పిల్లలకు మెకానిక్ అసోసియేషన్ చేయూత..
తిరుపతి(నేటిధాత్రి)
లక్ష్మీపురం లోని అంగనవాడి ప్రైమరీ స్కూల్లో చిన్నపిల్లలకు భోజన సౌకర్యార్థం తిరుపతి టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ సిలిండర్ స్టవ్ మంగళవారం వితరణ చేసి. తమవంతు చేయూత అందించారు. అలాగే ప్రైమరీ స్కూల్లోని పిల్లలకు బిస్కెట్స్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఆవుల మునిరెడ్డి. గౌరవ అధ్యక్షుడు జలంధర్. కార్యదర్శి గురు ఆచారి. అంగన్వాడి ప్రైమరీ స్కూల్ నిర్వాహకులు
జి.గీత.కే. చెంచమ్మ పాల్గొన్నారు.
