నేటిధాత్రి కథనానికి స్పందన
* అసైన్డ్ భూముల కబ్జాపై సర్వేచేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
* అసైన్డ్ భూములపై విచారణ జరిపి అమ్మినట్టు తెలితే నోటిసులిచ్చి భూములు స్వాధీనం చేసుకుంటాం
* అసైన్డ్ భూముల కబ్జా చేస్తే చట్టపర చర్యలు తప్పవు
* చేవెళ్ల తాసిల్దార్ కృష్ణయ్య
చేవెళ్ల, నేటిధాత్రి:
కమ్మెట గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 217 లొని ప్రభుత్వ అసైన్డ్ భూములలోనుండి ప్రైవేటు ఫామ్ హౌస్ లకు దారి వేశారన్నా ‘ నేటి ధాత్రి ‘ కథనానికి చేవెళ్ల తాసిల్దార్ స్పందించారు. చేవెళ్ల మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ ఐ మోహన్ కబ్జాకు గురైన అసలు భూములను పరిశీలించారు. ఈ అసైన్డ్ భూములను ఆనుకుని ప్రహరీ గేటు నిర్మించిన ప్రైవేట్ వ్యక్తులకు గేటును తొలగించాలని ఆదేశించారు. దీనిపై సర్వే నిర్వహించి అసైన్డ్ భూముల హద్దులు కనుకుంటాం. ఈ అసైన్డ్ భూములను విక్రయించారన్న ఆరోపణలపై విచారణ జరిపిస్తాం. విచారణలో అసైన్ భూములు విక్రయించారని తెలితే 9/77 పి ఓ టి చట్టం ప్రకారం నోటీసులు ఇచ్చి భూములను స్వాధీనం చేసుకుంటామని తాసిల్దార్ కృష్ణయ్య తెలిపారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భూమిలేని నిరుపేదలకు బతుకుదెరువు కోసం ప్రభుత్వం అసైన్డ్ భూమి ఇచ్చిందని, ఇందులో వ్యవసాయం చేసుకొని ఆ కుటుంబం జీవనం సాగించాలి తప్ప మరొకరికి విక్రయించేందుకు అధికారం రైతుకు లేదన్నారు.రెవెన్యూలోని అసైన్డ్ చట్టాన్ని ఉల్లంఘిస్తే అసలుకే మోసం వస్తుందని హెచ్చరించారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం తమ అసైన్డ్ భూములను ఇతరులకు అప్పగిస్తే దాన్ని సాకుగా చూపి పీవోటీ కింద నేరుగా స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి, రెవెన్యూ అధికారులకు ఉందని స్పష్టం చేశారు. కొంతమంది లీజ్ పేరిట నోటరీ ద్వారా అసైన్డ్ క్రయ విక్రయాలు జరుపుతున్నట్టు మాదృష్టికి వచ్చింది.ఒకవేళ నిజంగానే అసైన్డ్ భూములు అమ్మినట్టు తెలితే రెవెన్యూ చట్టం ప్రకారం నేరుగా భూములను స్వాధీనం చేసుకుంటామని అన్నారు.