Sanjeev Naik Appointed TRS Constituency Incharge
తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ కోదాడ నియోజకవర్గం ఇన్చార్జిగా భూక్యా సంజీవ నాయక్.
కోదాడ, నేటి ధాత్రి :
తెలంగాణ రాష్ట్ర సేన కోదాడ నియోజకవర్గ ఇన్చార్జిగా సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన భూక్యా సంజీవ నాయక్ కు తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ అధ్యక్షురాలు కల్వaకండువా కప్పి నియమించారు.ఈ సందర్భంగా సంజీవ నాయక్ మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని. తన నియామకానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడలో (టిఆర్ఎస్) తెలంగాణ రాష్ట్ర సేన జెండా ఎగురబోతుందని అన్నారు. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీని బలోపేతం బలోపేతం చేస్తామన్నారు. భూక్యా సంజీవ నాయక్ నియామకం పట్ల టీఆర్ఎస్ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
