మడి మెదక్ జిల్లా అలాగే మెదక్ నియోజకవర్గం కూడా ఈ పార్టీకి మంచిపట్టున్న నియోజకవర్గం. అయితే ఈ మధ్యకాలంలో మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకుడు కాంటారెడ్డి తిరుపతిరెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయని తెలుస్తోంది. ఏ కార్యక్రమం చేసిన వేరువేరుగా చేయడం పట్ల కార్యకర్తలు కూడా అయోమయంలో పడుతున్నారు. బహిరంగంగా విభేదాలు బయటపడకున్న లోలోపల మాత్రం విభేదాలు ఉన్నాయని వినిపిస్తున్నాయి. ఇప్పటినుండి వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారని పలువురి అభిప్రాయం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోహిత్ రావు తనదైన శైలిలో ముందుకు వెళ్లడంతో పాటు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కూడా ఘాటుగా విమర్శిస్తున్నారు.

Congress.

ఈ క్రమంలో అనుకున్న విధంగా ఈ ఇద్దరిలో ఎవరు కూడా ఖండించకపోవడం పట్ల కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ రావ్ వ్యాఖ్యల పట్ల పార్టీ కార్యకర్త ఒకరు సోషల్ మీడియాలో ఘాటుగా విమర్శించారు. అయితే ఆ కార్యకర్తను పోలీసులు విచక్షణ రహితంగా కొట్టిన కనీసం పట్టించుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. బాధితుడు ఇటీవల కేటీఆర్ ను కలిసి తన బాధను చెప్పుకున్నాడు. కేటీఆర్ సైతం మెదక్ నియోజకవర్గంలో నాయకుల పనితీరు పట్ల సంతృప్తిగా లేదని పలువురి వాదన. ఏది ఏమైనా ఇంటి పోరే కారుకు తిను సవాలుగా మారే ప్రమాదం ఉంది.

ఉద్యోగానికి రాజీనామా ఒక డ్రామా!

-హరికృష్ణ త్యాగం ఒక మిధ్య!!

-రాజీనామా చేసినా ఉద్యోగం మళ్ళీ వస్తుంది?

-అలా ఉద్యోగాలు పొందిన వాళ్లు కోకొల్లలు!

mlc candidate harikrishna

-ప్రజలను మభ్యపెట్టి సానుభూతి కోసం ఆరాటం

-ఎన్నికలలో గెలవాలన్న ఆలోచనతో ప్రచారం

-కోచింగ్‌ సెంటర్ల మేలు కోసం సరికొత్త నాటకం

-కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులంతా ఏకమై సాగిస్తున్న రాజకీయం

-ఎమ్మెల్సీ ఎన్నికలు ఖర్చుతో కూడుకున్నవి

-ఒక సామాన్యమైన ఉద్యోగికి అంత సొమ్మెక్కడిది!

