నియోజకవర్గం లో అపరిశుభ్రంగా మారిన చాలా గ్రామాలు…… !!!
◆”-: పర్యవేక్షణ లేని డి ఎల్ పీ ఓ ???
జహీరాబాద్ నేటి ధాత్రి:
పల్లెలే పట్టుకొమ్మలన్నారు ఆనాడు మహాత్ముడు.కానీ నేటి కాలంలో కూడా ఈ గ్రామాలు శుభ్రతకు నిలయాలుగా మారుతున్నాయి.జహీరాబాద్ ప్రాంతానికి కూతపట్టు దూరంలో ఉన్న ఈ గ్రామాలల్లో ఎక్కడ చూసినా చెత్త చెదారంతో నిండిపోయి దుర్వసన వెదజల్లుతు ఉన్నాయి. నియోజకవర్గం స్థాయి అధికారి డి ఎల్ పీ ఓ పర్యవేక్షణ లోపం వలన జహీరాబాద్ నియోజకవర్గం లో ఉగ్గెల్లి,దిగ్వాల్,గోడిగార్ పల్లి, గంగ్వర్, చిక్కుర్తి, రాజోల, న్యాల్కల్, రత్నాపూర్ తదితర గ్రామాలలో పారిశుద్ధ్యం కుంటుపడుతున్నా ఎవరు పట్టించుకోకపోవడంతో ప్రజలకు ఇఇబ్బందులు ఎదురావుతున్నాయి.
డంపింగ్ యార్డ్ లకు చెత్తను తరలించకపోవడం వలన ఎక్కడి చెత్త అక్కడేనా ఉండి పోవడంతో ఇండ్ల మధ్యలో దుర్వాస వేదజల్లుతుంది అని ప్రజలు ఆవేదన చెండుతున్నారు. దోమల మందు కొట్టకపోవడం వలన దోమలు కుట్టడం వలన జబ్బుల బారిన పడి జబ్బులు ఎక్కువైనా ఎవ్వరు పట్టించుకోవడం లేదని, దోమల మందు కొట్టడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. గ్రామాలకు బడ్జెట్ ఎప్పటికప్పుడు వస్తున్నప్పటికీ సంబంధిత డి ఎల్ పి ఓ అధికారి పర్యవేక్షణ లేకపోవడం, కొత్త సర్పంచులకు అందుబాటులో లేకపోవడం వలన వారికీ సలహాలు సూచనలు ఇవ్వకపోవడం వలన డబ్బులను ఏ విధంగా ఖర్చు పెట్టాలో తెలు వక అయోమయంలో ఉన్నామని ఆవేదన చెండుతున్నారు. గత రెండు సంవత్సరాల నుండి ప్రత్యేక అధికారుల పాలన పేరు చెప్పి డబ్బులను కాజేయాలనీ కొంతమంది కాంట్రాక్టర్లు చూస్తున్నారని సర్పంచులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.నియోజకవర్గంలో డివిజనల్ స్థాయి కార్యాలయం లేదంటే ఆ అధికారి పనితీరు ఎలా ఉందో జిల్లా స్థాయి అధికారులు అర్థం చేసుకోవాలని ప్రజలు మండీ పడుతున్నారు. ఈప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు ద్రుష్టి పెట్టి డి ఎల్ పీ ఓ పైన చర్యలు తీసుకోని,గ్రామాలలో తిరిగేటట్లు చూడాలని,గ్రామాలలో పేరుకుపోయిన చెత్త చెదారం తొలగించ్చేటట్లు చేసి డంపింగ్ యార్డ్ లను వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.
