Heatwave Leaves Parakala Streets Empty
పరకాలలో ఎండ తీవ్రత వీధులు నిర్మానుష్యం
పరకాల,నేటిధాత్రి
వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పరకాల పట్టణంలో ప్రజలు మధ్యాహ్న వేళల్లో బయటకు రావడానికి వెనుకంజ వేస్తున్నారు.అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రధాన రహదారులు కూడా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.మధ్యాహ్న సమయంలో సాధారణంగా రద్దీగా ఉండే ప్రాంతాలు సైతం ఖాళీగా మారాయి.అత్యవసర పనులు ఉన్నవారే బయటకు వస్తుండగా,మిగతా ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.వేడి గాలులు కారణంగా వృద్ధులు,చిన్నారులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రోడ్లపై వాహనాల రాకపోకలు కూడా గణనీయంగా తగ్గినట్లు కనిపిస్తోంది.కొంతమంది వ్యాపారులు తమ దుకాణాలను మధ్యాహ్న సమయంలో మూసివేస్తూ సాయంత్రం తర్వాతే తిరిగి ప్రారంభిస్తున్నారు.ప్రస్తుతం ఉష్ణోగ్రతలు మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
