భ్రమరాంబ మల్లికార్జున స్వామివారికి లక్ష పుష్పార్చన
నేటి ధాత్రి , పఠాన్ చేరు :
కార్తీకమాస ఏకాదశి సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారికి శనివారం నాడు లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ
ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది అందరి సహకారంతో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగిందని
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు
వచ్చే బుధవారం కార్తీక పౌర్ణమి దీపోత్సవం ప్రత్యేకంగా
నిర్వహించడం జరుగుతుందని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు
ఈకార్యక్రమంలో ఈవో శశిధర్, ఆలయ అర్చకులు ప్రహ్లాద్,
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
