కౌటాలలో పులి అడుగులు గుర్తింపు..

కౌటాలలో పులి అడుగులు గుర్తింపు

 

ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండంలో పులి అడుగులను గుర్తించారు. ఈ గ్రామం అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ సరిహద్దులో ఉంది. అయితే… ఈ సరిహద్దులో దట్టమైన అడవితోనాటు వార్ద నది కూడా ఉంది. కాగా… నది ఒడ్డున పులి పాదముద్రలను గుర్తించారు. దీంతొ సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

కౌటాల(ఆదిలాబాద్): తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని వార్దా నదిలో శుక్రవారం పులి అడుగులను స్థానికులు గుర్తించారు. మండలంలోని తాటిపల్లి(Thatipalli) గ్రామ సమీపంలోని మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లా థరూర్‌ గ్రామ సమీపంలోని వార్ద నదిలో పులి అడుగులను స్థానికులు గుర్తించి మహారాష్ట్ర అటవీ అధికారులకు సమాచారం అందించారు. మహారాష్ట్ర అటవీ అధికారులు పులి అడుగులను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేశారు.
పులి(Tiger) అడుగులు వీడియో సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొట్టడంతో స్పందించి కౌటాల సెక్షస్‌ అటవీ అధికారులు తులసీరాం, శ్రీదేవిలు వార్దా నది పరిసరాలను పరిశీలించారు. తెలంగాణ వైపు పులి అడుగులు లేనప్పటికీ ప్రజలను అప్రమత్తం చేశారు. తాటిపల్లి గ్రామంలో చాటింపు వేయించారు.రైతుల చేన్లలో వెళ్లినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పులి అనవాళ్లు కనిపించినట్లయితే వెంటనే తమకు సమాచారం అందించాలని తెలిపారు.

మావోయిస్టు పార్టీ భారత్ బంద్ పిలుపు…

మావోయిస్టు పార్టీ భారత్ బంద్ పిలుపు

రాష్ట్ర సరిహద్దులో హై అలర్ట్ చేసిన పోలీసులు

జైపూర్,నేటి ధాత్రి:

 

మావోయిస్టు అక్రమ కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ భారత్ బంద్ కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో రామగుండం కమీషనరేట్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో చెన్నూర్ రూరల్ పోలీస్ లు విస్తృత తనిఖీలు చేపట్టారు.సరిహద్దు వెంబడి ప్రాణహిత నది ఫెర్రీ పాయింట్స్ ను రహదారుల వెంబడి కల్వర్ట్స్ అదేవిధంగా వాహనాల తనిఖీ ముమ్మరంగా చేపట్టారు.ఈ తనిఖీలలో చెన్నూర్ రూరల్ సీఐ బన్సీలాల్,కోటపల్లి ఎస్సై రాజేందేర్,కోటపల్లి,నీల్వాయి పోలీస్ లు మరియు స్పెషల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version