అస్మదీయులే అసలు దొంగలు!?
నియోజకవర్గాల వారీగా బీ.ఆర్.ఎస్ నాయకుల బాగోతాలు ఎపిసోడ్ 1
“నేటిధాత్రి, డి ప్యాక” సంయుక్త సర్వేలో నియోజకవర్గాల వారీగా “బిఆరఎస” ఓటమిపై వెలుగు చూస్తున్న సంచలన నిజాలు వరుసగా మీ “నేటిధాత్రి”లో.
`అపోహలు అనర్ధాలకు దారితిస్తాయని చెప్పడానికి కామారెడ్డి నిదర్శనం.
`చరిత్ర లో పగవాడికి కంటే పక్కనున్న వారే వెన్నుపోటు పొడుస్తారానే దానికి నిదర్శనం.
`కామారెడ్డి నుంచి కెసిఆర్ గెలిస్తే తన చేతుల్లోంచి కామారెడ్డి పోతుందని బయపడిన గంప గోవర్ధన్?
`మళ్ళీ ఎమ్మెల్యే గా జీవితంలో అవకాశం రాదని బయపడిన గోవర్ధన్?
`కేసీఆర్ గెలిస్తే ఆ సీటు కవితకు ఇస్తారని జరిగిన ప్రచారం?
`కవిత కు ఇస్తే ఇక జన్మలో తాను ఎమ్మెల్యే కానని ఆందోళన చెందిన గంప?
`సీఎం. రేవంత్ రెడ్డి పోటీ చేయడంతో ప్రచారం మానుకున్న గోవర్ధన్?
`పార్టీ ఇచ్చిన ఫండ్ కూడా ఖర్చు చేయలేదని నాయకుల అగ్రహం?
`బహిరంగానే అప్పుడే నిలదీసిన కార్యకర్తలు?
`ఆ విషయాలు వెలుగులోకి రాకుండా జాగ్రత్త పడిన గోవర్ధన్?
`గంప వ్యవహారం తేడా కొడుతుందని అనుమాన పడిన పార్టీ క్యాడర్?
`వివాదాలు ముసిరితే మొదటికే మోసం వస్తుందేమో అని మౌనం వహించిన నాయకులు?
`పరోక్షంగా గంప బీజేపీకి సహకరించినట్లు అప్పట్లోనే పార్టీలో చర్చలు!
`రేవంత్ రెడ్డి గెలిస్తే మళ్ళీ షబ్బీర్ అలీ తెరపైకి వచ్చే అవకాశం?
`ఉప ఎన్నికలో షబ్బీర్ గెలిస్తే రాజకీయంగా ఉపద్రవం?
`ఏ రకంగా చూసినా భవిష్యత్తు అంధకారం?
`బీజేపీ గెలిచినా తన సీటు ఎప్పటికైనా పదిలం?
`అలా భవిష్యత్తు కోసం గంప ఆడిన రాజకీయం?
`పార్లమెంట్ ఎన్నికలలో కూడా బీజేపీ తో కొనసాగిన గంప స్నేహం?
`నిజానికి కామారెడ్డి లో బీఆరఎస్ ఎంతో బలంగా వుంది!
`గంప మూలంగానే కామారెడ్డి కమలం చేతిలోకి వెళ్ళిపోయింది!
`పదేళ్లు కామారెడ్డికి ఇతోధిక నిధులు ఇచ్చిన కేసీఆర్?
`బీఆరఎస్ నాయకులు కూడా స్వచ్చందంగా కామారెడ్డి అభివృద్ధికి సహకరించారు?
`అందరి నమ్మకాన్ని గంప వమ్ము చేశారాని చెప్పుకుంటున్న కార్యకర్తలు!
`కేసీఆర్ ఓటమికి పరోక్ష కారణమైన గంప చేతిలోనే మళ్ళీ పార్టీ బాధ్యతలు!
`ఇంచార్జిగా గంప పార్టీ కోసం చేస్తున్నదేమి లేదు?
`మళ్ళీ ఈ సారి కూడా కెసిఆర్ పోటీ చేయాలని కోరుకుంటున్న ప్రజలు!
`లేదా కామారెడ్డిలో పార్టీ కోసం కష్ట పడుతున్న వారికి ఇంచార్జిగా ప్రకటించాలని కోరుతున్నారు!
`గంపకు ఈ సారి టిక్కెట్ ఇచ్చినా గెలుపు కష్టమే అవుతుందని కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు?
`గంప కు కాకుండా ఇంకెవరికి టికెట్ ఇచ్చినా కారుకు ఎదురు ఉండదంటున్నారు!
