*గ్రామ పంచాయతీ వర్కర్ల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలి*
• చేవెళ్ల మండలంలోని 25 జీపీలలో 3నెలల బకాయిలు 28.56 లక్షల వేతనాలు పెండింగ్
• వేతనాలు చెల్లించాలంటూ ప్రజవాణిలో వినతిపత్రం అందజేసిన జీపి కార్మికులు
నేటిధాత్రి, చేవెళ్ల :
కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలుగా వేతనాలు అందించడం లేదని ఫలితంగా తమ కుటుంబాలు గడవక పస్తులుండాల్సి వస్తుందని గ్రామ పంచాయతీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని అంతారం గ్రామపంచాయతీ కార్మికులు సోమవారం చేవెళ్ల ఆర్డివో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఏవోకు వినతిపత్రం అందజేశారు. అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న తమకు ప్రతి నెలా వేతనాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందుల పాలవుతున్నామని వెంటనే 3 నెలల పెండింగ్ వేతనాలను చెల్లించాలని చేశారు. అంతారం పంచాయతీ కార్మికులు మేడిపల్లి నర్సిములు, బస్తీ రాములు మాట్లాడుతూ అంతారం జీపిలో ఆరుగురు ఎమ్.పి.డబ్ల్యూ కార్మికులు పనిచేస్తున్నారని, ప్రతినెలా ఒక్కో కార్మికుడికి 9,500 వేతనం చెల్లించాల్సి ఉండగా ఆరుగురు సిబ్బందితో కలిపి 3నెలల వేతనాలు 1.71 లక్ష డెబ్భైవేలు చెల్లించాల్సి ఉందని వారు తెలిపారు . గ్రామంలో పారిశుధ్యం మంచినీటి సరఫరా, వీధిలైట్లు, డంపింగ్ యార్డ్స్, హరితహారం ,పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు తదితర పనులు గ్రామపంచాయతీ కార్మికులతో చేయించుకుంటారు, కానీ వారికి నెల నెల వేతనాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. వెంటనే పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు.
• మండలంలో పెండింగ్లో ఉన్న జీపి వేతనాలు 28.56లక్షలు
చేవెళ్ల మండలంలో 25 గ్రామ పంచాయతీల్లో 92 మంది మల్టీ పర్పస్ కార్మికులు, 3 కంప్యూటర్ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. అందులో పారిశుధ్యం, మంచినీటి సరఫరా, వీధి లైట్ల నిర్వహణ, పన్నుల వసూళ్లు తదితర పనులు చేస్తున్నారు. ఒక్కో కార్మికుడికి 9,500 వేతనం ఉంది. అదే 3నెలల పెండింగ్ వేతనం 28,500 చెల్లించాల్సి ఉంది. అంటే మండలంలో 25 పంచాయతీలలో పనిచేస్తున్న92 మంది శానిటేషన్, ఎలక్ట్రిషన్, బిల్ కలెక్టర్, వాటర్ మ్యాన్ కార్మికులు, ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లు పనిచేస్తుండగా, ఆపరేటర్ నెల వేతనం 19500 కాగా 4 నెలల వెల్డింగ్ వేతనం 78000 వేలు కాగా, పంచాయతీ కార్మికులు,కంప్యూటర్ ఆపరేటర్ల పెండింగ్ వేతనాలు కలిపి 28,56,000 చెల్లించాల్సి ఉంది. కాని ఇప్పటివరకు మూడునెలలుగా ఒక్క రూపాయి చెల్లించలేదు. కార్మికులకు వచ్చే చిన్న వేతనాలతో కుటుంబాలు వెల్లదీస్తున్నారు. డిసెంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా టీఎస్ బి పాస్ అకౌంట్ ద్వారా వేతనాలు చెల్లించేది. కానీ గత మూడు నెలల నుండి జిపి నిధుల నుండి తీసుకోవా లని ప్రభుత్వం చెపుతుంది. చిన్న వేతనం కూడా 3 నెలలుగా వేతనాలు రాకుండా పెండింగ్లో ఉండటంతో , వారి పరిస్థితి అధ్వానంగా మారింది. వేతనాలు ఇవ్వాలని అధికారులను అడిగితే డబ్బులు లేవని సమాధానం చెబుతున్నా సందర్భాలు, సమాదానాలు కార్మికుల మనోధైర్యాన్ని కుంగదీస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ వేతనాలను విడుదల చేసి ఉద్యో గ భద్రత కల్పించాలని , అదే విధంగా మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ కార్యాక్రమంలో పంచాయతీ కార్మికులు మన్నెగూడెం పద్మమ్మ, తెలుగు సాయమ్మ, ఘనపురం రామస్వామీ, ఖానాపురం నరేష్ తదితరులు పాల్గొన్నారు.
