వనపర్తి లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం.
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హనుమాన్ టెకిడిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి నాగర్ కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బి రాములు పార్టీ నేతలు పూలమాలలు వేశారు .
ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాగర్కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బి రాములు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు .
1982లో మాజీ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని 1983 లో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ 2 0 2 అసెంబ్లీ సీట్లు ఎన్టీ రామారావు గెలిపించారని గుర్తు చేశారు పటేళ్లు పట్వార్లు ఎన్టీ రామారావు రద్దు చేశారని ఆయన తెలిపారు .
అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు బడుగు బలహీన వర్గాలకు నిరుపేదలకు ఇల్లు కట్టించారని జూరాల ప్రాజెక్టు హయంలోనే నిర్మించాలని రెండు రూపాయల కిలో ప్రజలకు బియ్యం పథకం అమలు చేశారని మైనార్టీలకు బీసీలకు న్యాయం చేశారని ఆయన తెలిపారు .
తెలంగాణ రాష్ట్రంలో ఏ పి సీ ఎం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేయడానికి మండలాలు గ్రామాలు నియోజకవర్గాల్లో నూతన కమిటీలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నారని తెలిపారు .
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మున్సిపాలిటీలు జెడ్పిటిసిలు ఎం పీ టీ సీ లు తెలుగుదేశం పార్టీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని బి రాములు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర పార్టీలతోనే పొత్తు పెట్టుకుంటుందా ఒంటరిగా పోటీ పోటీ చేస్తుందా అని విలేకరుల ప్రశ్నిస్తే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఏ పి సీ ఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం పార్టీ నిర్ణయిస్తుందని ఆయన పేర్కొన్నారు .
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాలలో ఓటు బ్యాంకు ఉన్నదని ఆయన తెలిపారు రాష్ట్రంలో 20 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీకి కష్టపడి పనిచేస్తున్నారని అలాంటి వారిని తెలుగుదేశం పార్టీ గుర్తిస్తుందని వారికి భవిష్యత్తు ఉంటుందని బి రాములు తెలిపారు .
ఈ విలేకరుల సమావేశంలో ఎండి దస్తగిరి కొత్త గొల్ల శంకర్ చిన్నయ్య ఆవుల శ్రీనివాసులు మాదయ్య న్యాయవాది షాకీర్ హుస్సేన్ హోటల్ బలరాం మేదరి బాలయ్య నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ దస్తగిరి అరుణ్ ర షీ ద్ బాబర్ ఫారూఖ్ కాగితాల లక్ష్మయ్య డి బాలరాజ్ తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు