ఎన్నికల నియమావళిని పాటించాలి – చోప్పదండి సిఐ రవీందర్

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు పోలీస్ స్టేషన్లో రాబోవు గణేష్ ఉత్సవాలు మరియు అసెంబ్లీ ఎన్నికల గురించి చొప్పదండి సీఐ రవిందర్, రామడుగు ఎస్ఐ తోట తిరుపతిలు పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈసమావేశానికి అన్నీ రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు హాజరయ్యారు. ఈసమావేశంను ఉద్దేశించి చొప్పదండి సిఐ రవీందర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రామడుగులో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోలీసు వారు ఎన్నికలు సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన బందోబస్తు చేయడం జరుగుతుంది. ప్రతి పార్టీ వారు పోలీసు వారికి పూర్తి సహకారాలు అందించాలని, శాంతి భద్రతల దృశ్య ఎటువంటి సంఘటన చోటు చేసుకోకుండా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి సహకారం చేయాలని, ఎన్నికలు షెడ్యూల్ వచ్చిన నాటి నుండి, ఎన్నికలు ముందు ప్రచారం, ఎన్నికల రోజు, ఎన్నికల తదుపరి ఏవిధంగా ఎన్నికల కోడ్ ఉంటుందో దాని ప్రకారం నడుచుకోవాలని, ఏదైనా ఎన్నికల నియమావళిని అతిక్రమించిన వారి పైన తదితర చట్టపరమైన చర్యలు తీసుకోబడునని, రానున్న గణేష్ చతుర్థి, మిలాద్ ఉల్ నబి పండుగలు మత సామరస్యం, సహోదర భావంతో పండుగలు జరుపుకోవాలని, గణేష్ నిమజ్జనం, మిలాద్-ఉన్-నబి వేడుకలు ఒకే రోజు వచ్చాయని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉత్సవాలను సంతోషంగా జరుపుకోవాలని, గణేష్ మండప నిర్వహకులు మండపాలను రోడ్డుకి అడ్డంగా ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసుకోవాలని, మండపాల వద్ద బాధ్యత కలిగిన నిర్వహణ కమిటీ సభ్యులు బాధ్యత తీసుకోవాలని, మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రతి మండపం వద్ద విధిగా పాయింట్ బుక్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, పోలీస్ అధికారులు, బ్లూ కోల్ట్ సిబ్బంది తరుచు మండపాలు తనిఖీ చేయడం జరుగుతుందని, మండపాల్లో, నిమర్జనం రోజున డీజేలకు అనుమతి లేదని, అనుమతి లేకుండా డీజేలను మండపాల్లో కానీ, నిమర్జనం రోజున ఉపయోగిస్తే డీజే వారితో పాటుగా మండపాల నిర్వాహకులను బైండోవర్ చేయడం జరుగుతుందని, పోలీస్ వారి సలహాలు, సూచనలు పాటిస్తూ శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని తెలిపారు. ఈకార్యక్రమంలో రామడుగు ఎస్ఐ తోట తిరుపతి, గణేష్ మండపాల నిర్వహణ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!