-జీతంలో ముప్పై శాతం సామాజిక కార్యక్రమాలు గొప్పల కోసమే

-ప్రభుత్వాల మీద కోచింగ్‌ సెంటర్ల ఆధిపత్యం కోసం కొత్త ఎత్తుగడ

-విద్యార్థుల జీవితాలు ఫణంగా పెట్టి సంపాదనా మార్గాలకు రాచబాట

అబద్దమాడరాదు..సత్యమునే పలుకవలెను..అని చెప్పాల్సిన గురువులు కొందరు పచ్చి అబద్దాలు చెప్పి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేస్తున్న బిఎస్పీ అభ్యర్ధి ప్రసన్న హరికృష్ణ గౌడ్‌ మాటలు అలాగే వున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనతో ఆయన కొంత కాలం క్రితం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి తాను ప్రజా సేవ కోసం ప్రజల్లోకి వచ్చానని, ప్రజా సేవ కోసం తన ఉద్యోగాన్ని తృణ ప్రాయంగా వదిలేశానని, కొలువుకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానని ప్రచారం మొదలు పెట్టారు. సహజంగా ఇలాంటి మాటలు విన్నవారికి ఎవరికైనా సరే అవునా? చాలా గొప్ప వ్యక్తి అన్న భావనే ఏర్పడుంది. చాలా మందికి అసలు నిజం తెలియదు. అంతలోతుగా కూడా ఎవరూ ఆలోచించరు. ఉద్యోగాల విషయంలో ఎలాంటి వెసులు బాటు వుంటుందో కూడా ఇతరులకు పెద్దగా అవగాహన వుండదు. దాంతో ఉన్నతమైన ఉద్యోగం వదిలి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాడేమో? అని జనం ఆలోచిస్తుంటారు. కాని అదంతా నిజంకాదు. ఇకపోతే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనతోనే గత కొంత కాలంగా చిన్నా చితక సామాజిక కార్యాక్రమాలు చేపడుతూ వస్తున్నానని ఆయనే చెబుతున్నారు. తనకు వచ్చే జీతంలో కొంత శాతం సమాజ సేవ కోసం ఖర్చు చేస్తున్నానంటూ చెబుతుండడం విడ్డూరం. ఆయనకు వచ్చే జీతమెంత? అందులో చేసే ఖర్చెంత? ఎందుకంటే ఆసుపత్రుల్లో పది మంది రోగులకు పండ్లు పంచినా అది సామాజిక సేవే…కాని మన సమాజంలో ఎంతో మంది కొన్ని కోట్ల రూపాయలు సమాజం కోసం ఖర్చు చేస్తూ గుప్త దానాలు చేస్తున్న వారు అనేక మంది వున్నారు. వాళ్లెవరూ ఇలా ప్రచారం చేసుకోరు. అసలు పేదలను ఆదుకునేందుకు విద్యా, వైద్య సహాయ కార్యక్రమాలు చేస్తున్నట్లు కూడా తెలియదు. కాని రాజకీయ భవిష్యత్తుకోసం ఆరాటపడే వాళ్లే ఇలా చిన్నా చితక సాయాలు చేసి పెద్దగా ప్రచారం చేసుకుంటారు. మీడియాలో వార్తలు రాయించుకొని ప్రచారంలో దూసుకుపోతుంటారు. ఉద్యోగానికి రాజీనామా చేసిననాడు కూడా ఇలాగే తన త్యాగం గురించి చెప్పుకొని మీడియా సమావేశం ఏర్పాటు చేసి, గొప్పలు చెప్పుకున్నారు. ఆ మరునాడు వచ్చిన మీడియా కథనాలను బ్రోచర్‌గా మార్చుకొని రాజకీయ పార్టీల వెంట ప్రసన్న హరికృష్ణ తిరిగారు. ముఖ్యంగా అదికార కాంగ్రెస్‌ పార్టీ చుట్టూ ప్రదక్షిణాలు చేశారు. కాని కాంగ్రెస్‌ పార్టీ ప్రసన్న హరికృష్ణను నమ్మలేదు. ఎందుకంటే హరికృష్ణ ఉద్యోగ జీవితమే పట్టుమని పదిహేనేళ్లు లేదు. రిటైర్‌ మెంటుకు దగ్గరకూడా లేరు. కాని ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం అడుగులు వేశారు. అందులోనూ పెద్దల సభను ముందుగా ఎంచుకున్నాడు. ఇక్కడే