మహాశివరాత్రికి 10 ప్రత్యేక బస్సులు: ఆర్ఎం విజయ్ భాస్కర్…

మహాశివరాత్రికి 10 ప్రత్యేక బస్సులు: ఆర్ఎం విజయ్ భాస్కర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఝరాసంగం క్షేత్రానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం జహీరాబాద్ డిపో నుంచి 10 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్ఎం విజయ్ భాస్కర్ తెలిపారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని, భక్తుల రద్దీని బట్టి అదనపు బస్సులు కూడా నడుపుతామని ఆయన పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఒక్క భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతో రద్దీనిబట్టి బస్సులు నడుపుతామన్నారు,

తిరుపతి నుంచి సాయినగర్‌ షిర్డీకి వీక్లీ రైలు..

తిరుపతి నుంచి సాయినగర్‌ షిర్డీకి వీక్లీ రైలు..

 

 

తిరుపతి నుంచి సాయినగర్‌ షిర్డీకి వీక్లీ రైలును రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. ఈ రెండు ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య వీక్లీ రైలు ఏర్పాటుచేయడం వల్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరైలు మంగళవారం నుంచి ప్రారంభమైంది.

తిరుపతి: తిరుపతి, సాయినగర్‌ షిర్డీ.. ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య అనుసంధానం పెరిగేలా, భక్తుల సౌకర్యార్థం వీక్లీ రైలును ప్రారంభించారు. ఢిల్లీ నుంచి మంగళవారం కేంద్ర రైల్వే సహాయ మంత్రి వి.సోమన్న వర్చువల్‌గా ప్రారంభించగా, తిరుపతి ఎంపీ గురుమూర్తి పాల్గొన్నారు. అదే సమయంలో తిరుపతిలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దనరెడ్డి, రైల్వే జీఎం సంజయ్‌ కుమార్‌ శ్రీవాత్సవ, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీటీడీ సభ్యుడు జి.భానుప్రకాష్‌ రెడ్డి, డిప్యూటీ మేయర్‌ ఆర్‌సీ మునికృష్ణ
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version