‘ఘనంగా అంబేద్కర్ జయంతి’
బాలానగర్ /నేటి ధాత్రి.
బాలానగర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడుతూ.. అంబేద్కర్ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించాడని, అంటరానితనం అస్పృశ్యత నివారణకు కృషి చేశారన్నారు. బహుజనులకు ఆరాధ్యుడన్నారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, వెంకటాచారి, యాదయ్య, శ్రీశైలం, నుప్ప ప్రకాష్, కొంగళ్ళ శ్రీను, శంకర్ నాయక్, లక్ష్మయ్య, వెంకటయ్య, జంగయ్య, మాసయ్య తదితరులు పాల్గొన్నారు.