No Ration Shop in Gangapur, Villagers Face Hardships
గంగాపూర్ లో రేషన్ షాపు లేక ప్రజల ఇక్కట్లు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండలంలోని గంగాపూర్ గ్రామం కొత్త పంచాయతీగా ఏర్పడి ఏళ్లు గడిచినా, ఇప్పటికీ రేషన్ దుకాణం లేకపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ బియ్యం కోసం సమీపంలోని టేకూర్, ధర్మపూర్ గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు ఇది మరింత కష్టంగా మారింది. ప్రభుత్వం వెంటనే గంగాపూర్ లో రేషన్ షాపును ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