`కామారెడ్డి మీద గులాబీ రిపేరెపలాడుతుందని చెబుతున్నారు!
`ఒక్కసారి మోసం చేయడం అలవాటైన వాళ్ళు మళ్ళీ మోసం చేయరనే గ్యారెంటీ ఉండదు.
హైదరాబాద్, నేటిధాత్రి:
అవకాశ వాదలు లేకుండా రాజకీయాలుండవు. రాజకీయాల్లో అవకాశ వాదులు లేకుండా సాగవు. ఇవి రెండు పెనవేసుకున్న బందాల లాంటవి. అందుకే ఎంత పెద్ద వ్యూకర్తలైనా సరే బలౌతుంటారు. నమ్మకమనేది రాజకీయాల్లో ఎంత విశ్వసనీయతను కనిపిస్తుందో.. అవకాశ వాదం కూడా అంతే అపనమ్మకాన్ని చూపిస్తుంది. అప్పటి వరకు ఎవరూ అంచనా వేయలేరు. రాజకీయాల్లో ప్రతి ఒక్కరినీ నమ్మాలి. ఆ నమ్మకమే అయిన వారిని దూరం చేస్తుంది. కాని వారిని దగ్గర చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేసిఆర్ నమ్మిన వాళ్లందరూ ఆయనను ముంచిన వారే. కాని ఆయన వల్లనే మునిగిపోయామని ప్రచారం చేసిన వాళ్లే. ఎంతో నమ్మితే తప్ప మోసం చేయలేరనేది రాజకీయాల్లో అనేక రుజువులున్నాయి. ఉద్యమ కాలంలో నమ్మి అందలమెక్కిస్తే, పదవులు అందిస్తే చివరకు కేసిఆర్‌నే వెన్నుపోటు పొడిచిన వారి లిస్టు చాంతాడంత వుంటుంది. అలా ఆయన నమ్మిన నాయకులు పరాయి పార్టీలకు కోవర్టులుగా పనిచేసిన వాళ్లు ఎంతో మంది వున్నారు. నీడ కోసం కేసిఆర్ పంచన చేరి, సేద దీరి వెళ్లిపోయిన అవకాశ వాదులు చాలా మందే వున్నారు. ఇప్పటికీ అలా రాజకీయాల్లో వున్నవారున్నారు. రాజకీయంగా కేసిఆర్‌ను మోసం చేసి, తెరమరుగైన వారున్నారు. తమకు అన్యాయం జరిగిందని వాళ్లే గగ్గోలు పెట్టిన సందర్భాలున్నాయి. అయినా అందర్నీ నమ్మడం కేసిఆర్ బలహీనత. ఆ నమ్మకాన్ని వమ్ము చేయడం నాయకులు నేర్చుకునకున్న రాజకీయ మనుగడ. కాకపోతే ఎంత మంది వచ్చినా, వెళ్లినా ఒకే ఒక్కడుగా నిలిచిన ఏకైక నాయకుడు కేసిఆర్. అలాంటి కేసిఆర్‌ను కూడా ఓడించాలన్న ఆలోచన చేసిన నియోజకవర్గం కామారెడ్డి. ఈ మాట చెప్పకపోతే భవిష్యత్తు రాజకీయాల మీద ప్రజలకు కూడా నమ్మకం పోతుంది. గత ఎన్నికల్లో కేసిఆర్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలనుకున్నారు. అటు గజ్వెల్, ఇటు కామారెడ్డి నియోజకవర్గాలను ఎంచుకున్నారు. ఆ ఆలోచన ఆనాడు కేసిఆర్ ఎందుకు చేశారన్నది ఆయనకు తప్ప మరొకరికి తెలియదు. కాని ఆ ఆలోచనే ఆయన రాజకీయ జీవితంలో ఓటమిని తెచ్చిపెట్టింది. కేసిఆర్ నమ్ముకున్న నాయకులే మరోసారి కేసిఆర్‌కు ఓటమిని తెచ్చిపెట్టారు. ఇది ముమ్మాటికీ నిజమని సాక్ష్యాత్తు ఆ నియోజకవర్గ ప్రజలే అంటున్నారు. గజ్వెల్లో కేసిఆర్‌కు వ్యతిరేకంగా ఈటెల రాజేందర్ నిలబడినా 25వేల మోజార్టీతో గెలిచిన కేసిఆర్, కామారెడ్డిలో ఓడిపోవడం అనేది ఆశ్చర్యానికి గురిచేసింది. కాని దాని వెకనాల చాలా మతలబు వుంది. కామారెడ్డిలో తన సీటును త్యాగం చేస్తున్నట్లు నటించిన అక్కడి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తెరచాటు రాజకీయం ప్రజలు, పార్టీ కార్యకర్తలు కథలు కథలుగా చెప్ప్పుకుంటున్నారు. అందుకే కేసిఆర్ లాంటి నాయకుడు ఓటమి పాలయ్యారు. నిజం చెప్పాలంటే కామారెడ్డిలో కాంగ్రెస్ ఓట్లు కాంగ్రెస్‌కు పడ్డాయి. కాని బిఆరఎస్ ఓట్లు కేసిఆర్‌కు పడలేదు. కామారెడ్డిలో
