షార్ట్ సర్క్యూట్ తో పూజా స్టోర్ దగ్దం దురదృష్టకరం…

షార్ట్ సర్క్యూట్ తో పూజా స్టోర్ దగ్దం దురదృష్టకరం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి పట్టణంలోని కాళేశ్వరం రోడ్డులో మహేశ్వర పూజా స్టోర్ షార్ట్ సర్క్యూట్ తో దగ్దం అవ్వడం దురదృష్టకరమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. షార్ట్ సర్క్యూట్ తో బుక్క దుకాణం పూర్తిగా కాలిపోయిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత వ్యాపారిని పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ ప్రమాదం దురదృష్టకరమన్న ఎమ్మెల్యే, ప్రభుత్వం తరఫున అందుబాటులో ఉన్న అన్ని విధాలా సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ భద్రతా చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అగ్నిప్రమాదాల పట్ల వ్యాపారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు గౌడ్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దేవన్ షాపు ఓనర్స్ తదితరులు పాల్గొన్నారు

పలు కుటుంబాలను పరామర్శించిన తక్కళ్లపల్లి రాజు…

పలు కుటుంబాలను పరామర్శించిన తక్కళ్లపల్లి రాజు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని లోని పాత ఇస్సిపేట గ్రామం లో పలు కుటుంబాలను పరామర్శించిన తక్కళ్లపల్లి రాజు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నేర్పాటి పోషమ్మ, నేర్పాటి లింగమ్మ, బొచ్చు సారయ్య ఇంటి వద్దకు వెళ్లి వారి చిత్ర పటానికి పూలు వేసి ఘన నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసి రైస్ బ్యాగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తక్కళ్లపల్లి రాజు వెంట గ్రామ సర్పంచ్ పెనుకుల గట్టన్న, మూడో వార్డ్ మెంబర్ బొచ్చుఅర్చన(కిషన్), గ్రామ కాంగ్రస్ అధ్యక్షుడు నేర్పాటి జంపయ్య,సీనియర్ నాయకులు పెద్ద మొగిలి,మస్ అన్నపూర్ణ,కటిక అనిల్ ,పసరగొండ శ్రీను,బొచ్చు లడ్డు(తిరుపతి) తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version