ఆయనలోని అత్యాశ కనిపించింది. ఒక సాధారణ వ్యక్తి రాజకీయంగా ఎదగాలనుకున్నప్పుడు చిన్న వయసు నుంచే కార్యకర్తగా మొదలై, అంచెలంచెలుగా ఎదుగుతుంటారు. లేకుంటే రిటైర్‌ అయ్యే సమయంలో రాజీనామాలు చేసి రాజకీయాల్లోకి వస్తుంటారు. కాని ఇంకా ఎంతో ఉద్యగ భవిష్యత్తు వున్న వ్యక్తి రాజీనామా చేశానని చెప్పి, ప్రజలను నమ్మించి రాజకీయాల్లో వస్తున్నానంటే ఎవరూ నమ్మరు. కారణం ఆ ఉద్యోగం ఎటూ పోదు. ఇంకా రెండేళ్లకైనా సరే ఆ ఉద్యోగం మళ్లీ వస్తుంది. అవసరమైతే ఆ జీతమంతా కలుపుకొని కొలువొస్తుంది. ఈ జిమ్మిక్కులు సామాన్యులకు తెలియవు. ఏదొ కారణం చెప్పి కోర్టును ఆశ్రయిస్తారు. ఇలా రాజీనామాలు చేసి, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మళ్లీ కొలువులు తెచ్చుకున్నవారు అనేక మంది వున్నారు. ఇలా ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయడం త్యాగం కాదు. ప్రజలను మోసం చేయడం. అద్యాపక వృత్తిలో వుంటూ నీతి, నిజాయితీని సమాజానికి పంచాల్సిన వ్యక్తి అబద్దాల పునాదుల మీద, అసత్యాలతో రాజకీయాలు చేయాలనుకోవడం తప్పు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ తన కొలువు తిరిగి తెచ్చుకోవడం కోసం న్యాయ స్దానాలను కూడా మోసం చేస్తారు. ఇలా కోర్టులను కూడా మోసం చేయగలిగిన వాళ్లు ప్రజలను మోసం చేయకుండా వుండగలరా? నల్లగొండ ఉపాధ్యాయ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధికూడా ఇలాగే తన ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీ చేస్తున్నారు. తర్వాత ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకొని, వారు కోరినంత ముట్ట జెప్పి, కోర్టును కూడా ప్రబావితం చేసి ఉద్యోగాలు తెచ్చుకుంటారు. అందువల్ల హరికృష్ణ చెబుతున్నది అబద్దమని, త్యాగం అసలే కాదని ఇక్కడే తేలిపోయింది. ఇంకా ఆయనను ప్రజలు నమ్ముతారని అనుకోవడం విచిత్రం. ఇక కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంటుగా పోటీకి నామినేషన్‌ వేసిన హరికృష్ణ కొంతకాలంగా తాను బిసినంటూ బిసీ వాదం వినిపిస్తూ వచ్చారు. బిసిలను సంఘటితం చేసి విజయం సాధిస్తాననుకున్నారు. కాని అటు వంటి దారి ఎక్కడా కనిపించలేదు. దాంతో రాత్రికి రాత్రి బిఎస్పీ కండువా కప్పుకున్నారు. బిఎస్పీ కార్యకర్తలైన పట్టుబద్రుల వద్దకు వెళ్లినప్పుడు బిఎస్పీ కండువా కప్పుకుంటున్నారు. ఇతర బిసి పట్టభద్రుల వద్దకు వెళ్లినప్పుడు బిసి కండువాతో ప్రచారం సాగిస్తున్నారు. తాను ఎంత ఊసరవెళ్లి రాజకీయాలను చేయగలనో ఇక్కడే ఆయన చూపించుకుంటున్నారు. ఈ రెండిరటికన్నా మరో భయంకరమైన నిజం హరికృష్ణ రాజకీయంలో దాగి వుంది. గత ప్రభుత్వ సమయంలో తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగాలు లేకున్నా, అప్పటి ప్రభుత్వం చెప్పే మాటలతో కోచింగ్‌ సెంటర్లన్నీ కళకళలాడుతుండేవి. కోచింగ్‌ సెంటర్లు కూడా ఇదిలో ఈ నోటిఫికెషన్‌ వచ్చే, ఆ నోటిఫికేషన్‌ వచ్చే అని ప్రచారం చేసుకోవడానికి వీలుండేది. ప్రభుత్వం నుంచి ఉద్యోగాల కల్పన ప్రకటన వచ్చిన నాటి నుంచి కోచింగ్‌ సెంటర్లప్రచాం మొదలు పెట్టేవి.