మచ్చుపేట లో నూతనంగా బహుగుళ్ళ సిసి రోడ్డును ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే 2 కోట్ల నిధులతో సీసీ రోడ్డును వేయించిన ఘనత శ్రీధర్ బాబు దే..

ముత్తారం :- నేటి ధాత్రి

టీవీ ఉన్నది కదా అని గోడకు తలిగేసి మైక్ ఉన్నది కదా అని జేబుకు పెట్టి నోరు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన బి ఆర్ ఎస్ నాయకులు పూదరి సతీష్ నోరును అదుపులో పెట్టుకొని మాట్లాడాలి మచ్చుపేట గ్రామం మరియు బగుల్ల దేవస్థానం అభివృద్ధి అనేది ఎవరితో సాధ్యమైంది అనేది బహిరంగ చర్చకు మేము సిద్ధం . నీకు దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు సిద్ధమా అని కాంగ్రెస్ పార్టీ నాయకులు సవాలు విసిరారు
మా నాయకులు శ్రీధర్ బాబు అభివృద్ధి లక్ష్యంగా తన కార్యక్రమాలు చేస్తూ ఉంటే అభివృద్ధిని నోచుకోనని బి ఆర్ ఎస్ నాయకులు మా నాయకుని పై ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని మచ్చుపేట కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం.మీ నాయకుడు పుట్ట మధుకర్ అధికారంలో ఉన్నప్పుడు బహుళ గుట్టకి వచ్చి గ్రామ ప్రజలు అక్కడున్నటువంటి స్థానికులు దీనిని అభివృద్ధి చేయాలని కోరితే మీ నాయకుడు పుట్ట మధుకర్ ఏమన్నాడంటే ప్రభుత్వం దగ్గర నిధులులేవు మీరే తల ఇన్ని వేసుకొని బహుగుల్ల దేవస్థానం నీ అభివృద్ధి చేసుకోండి అంతే తప్ప ఏం చేసేది లేదు అని అనడం జరిగింది ఇది నిజమా కాదా తెలుసుకోని మాట్లాడలని అన్నారు
ఈ కార్యక్రమంలో ముత్తారం మండల మహిళా అధ్యక్షురాలు గోవిందల పద్మా ఆనంద్ గ్రామ శాఖ అధ్యక్షులు తాళ్లపల్లి కుమార్ మాజీ ఎంపీపీ గొర్ల రాజయ్య మాజీ సర్పంచ్ మెడగోని సతీష్ మాజీ వార్డ్ సభ్యులు దోoతుల రాకేష్ యూత్ అధ్యక్షులు కలవెన దేవరాజ్ సీనియర్ నాయకులు దుండే రాజేశం భక్కతట్ల రామ్మూర్తి బొడ్డు రవీందర్ గొర్ల స్వామి కిలిషెట్టి తిరుపతి చిలువేరి లక్ష్మణ్ మడ్డి రవి, దుండే రాజేందర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *