ఉపాధి హామీ పనులలో సర్పంచ్ ఆకస్మిక తనిఖీలు.. కూలీలతో ముఖాముఖి.
సర్పంచ్ మందుల నాగయ్య
కోదాడ, నేటి ధాత్రి:
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులను గురువారం గుడిబండ గ్రామ సర్పంచ్ మందుల నాగయ్య ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి. ప్రదేశానికి వెళ్లి జరుగుతున్న పనులతీరును సర్పంచ్ నాగయ్య పరిశీలించారు. పనులకు వస్తున్న కూలీల వివరాలు, వారి హాజరు పట్టికలను (మస్టర్ రోల్)ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఉపాధి కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి కల్పించాల్సిన మౌలిక వసతులు, కొలతల ప్రకారం పని జరుగుతుందో లేదో అని నిషితంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ డిపిఓ, గ్రామపంచాయతీ సెక్రటరీ, ఉపాధి హామీ కూలీలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
