నేటి ధాత్రి నర్సంపేట టౌన్
పరీక్షల ఒత్తిడిని వీడాలి
– సైకాలజిస్ట్ జక్కోజు విజయ్
ఈరోజు జెడ్పిహెచ్ఎస్ మహేశ్వరం పాఠశాలలో బంగారు తల్లి ఫౌండేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్రేరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్ విజయ్ జక్కోజు మాట్లాడుతూ విద్యార్థులు మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా చేయాలని, వ్యసనాలకు లోను కాకుండా మీ మనసును చదువు పైన పెట్టాలని భవిష్యత్తులో ఉన్నతమైన లక్ష్యాలతో, చక్కటి క్రమశిక్షణతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చెప్పినట్టుగా నడుచుకోవాలని తెలిపారు. పరీక్షలంటే భయాన్ని వీడాలని బట్టి విధానానికి స్వస్తి పలకాలని, పోటీపడి, ఇష్టపడి చదవాలని అప్పుడే మీరు అనుకున్న కలలు నెరవేరుతాయని తెలిపారు. జీవితంలో గెలుపు ఓటమి సహజం. పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన నిరాశ పడకూడదు. ఓటమి గెలుపుకు నాంది. చదువుతోపాటు సంస్కారం నైతిక విలువలు కలిగి ఉండాలని, మీకు ఆసక్తి ఉన్న రంగాలలో కూడా రాణించాలని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి స్వరూప, అర్జున్ సాగర్, వేణుబాబు, రమేష్, శ్రీలత మొదలైన వారు పాల్గొన్నారు