ఉనికిలో కూడా లేని బిజేపి గెలించింది. అంటే అక్కడ బిఆరఎస్ ఓట్లున్నీ బిజేపి పడేలా రాజకీయం సాగింది. కేసిఆర్ ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు. కేసిఆర్‌ను ఓడించేందుకు తెరవెనుక రాజకీయం బలంగా సాగుతుందని కూడా ఎవరూ అంచనా వేయలేకపోయారు. కాని అక్కడి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తన రాజకీయాన్ని ఉపయోగించారు? సహజంగా ఏ ఎమ్మెల్యే అయినా తన సీటు కోల్పోవాలని చూడరు. తన రాజకీయ భవిష్తును తానే సమాధి చేసుకోవాలనుకోరు. కాకపోతే కేసిఆర్ గెలిస్తే తన రాజకీయ భవిష్యత్తు మరింత ఉన్నతంగా వుంటుందని మాత్రం గంప గోవర్ధన్ ఆలోంచలేదు. రెండు సీట్లలో పోటీ చేసిన కేసిఆర్ కామారెడ్డిలో గెలిస్తే, ఆ సీటును కవితకు ఇస్తారనే అనుమానం గంప గోవర్ధన్‌లో మొదలైంది. అదే కేసిఆర్ ఓటమికి కారణమైంది. కవిత భవిష్యత్తులో పార్టీని వీడే పరిస్ధితి వస్తుందని ఆయన ఊహించలేదు. పైగా తన సీటును తనేకే ఇస్తారన్న నమ్మకం గంపకు లేకుండాపోవచ్చు. ఏదైనా కామారెడ్డి ఎప్పటికైనా తన చేతుల్లోనే వుండాలంటే కేసిఆర్ ఓటమి కావడమొక్కటే శరణ్యమని గంప భావించినట్లున్నారు. ఇక్కడ అనేక విషయాలు అంతర్లీనంగా వున్నాయి. కేసిఆర్ గెలిస్తే ఆ సీటు తనకు దక్కదేమో అన్న అనుమానంతోపాటు, ఒక వేళ సిఎం. రేవంత్‌రెడ్డి గెలిస్తే, కూడా తనకు దక్కే అవకాశాలు మరింత దూరమౌతాయనుకున్నారు. సిఎం. రేవంత్‌రెడ్డి కూడా ఆ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేశారు. కామారెడ్డిలో ఒక వేళ గెల్చినా, ఆ సీటును వదలుకొని షబ్బీర్ అలీకి ఇస్తారని ఊహించి నట్లున్నారు. కాంగ్రెస్ గెలిస్తే సిఎం. రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే షబ్బీర్ గెలిచి మంత్రి అవుతారు. గంప రాజకీయం అలా కూడా అర్దాంతరంగా ముగిసిపోతుందని అంచనా వేసుకున్నట్లున్నారు. అందుకే గంప గోవర్థన్ తెరవెనుక బిజేపికి సహకరించారన్న ఆరోపణలు ఆనాటి నుంచే వున్నాయి. ఆ సమయంలోనే కొంత మంది బిరఎస్ నాయకులు, కార్యకర్తలు తమ అనుమానం వ్యక్తం చేశారు. కాని కేసిఆర్ గుడ్డిగా గంప గోవర్ధన్‌ను నమ్మారు. కాని గంప మాత్రం కేసిఆర్‌ను నమ్మలేదు. ఆ సమయంలో కవిత కూడా కామారెడ్డిలో ప్రచారం చేయడం వంటివి గంప గోవర్ధన్‌లో మరింత ఆందోళనకు దారి తీసినట్లుంది. కేసిఆర్ గెలిచినా, సిఎం.