Free Medical Camp at Indaram Village
సింగరేణి–ఎస్టిపిపి ఆధ్వర్యంలో ఇందారం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం
జైపూర్,నేటి ధాత్రి:
సింగరేణి యాజమాన్యం,సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఆధ్వర్యంలో జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా ఈడీ సి.హెచ్. చిరంజీవి మాట్లాడుతూ..సింగరేణి ఉన్నతాధికారుల సూచన మేరకు ప్లాంట్ ప్రభావిత గ్రామాల ప్రజల ఆరోగ్య రక్షణ దృష్ట్యా ఈ విధమైన ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ఈ శిబిరాల ద్వారా గ్రామ ప్రజల ఆరోగ్య పరిస్థితులను ముందుగానే గుర్తించి,అవసరమైన నివారణ చర్యలు చేపట్టవచ్చని చెప్పారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.డా. కె. పవన్ మాట్లాడుతూ..ఈ వైద్య శిబిరంలో మహిళలు,వృద్ధులు ఇతర రోగులు వైద్య పరీక్షలు చేయించుకున్నారని,వారికి అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు.
