3 వ రోజుకు చేరుకున్న శ్రీశైలం పాదయాత్ర
జహీరాబాద్ నేటి ధాత్రి:
శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి క్షేత్రం నుండి శ్రీశైలం
శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి మహాక్షేత్రం వరకు 24 వ. మహా పాదయాత్ర శివ నామ స్మరణ చేస్తూ..ఝరాసంగం నుంచి శ్రీశైలంకు ఝరసంగం గ్రామానికి చెందిన భక్తులు పాదయాత్రగా శుక్రవారం బయలుదేరారు. 3 వ రోజు వికారాబాద్ నుండి ఉదయం పాదయాత్ర గా తరలి వెళ్ళడం జరిగింది. పరమ శివుని ఆశీస్సులతో పాదయాత్ర దిగ్విజయం కావాలని వేడుకుంటున్నామన్నారు. భక్తులు సుమారు 300 కిలో మీటర్ల పాదయాత్రను పది రోజుల పాటు కొనసాగిస్తారని, శ్రీశైలంలో స్వామిని దర్శించుకున్న అనంతరం పాదయాత్ర ముగుస్తుందన్నారు. ఈ పాదయాత్రలో సంగయ్య స్వామి, వీరు సజన, శ్రీనివాస్, శివరాజ్ సింగ్, శివకుమార్, సను రాక్ తేజ, విజయ బసవ, ఓంకార్, మహేష్, రాజు, అభిషేక్ పటేల్, భక్తులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
