హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్..
ఆంజనేయస్వామికి ఘనంగా ప్రత్యేక పూజలు
గ్రామంలో సుఖశాంతులు వెల్లివిరియాలని కోరుకున్న సర్పంచ్ మందుల నాగయ్య
కోదాడ, నేటి ధాత్రి:
హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని కోదాడ మండల పరిధిలోని కొత్త గుడిబండ ఆంజనేయ స్వామి ఆలయంలో స్థానిక సర్పంచ్ మందుల నాగయ్య మంగళవారం ప్రత్యేక పూజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం అర్చనలు జరిపించి గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోదాడ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి, గుడిబండ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇర్ల నరసింహారెడ్డి, తుమాటి సుబ్బా రెడ్డి, లక్ష్మీకాంత్, మధు తదితరులు నాయకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
