తాటిపల్లి చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్ మృతి

తాటిపల్లి చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని న్యాల్కల్ మండలం తాటిపల్లి చౌరస్తా వద్ద శుక్రవారం సాయంత్రం ఆటో, కారు ఢీకొనడంతో కుసునూరు గ్రామానికి చెందిన మల్లేష్ రెడ్డి (35) అనే ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయన అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాటిపల్లి చౌరస్తాలో జరుగుతున్న వరుస ప్రమాదాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రమాద నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version