వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి
నడికూడ,నేటిధాత్రి:
మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర గ్రామైక్య ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐకేపీ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రా లకు ధాన్యాన్ని తరలించి,ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.దీనివల్ల 500 రూపాయల బోనస్ కూడా రైతులకు చేకూరుతుందన్నారు.రైతుల ఆర్థిక అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.మద్దతు ధర క్వింటాలుకు ‘ఎ ‘ గ్రేడ్ రకం రూ. 2320.సాధారణ రకానికి ధర 2300. ఉందన్నారు.ఈ కార్యక్రమం లో మండల తహాసిల్దార్ గుండాల నాగరాజు, ఎంపీడీవో విమల,ఏఎం సీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, ఏవో జైసింగ్, పి డి. శ్రీనివాస్, డిపిఎం ప్రకాష్,ఏపీఎం రమాదేవి,మహిళా సమైక్య సభ్యులు వివోఏ గోనెల కవిత,జంగిలి శిరీష, చెన్నబోయిన పవిత్ర,దుండి స్రవంతి,రావుల కావ్య.కాంగ్రెస్ పార్టీ నడికూడ మండల అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్,ప్రధాన కార్యదర్శి కుడ్ల మలహల్ రావు,గ్రామ కమిటీ అధ్యక్షుడు తాళ్ల నవీన్, సమన్వయ కమిటీ సభ్యులు పర్నెం మల్లారెడ్డి,పెద్ద బోయిన రవీందర్ యాదవ్, పాడి ప్రతాప్ రెడ్డి,కోడెపాక కరుణాకర్,హమాలీలు, రైతులు,తదితరులు పాల్గొన్నారు.