తెలంగాణ వచ్చిన తర్వాత లక్ష ఉద్యోగాలు ఇస్తామని గత బిఆర్‌ఎస్‌పాలకులు చెప్పడంతో గ్రామీణ ప్రాంతాల పట్టభద్రులు పెద్దఎత్తున నగరాలకు చేరుకుంటూ వుండేవారు. ముఖ్యంగా హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, ఉమ్మడిజిల్లాల కేంద్రాలలో పెద్దఎత్తున వెలసిన కోచింగ్‌ సెంటర్లలో చేరేవారు. దాంతో కోచింగ్‌ సెంటర్లకు కోట్లాది రూపాయల ఆదాయం వచ్చేది. కాని ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు వేయడం నిర్ణీత గడువు ప్రకటించడం, పరీక్షలు నిర్వహించడం కోచింగ్‌ సెంటర్లబొచ్చేలో రాయి వేసినట్లైంది. కోచింగ్‌ సెంటర్లు వెలవెలబోతున్నాయి. కొన్ని దశాబ్ధాలుగా ఏటా కిటకిటలాడే కోచింగ్‌ సెంటర్లు మూసుకోవాల్సిన పరిస్ధితి విచ్చింది. ఆ మధ్య డిఎస్సీ, గ్రూప్‌ వన్‌ ల మీద పెద్దఎత్తున సొమ్ము చేసుకోవాలని చూసిన కోచింగ్‌ సెంటర్లు, అభ్యర్ధులను రెచ్చగొట్టి రోడ్లమీదకుతెచ్చింది. పరీక్షలు వాయిదా వేయాలని ఉద్యమాలు చేయించింది. అయినా ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా ఉద్యోగ పరీక్షలు నిర్వహించింది. దాంతో కోచింగ్‌ సెంటర్ల గొంతులో వెలక్కాయ పడినట్లైంది. ఇకపై ప్రభుత్వం తమ చెఫ్పుచేతుల్లో వుండాలన్న ఆలోచనతో కోచింగ్‌ సెంటర్లన్నీ ఏకమై ఎమ్మెల్సీ ఎన్నికల ఖర్చు భరించేందుకు ముందుకు వచ్చి, హరికృష్ణను రంగంలోకి దింపాయి. గుట్టు చప్పుడు కాకుండా కాంగ్రెస్‌ పార్టీనుంచి టికెట్‌ తెచ్చుకునేలా హరికృష్ణ కూడా వ్యూహం పన్నారు. ఎందుకంటే ఆయన ఓ వైపు కాంపిటీటివ్‌ పరీక్షల కోసం పుస్తకాలు రాస్తూ , అదనపు ఆదాయం సమకూర్చుకుంటుంటారు. కోచింగ్‌ సెంటర్లకు ద్వారా వాటిని అమ్ముకుంటుంటారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే ప్రభుత్వం కోచింగ్‌ సెంటర్ల చేతిలోకి వెళ్లిపోతుంది. పట్టభద్రుల నుంచి కోచింగ్‌ల పేరిట కోట్లు సంపాదించుకోవాలని చూశారు. కాని హరికృష్ణ ఆశలు కాంగ్రెస్‌ పార్టీ ద్వారా తీరలేదు. ఆయనకు టికెట్‌ రాలేదు. అయినా సరే కొండంత అండగా కోచింగ్‌ సెంటర్లు వుండడంతో ఆయన ఇండిపెండెంటుగా నామినేషన్‌ వేశారు. బిఎస్పీ కండువా కంప్పుకొని తిరుగుతున్నారు. ఈ విషయాలు పట్టభద్రులు తెలుసుకుంటే ఆయన అసలు నిజస్వరూపం తెలిసిపోతుంది. చైతన్య వంతులైన పట్టభద్రులను మోసం చేయడం ఎవరి వల్ల కాదన్నది ప్రజల అభిప్రాయం. ఎన్నికలంటేనే ఎన్నెన్నో లెక్కలు..విద్యలు..ఎత్తులు..జిత్తులు…కథలు…నటనలు..సానుబూతి పవనాలు. .ఇన్ని దాగి వుంటాయి. కాని కొన్ని ఎన్నికలు అలా వుండకూడదు. ముఖ్యంగా పెద్దల సభకు జరిగే ఎన్నికలైనా నీతిగా, నిజాయితీ వుండాలని రాజ్యాంగ పెద్దలు కొన్ని నియమనిబంధనలు ఏర్పాటు చేశారు. రాజకీయ పార్టీలు వాటిని కూడా తుంగలో తొక్కడం అలవాటు చేసుకున్నారు. ఎన్నికల వ్యవస్దలో వున్న లొసుగులను ఆసరాగా చేసుకుంటున్నారు. ఇక తీర్పునివ్వాల్సింది పట్టభద్రులే…

అన్న బెదిరింపులు..తమ్ముడి అర్థింపులు!!

`రెండు సంవత్సరాల క్రితమే విఆర్‌ఎస్‌ తీసుకున్న మహేందర్‌ రెడ్డి

`రాజీనామా చేసినా ఉద్యోగ సంఘంలో నాయకుడు చెలామణి

Vanga mahender reddy

`అటు రియలెస్టేట్‌ వ్యాపారం.. ఇటు రాజకీయం

`సులువుగా ఎమ్మెల్సీ కావాలనే దొడ్డి దారి రాజకీయం

`మొత్తానికి టిచర్స్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ గెలవాలన్న తాపత్రయం

`అడ్డదారిలో ఆధిపత్య కుటిల ప్రయత్నం

`పిఆర్‌టియు అభ్యర్థి వంగా మహేందర్‌ రెడ్డి అసత్యాలు ప్రచారం

`అన్నను అడ్డం పెట్టుకొని గెలిచేందుకు పన్నాగం

`అబద్దాలు ప్రచారం చేస్తూ గెలిచేందుకు విచిత్ర విన్యాసం

`పిఆర్‌టియు యూనియన్‌ విస్తుపోతున్న సందర్భం

`అన్న సహకారంతో జరుగుతున్న మంత్రాంగం

`డిఈఓలు, ఎంఈఓలతో ఒత్తిడి రాజకీయాలు

`ఎలాగైనా మహేందర్‌ రెడ్డి గెలవాలని డిఈఓలు, ఎంఈవోలు ఆర్డర్లు

`సైలెంట్‌గా సాగుతున్న మహేందర్‌ రెడ్డి ప్రచారం

`చాపకింద నీరులా సాగిస్తున్న రాజకీయం

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా సాధారణ రాజకీయాలను మించిపోయాయి. ఉద్యోగ సంఘాలు కూడా టిక్కెట్లు అమ్ముకునే స్ధాయికి ఎదిగిపోయాయి. ఇది ఎవరో కాదు సాక్ష్యాత్తు ఓ టీచర్‌ ఎమ్మెల్సీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఒక సామాన్యమైన ఉపాద్యాయుడు కోట్లు పెట్టి టిచర్‌ ఎమ్మెల్సీ టికెట్‌ కొనుక్కునే పరిస్దితి వుంటుందా? అప్పులు చేసినా సాధ్యమౌతుందా? కాని టిక్కెట్ల పంపిణీలో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు కూడా స్వయంగా ఆ టీచర్‌ ఎమ్మెల్సీ మీడియా ముఖంగా చెబుతున్నాడంటే రాజకీయాలు ఎంత ఖరైదైపోతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఒక సగటు ఉపాధ్యాయుడు కరీంనగర్‌ టీచర్స్‌ ఎమ్మెల్సీ టికెట్‌ కోట్లు పెట్టి ఎలా కొనుగోలు చేశాడు. దాని వెనుకు వున్న నిగూఢమైన రహస్యమేటి? రోజూ స్కూలుకు వెళ్లి పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు కోట్ల రూపాయలు సంపాదించడం సాద్యమా? అంటే కొన్ని సార్లు సాధ్యమే..