rjdnyna…kammestham…,’ఆర్జేడి’నైనా…కమ్మేస్తాం…?

‘ఆర్జేడి’నైనా…కమ్మేస్తాం…?

నేను తలుచుకుంటే ఎవ్వరినైనా మేనేజ్‌ చేయగలను…నాకు ఇంటర్‌బోర్డులో పెద్దపెద్ద వాళ్లతో పరిచయాలున్నాయి..కమీషనర్‌ నాకు బాగా క్లోజ్‌..గతంలో ఓ ఆర్జేడిని సస్పెండ్‌ చేయించింది ఎవరో తెలుసా…కళ్లు మూసుకొని ఎన్నో ప్రైవేటు కాలేజీలకు చిటికెలో అనుమతులు ఇచ్చినోన్ని…గప్పుడే నన్ను ఏం చేయలేకపోయారు..గిప్పుడు ఎవరొస్తరు..ఏం చేత్తరు…ఇంతకంటే ఆఫీస్‌లో పెద్దమొత్తంలో అవినీతి జరిగిన దాఖలాలు లేవా..? మనం నొక్కింది ఏమన్నా కోట్ల రూపాయాలా..? కేవలం లక్షలే కదా..! దీనికి భయపడుడెందుకు..నేనున్నా..మీరు ధైర్యంగా ఉండండి… అన్ని నేను చూసుకుంటాను…నా వాటా నాకు ఇవ్వండి చాలు, మిగితావన్ని నేను మేనేజ్‌ చేస్తా…అంటున్నాడట ఓ అధికారి. ఇదంతా వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో జరిగిన అవినీతి, అక్రమాల విషయంలో అవినీతికి పాల్పడిన ఉద్యోగులకు ఆ అధికారి భరోసాను కల్పిస్తున్నాడని ఈయన అండదండలతోనే వారు అవినీతికి పాల్పడ్డారని పలువురు చర్చించుకుంటుండటంతో ఆ నోటా..ఈ నోటా విషయం మొత్తం జిల్లాను దాటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వీరి అవినీతి భగోతాన్నే మాట్లాడుకుంటున్నారని సమాచారం.

ఎవ్వరు మనల్ని ఏం చేయలేరు…

అవినీతి లీలలపై విచారణ కమిటి వేస్తే దొరికిపోవడం ఖాయం సార్‌..అంటున్న కొందరి ఉద్యోగులతో మనల్ని ఎవ్వరు ఏం చేయలేరు..నాకు ఇంటర్‌బోర్డులో పెద్దసార్లు తెలుసు నేను ఎలాచెబితే అలా వింటారు..అసలు కమిటి వేయరు..వేసినా ఇక్కడి రాక ముందే మేనేజ్‌ చేస్తాను, మీరు ఏం భయపడవద్దని అవినీతికి పాల్పడిన దొంగలకు ధైర్యం చెబుతున్నాడని బయట ప్రచారం జరుగుతున్నది.

నా వాటా నాకు ఇస్తే చాలు

మీరెంతన్నా నొక్కండి..నొక్కేసిన దాంట్లో నాకు మాత్రం నా వాటా ఇస్తే చాలు మిగితావన్ని నేను చూసుకుంటాను, రిజిష్లర్లు మార్చుడు, బిల్లులు సృష్టించుడు, దొంగసంతకాలు చేసుడు, దొంగ పేర్లను ఎంట్రీ చేసుడు, లేని సంతకాలు పెట్టుడు, దొంగల అకౌంట్లు ఇక్కడ భాయ్స్‌గా పని చేసినవారేనని చెప్పుడు.. ఎంతసేపు పని మీరేమి భయపడకండి, నా వాటా నాకు ఇస్తే గివన్ని మేనేజ్‌చేసుడు పెద్ద సుతారమా..? అని ఓ అధికారి వీరికి కొండంత అండగా నిలుసున్నాడని, అతని పేరు చెప్పకుండా కొంతమంది గుసగుసలాడుకుంటున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *