పల్లెల్లో పంచాయతీ ఎన్నికల పోరు..
నువ్వా! నేనా! అన్నట్టు అభ్యర్థుల ప్రచారాలు.
గ్రామాల్లో ఎన్నికల దావతులు..
నిజాంపేట: నేటి ధాత్రి
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల పోరు మొదలైంది. నిజాంపేట మండల వ్యాప్తంగా కొన్ని గ్రామాలు ఏకగ్రీవం కాగా మరికొన్ని గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే గ్రామాల్లో ఎన్నడు లేని విధంగా సంబంధాలను కలుపుకుంటూ పలకరింపులు కొనసాగుతూ ఉన్నాయి. అభ్యర్థులు తమ అనుచరులతో ఉదయం నుండి మొదలుకొని రాత్రి వరకు గ్రామాల్లో ప్రచారాలు కొనసాగిస్తూ.. ఉన్నారు. మరి కొంతమంది కులాల కట్టుబడుతూ ముందుకు దూసుకుపోతున్నారు. కొంతమంది అభ్యర్థులు పార్టీ పేరుతో ప్రజల ముందుకు వెళ్లి ఓటును ఆశిస్తున్నారు. అభ్యర్థులు తమ అనుచరులు తమ దాటి వెళ్లకుండా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి దావత్ లతో గ్రామాలు మునిగిపోతున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ స్థానిక ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసేది ఎవరు ? అనేది ఆసక్తిగా మొదలుకుంది. అయితే ఈ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువగా యువతనే పాల్గొంటున్నట్లు కూడా సమాచారం ఉంది.