కాని అసలైన ఉపాధ్యాయుడు కాదు…ఉపాధ్యాయ కొలువును అడ్డం పెట్టుకొని రియల్‌ వ్యాపారాలు సాగించి, ఫైనాన్స్‌ వ్యవహారాలు నిర్వహించే వారికి మాత్రమే సాధ్యం. అలా కరీంనగర్‌ ఉపాద్యాయ ఎమ్మెల్సీని పేరు పొందిన ఉపాద్యాయ సంఘం నుంచి వంగ మహేందర్‌ రెడ్డి ఎలా కొనుగోలు చేసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఈ ఎమ్మెల్సీ అభ్యర్ధి స్వయాన అన్న వంగ రవీందర్‌ రెడ్డి. ఆయన తెలంగాణ రెవిన్యూ అసోసియేషన్‌ రాష్ట్ర అద్యక్షుడు. ఈ వ్యవహారమంతా ఆయనే దగ్గరుండి నడిపిస్తున్నాడని అంటున్నారు. అందులో భాగంగా రవీందర్‌ రెడ్డి నాలుగు ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్‌, మెదక్‌, నిజాబామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన డిఈవోలు, ఏంఈవోలపై పెద్దఎత్తున ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. తన తమ్ముడు వంగ మహేందర్‌ రెడ్డి గెలుపుకోసం అందరూ సహకరించాలని ఆయన ఆర్డర్లు వేస్తున్నట్లు చెబుతున్నారు. డీఈవోలు, ఎంఈవోలపై ఒత్తిడి తెచ్చి, ఉపాద్యాయులకు వారితో ఫోన్లు చేయిస్తున్నట్లు కూడా చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై భారతీయ జనతాపార్టీ ఏకంగా ఎన్నికల కమీషన్‌కు ఉత్తరంకూడ రాశారు. వంగా రవీందర్‌ రెడ్డి తన తమ్ముడు వంగా మహేందర్‌ రెడ్డి గెలుపుకోసం ఉపాద్యాయులు మీద తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నట్లు ఎన్నికల కమీషన్‌కు వివరించారు. ఇక అసలు విషయానికి వస్తే వంగా మహేందర్‌రెడ్డి ఉపాద్యాయ కొలువులో చేరినప్పటినుంచి పిఆర్‌టీయూ యూనియన్‌లో క్రియాశీలకంగా పనిచేయడం మొదలు పెట్టారు. అప్పటికే తన అన్న రవీందర్‌రెడ్డి కూడా ఆయన కొలువు చేస్తున్న శాఖలో నాయకత్వం ఎలా చేస్తున్నాడో చూసిన మహేందర్‌ రెడ్డి కొలువులో చేరిన కొద్ది రోజులకే నాయకుడయ్యారు. చదవు చెప్పడం గాలికి వదిలేశాడు. రేపటి తరాన్ని తీర్చిదిద్దాల్సిన మహేందర్‌ రెడ్డి యూనియన్‌ రాజకీయాలు మొదలు పెట్టారు. చదువు చెప్పాల్సిన అవసరం లేకుండా చేసుకున్నాడు.

