కొమురయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది.
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలో ఇటీవల మృతి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారుడు గుండెబోయిన కొమురయ్య కుమారులు శివకోటి,హరి ప్రసాద్ కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముందుగా కూర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర సభ్యులు రాయుడి రవీందర్ రెడ్డి,పట్టణ అధ్యక్షుడు నాగేల్లి వెంకటనారాయణ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి వేనుముద్దల శ్రీధర్ రెడ్డి,ప్రచార కార్యదర్శి,మాజీ కౌన్సిలర్ మండల శ్రీనివాస్,మాజీ మార్కెట్ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, దేవుడు సదానందం, గంప రాజేశ్వర్, రావుల సతీష్, బీరం నాగిరెడ్డి, సంపంగి సాలయ్య, పైసా ప్రవీణ్,11వ వార్డు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.