రేవంత్ రెడ్డి గెలిచిన ఇక తన రాజకీయ జీవితానికి తానే చరమ గీతం పాడుకున్నట్లౌవు తందని అంచనా గంప గోవర్ధన్ రాజకీయం రచించారు. బిజేపి గెలుపుకు పరోక్ష మద్దతు పలికారని విమర్శలు వున్నాయి. తెలంగాణలో గజ్వెల్, సిద్దిపేట, సిరిసిల్లల అభివృద్ది తర్వాత ప్రధానంగా చెప్ప్పుకునే నియోజకవర్గం ఏదైనా వుందంటే అది కామారెడ్డి. ఆ నియోజకవర్గంలో అనేక అభివృద్ది కార్యక్రమాల కోసం ఇతోదిక నిధులు కేసిఆర్ ఇచ్చారు. పైగా ఆ నియోజకవర్గంలో వున్న కొంతమంది బిఆరఎస్ అభిమానులు కూడా కేసిఆర్ మీద ప్రేమతో స్వచ్చంధగా కొన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. అలా కామారెడ్డి మరింతగా గుర్తింపు పొందింది. నియోజకవర్గాల అభివృద్దిలో రోల్ మోడలైంది. అలాంటి నియోజకవర్గంలో బిఆరఎస్ ఓడిపోవడం పెద్ద విచిత్రం. అందులోనూ కేసిఆర్ ఓటమి పాలవ్వడం అంటే మరీ విచిత్రం. గంప చేసిన అనుభవ రాజకీయం కేసిఆర్ కూడా ఓడిపోయేలా చేసింది. ఆ సమయంలో ఎన్నికల సమయంలో పార్టీ ఇచ్చిన ఫండ్ కూడా ప్రజలకు చేరలేదు. కార్యకర్తల చేతికి అందలేదు అనేది ఆరోపణలున్నాయి. కేసిఆర్ ఎంతో నమ్మకంగా అన్ని బాధ్యతలు గంప గోవర్థన్రెడ్డికే అప్పగించారు. ఒక వేళ గెలిచినా గంపనే మళ్లీ ఎన్నికల్లో నిలబెట్టాలనే కేసిఆర్ చూశారు. కాని గంప గోవర్ధన్ మాత్రం అపోహ పడ్డారు. తనకు ఇవ్వరేమో అన్న అనుమానంతో ఆయన పనిచేయలేదన్నది కామారెడ్డి నియోజకవర్గ నాయకులు చెబుతున్న మాట. అలా కేసిఆర్ ఓటమికే కారణమైన గంపను కేసిఆర్ ఇంకా నమ్మడం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నచ్చడం లేదు. తాము పడిన శ్రమనంతా గంప గోవర్ధన్ గంగలో కలిపారన్న ఆవేదన వారిలో వుంది. ఈ విషయాలు కేసిఆర్ దాకా చేరకుండా గంప గోవర్ధన్ ఎంతో జాగ్రత్త తీసుకుంటూ వస్తున్నారు. కాని క్షేత్ర స్ధాయిలో జరిగిన సంగతులు తెలియకుండాపో తున్నాయని అంటున్నారు. పార్టీ కోసం గంప కన్నా ఎక్కువ పనిచేసిన వారు ఎంతో మంది నాయకులు కామారెడ్డిలో వున్నారు. వారి నమ్మకాన్ని కూడా గంప వమ్ముచేశారు. కేసిఆర్ మీద వున్న అభిమానంతో గంపకు అనేక విషయాల్లో సహకరిస్తూ వచ్చారు. కాని గంప అంత స్వార్ధ రాజకీయా నికి ఒడిగడతాడని వాళ్లు కూడా ఊహించలేదు. కాని ఎన్నికల సమయంలో వారికి అనేక విషయాలు తెలిసినా, మౌనంగా వుండిపోవాల్సి వచ్చిందని వాపోతున్నారు. అలా కేసిఆర్ ఓటమికి కారణమైన గంపానే ఇంకా కేసిఆర్ నెత్తిన పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ మళ్లీ వచ్చే ఎన్నికల్లో గంపకు టికెట్ ఇస్తే, పార్టీని భ్రష్టు పట్టిస్తారని అంటున్నారు. గంప చేసిన రాజకీయాలను ప్రశ్నించే వారికి గుర్తింపు లేకుండా చేస్తారని కూడా అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వెన్నుపోటు పొడిచిన గంప బిజేపితో దోస్తానా పార్లమెంటు ఎన్నికల దాకా సాగిందని అంటున్నారు. అలా పార్టీ ఓటమికి కారణమైన గంపకు ఇంకా ప్రాదాన్యత నివ్వడం అంటే వచ్చే ఎన్నికల్లో పార్టీ చేజేతులా కోల్పోవడమే అవుతుందంటున్నారు. కామారెడ్డిలో ఉనికి లేని బిజేపికి బలం పెరగడానికి, గెలవడానికి కారణమైన గంపను దూరం పెట్టడమే మేలన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమౌతోంది.