అలా అంచెలంచెలుగా యూనియన్‌లో ఎదుగుతూ వచ్చారు. 2004 తర్వాత తెలంగాణలో వచ్చిన రియల్‌ బూమ్‌ను ఆసరా చేసుకున్నాడు. అటు ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే రియల్‌ వ్యాపారం మొదలు పెట్టారు. రియల్‌ వ్యాపారాన్ని కూడా టీచర్లతోనే మొదలు పెట్టి, వ్యాపారాన్ని పెంచుకున్నాడు. అలా కొలువును గాలికి వదిలేసి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఇక ఇదిలా వుంటే పేద ప్రజలకు చదువు చెప్పాల్సిన కొలువులో వుంటూ, వారి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన బాధ్యత విస్మరించారు. సిద్దిపేటలో కార్పోరేట్‌ స్కూల్‌ ఏర్పాటు చేశాడు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు తాను కొలువు చేసే చోట విద్యా కుసుమాలను వికసింపచేయాల్సిందిపోయి, తన ప్రైవేటు స్కూల్‌లో చదువు పేరుతో దోపిడీ మొదలు పెట్టాడు. అటు రియల్‌ వ్యాపారం, ఇటు ప్రైవేటు కార్పోరేట్‌స్కూలు, మహేందర్‌రెడ్డికి మరో సోదరుడి పేరు మీద కొన్ని కళాశాలలో పార్టనర్‌ షిప్‌లో పూర్తిగా విద్యా వ్యాపారం మొదలు పెట్టారు. అన్న రెవిన్యూ అసోసియేషన్‌ అధ్యక్షుడుగా వుండడం, ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలున్నాయో గుర్తించడం, వాటిని తమకు అనుకూలంగా మల్చుకోవడం, అక్కడ రియల్‌ వ్యాపారం చేయడం మొదలు పెట్టారు. అయితే తమ వ్యాపారాలపై ఎవరి కన్ను పడకుండా ఓ స్వచ్ఛంద సంస్ధను ఏర్పాటు చేశారు. ఈ సంస్ధనిర్వహణకు మరో వైపు పెద్దఎత్తున విరాళాలు సేకరించడం అలవాటు చేసుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఆ సంస్థ నిర్వహణ కోసం అటు నిధులసేకరణను తోడు చేసుకొని రాజకీయాల్లోకి వచ్చేందుకు మార్గం వేసుకున్నాడు. కొన్ని స్కూళ్లలో వాటర్‌ ప్లాంటులుఏర్పాటుచేసి విద్యా వ్యవస్ధకు మేలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నాడు. రెండు సంవత్సరాల క్రితం తన ఉద్యోగానికి వాలెంటరీ రిటైర్‌ మెంటుతీసుకొని ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వ్యూహాలు మొదలు పెట్టారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత కూడా వంగ మహేందర్‌ రెడ్డి ఎలా ఉపాద్యాయ సంఘం నాయకుడుగా వుంటారు. ఎలా ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి అర్హుడౌతాడు. కేవలం ఎన్నికల కోసం కొద్ది రోజుల ముందు రాజీనామా చేశారంటే అదీ కాదు. రెండు సంవత్సరాల క్రితమే రాజీనామా చేశారు. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే ఆ కొలువును అలాగా వదిలేస్తారా? అంటే అదీ వుండదు. అదృష్టం వుండి గెలిస్తే ఎమ్మెల్సీ అవుతారు. లేకుంటే ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకొని మళ్లీ ఉపాద్యాయ కొలువులో చేరుతారు. ఇలాంటి జిత్తుల మారి రాజకీయాలు చాలా మంది చేస్తున్నారు. అందులో వంగా మహేందర్‌ రెడ్డి ఒకరు. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చులో ఎమ్మెల్సీ కావాలనుకునే కొంత మంది ఈ దారిని ఎంచుకున్నారు. అటు అన్న రెవిన్యూ అసోసియేషన్‌ ద్వారా తన పలుకుబడిని ఉయోగిస్తున్నాడు. రవీందర్‌ రెడ్డిపై కూడా పెద్దఎత్తున ఆరోపణలున్నాయి. తన ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని వేల కోట్లు సంపాదించారనే అపవాదు వుండనేవుంది. సంపాదించిన ఆస్ధులను కాపాడుకోవాంటే తన తమ్ముడు ప్రజా ప్రతినిధి కావడం ఒక్కటే మార్గం అనుకున్నారు. ఇలా సులువైన మార్గంలో ఎమ్మెల్సీ కావడం రవీందర్‌రెడ్డికి దారి లేదు. తిమ్మిని బమ్మిని చేసి రికార్డులు మార్చి, ఆక్రమణదారులకు సహకరించి, సంపాదించిన సొమ్ముతో తమ్ముడితో రియల్‌ వ్యాపారం రవీందర్‌ రెడ్డి సంపాదించారు. అలా అన్నదమ్ములంతారూ అక్రమంగా సంపాదించిన సొమ్మును కాపాడుకోవాలంటే టీచర్స్‌ ఎమ్మెల్సీ ఒక్కటే మార్గమని ఎంచుకున్నారు. ఇది టీచర్స్‌ యూనియన్‌లోని సభ్యులే చెబుతున్నమాట.

ఓ ఎమ్మెల్సీ మీడియా సమావేశంలో పూసగుచ్చినట్టు చెప్పిన ముచ్చట. ఒక నిబద్దత గలిగిన గురువు విద్యార్టులకు విద్యతోపాటు విద్యా వ్యవస్ధలో రావాల్సిన నూతన ఆవిష్కరణల గురించి మాట్లాడతారు. ప్రభుత్వ విద్యా వ్యవస్ధ మేలు కోసం పనిచేస్తాడు. అలాంటి ఉపాధ్యాయులను ఎమ్మెల్సీలు చేయడానికి సంఘాలకు కూడా చేతులు రావడం లేదు. టిక్కెట్లు అమ్ముకునే యూనియన్లు వుంటే మహేందర్‌ రెడ్డి లాంటి టీచర్లే ఎమ్మెల్సీ కావాలని కలలు గంటారు. ముఖ్యంగా ఈ దారి ఎంతో సులువైంది. తాను ఉపాద్యాయుడై రేపటి తరానికి దారి చూపుతాననుకునే ఏ ఉపాద్యాయుడు తన వృత్తికి ద్రోహం చేయడు. కాని ఉపాద్యాయ కొలువు పొంది, రాజకీయాలను లక్ష్యంగా చేసుకునే కొంతమంది ఇలా ప్రభుత్వాలను మోసం చేస్తుంటారు. పదవులు అడ్డం పెట్టుకొని కొలువులు చేయకుండా రాజకీయాలు చేస్తుంటారు. లేనిపోని హమీలు ఎంతో చైతన్యవంతులైన ఉపాద్యాయులకే చెబుతుంటారు. సాటి ఉపాద్యాయులను కూడా మోసం చేస్తుంటారు. పాత పెన్షన్‌ విధానం తీసుకురావడం అసలు సాధ్యమా? ప్రభుత్వాలతోనే సాధ్యం కాని ఆ విదానం టీచర్‌ ఎమ్మెల్సీలతో సాధ్యమౌతుందా? దేశ వ్యాప్తంగా అమలౌతున్న కొత్త విధానంలో మార్పు చేయడానికి కేంద్ర ఒప్పుకుంటుందా? అది అమలు రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యపడుతుందా? కేంద్రం అంగీకరించకుండా జరుగుతుందా? విద్య అనేది రాష్ట్ర స్ధాయిలో వుండే అంశం కాదు. ఉమ్మడి అంశం. కేంద్రం జోక్యం లేకుండా ఎలాంటి నిర్ణయాల అమలు సాధ్యంకాదు. కాని తమ రాజకీయ భవిష్యత్తు కోసం, ఎన్నికల్లో గెలవడం కోసం ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడై వుండి, యూనియన్‌ సభ్యులను మోసం చేసేవారిని ఎలా ఎన్నుకుంటారో కూడా టీచర్లే ఆలోచించుకోవాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version