అఖిలభారత విశ్వకర్మ మహాసభ ద్వితీయ వార్షికోత్సవం

తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కాసుల కుమార్ కి సన్మానం

చేర్యాల నేటిధాత్రి ప్రతినిధి

అఖిల భారత విశ్వకర్మ మహాసభ ద్వితీయ వార్షికోత్సవాన్ని హైదరాబాదులోని కొత్తపేట బాబు జగజ్జివన్ రావు భవన్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షుడు చండీలాల్ ప్రధాన కార్యదర్శి దినేష్ బాయ్ ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ఎంపీ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బిజెపి నాయకులు చీకోటి ప్రవీణ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కౌలే జగన్నాథం ప్రధాన కార్యదర్శి సుంకోజు లింగాచారి కోశాధికారి ఆవంచ మురళి రాష్ట్ర కార్యదర్శి కాసుల కుమార్ మరియు రాష్ట్ర కమిటీ వివిధ జిల్లాల నుండి వచ్చిన విశ్వకర్మలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విశ్వకర్మల అభివృద్ధికై పాటుపడాలని జాతీయ అధ్యక్షుడు చండీలాల్ అన్నారు రాష్ట్ర అధ్యక్షుడు కౌలే జగన్నాథం మాట్లాడుతూ రాష్ట్రంలో విశ్వకర్మలకు రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వం నామినేటెడ్ పదవులలో విశ్వకర్మల కు కేటాయించాలని అన్నారు మరియు 50 సంవత్సరాలు నిండిన విశ్వకర్మలకు ప్రభుత్వం పింఛన్ సౌకర్యం ఇవ్వాలని అన్నారు విశ్వకర్మలకు కలప పని చేసుకునే మా సభ్యులపై ఫారెస్ట్ అధికారుల వేధింపులు స్వర్ణకారులకు పోలీసులతో వేధింపులు లేకుండా చూడాలని అన్నారు లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వకర్మలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు మరియు వచ్చిన అతిథులకు మెమెంటో ఇచ్చి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగాధరచారి రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల సతీష్ రాష్ట్ర సలహాదారులు అద్దంకి కృష్ణమాచారి బొడ్డుపల్లి మాధవ్ మరియు పెద్ద ఎత్తున విశ్వకర్మలు మహిళా మణులు పాల్గొన్నారు

న్యూయర్ వేడుకలు వద్దు రక్తదానం ముద్దు.

మహబూబ్ నగర్/నేటి ధాత్రి.

న్యూయర్ వేడుకలు వద్దు రక్తదానం ముద్దని శ్రీ సంరక్షణ ఫౌండేషన్ మంగళవారం మహబూబ్ నగర్ డిఎస్పి వెంకటేశ్వర్లు చేతులమీదుగా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా డిఎస్పి మాట్లాడుతూ.. ప్రజలు స్వచ్చదంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని, ముఖ్యంగా యువత న్యూయర్ వేడుకల పేరుతో మద్యపానానికి దూరంగా ఉండి.. రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అత్యవసర సమయాలలో బాధితులకు రక్తదానం చేసి సహాయపడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పటేల్ సుమన్, ప్రశాంత్, నవీన్ కుమార్, పవన్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అసత్య ప్రచారం చేసిన వ్యక్తిపై కేసు నమోదు

జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిఎ రమణ రావు పై అక్రమ ఇసుక దందాపై వాట్సాప్ గ్రూప్ లలో షేర్ చేస్తూ అసత్య ప్రచారం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన ఏసిపి వెంకటేశ్వర్లు.వివరాల్లోకి వెళ్తే ఎల్కంటి గ్రామానికి చెందిన బేతి తిరుపతిరెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే పిఏ రమణ రావు ని లక్ష్యంగా చేసుకొని అపరాధమైన నిరూపణ చేసి తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించాడని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు తిరుపతి రెడ్డి పై ఐటి యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందని ఏసిపి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా త్వరలో పట్టుకొని అరెస్టు చేస్తామని తెలిపారు.

బాలాజీ టెక్నో స్కూల్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

నర్సంపేట టౌన్ నేటి ధాత్రి:
నర్సంపేట, డిసెంబర్ 31: ప్రతి సంవత్సరం ఒక కొత్త క్యాలెండర్ మన జీవితంలోకి వస్తుందని, ఈ నూతన క్యాలెండర్ తో పాటు అనేక కొత్త కొత్త ఆశలు, ఆశయాలతో మరియు మనం చేరుకోవలసిన గమ్యాలు ఏర్పడతాయనీ, వాటికి అనుగుణంగా మనం మరింత నూతనోత్సాహంతో పనిచేయవలసి ఉంటుందనీ, అటువంటిప్పుడే ఈ నూతన సంవత్సరాలు జరుపుకోవడానికి ఒక అర్థం ఉంటుందని బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ అండృ రాజేంద్రప్రసాద్ రెడ్డి అన్నారు. 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ లక్నేపల్లి శివారులోనే బాలాజీ టెక్నో స్కూల్లో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కేవలం ఈ ఒక్కరోజు ఆనందానికి పరిమితం కాకూడదని ఇష్టంతో కష్టపడి మీరు అనుకున్న గమ్యాలను చేరుకునేందుకు కొత్త ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ సూచించారు. అనంతరం కేక్ కట్ చేశారు . ఈ కార్యక్రమంలో బాలాజీ స్కూల్ ప్రిన్సిపల్ పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ 2024 సంవత్సరంలో పాఠశాల సాధించిన ఘనవిజయాలను వివరించారు. అడ్వాన్సుగా ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులకు, విద్యార్థినీ విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బాల బాలికలు డాన్సులు, ఉపన్యాసాలు, ఆట పాటలతో అలరించారు. ఈ సందర్భంగా చదువుల్లో ఉత్తమ పరిస్థితిను కనపరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. పదవ తరగతి రివిజన్ టెస్ట్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకంగా అభినందనలతో పాటు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎండి రియాజుద్దీన్, క్రాంతి కుమార్, ప్రదీప్, భవానీ చంద్ మరియు విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ఆదర్శ అమ్మకు ఘనంగా వీడ్కోలు

శ్రీరాంపూర్,(మంచిర్యాల) నేటి ధాత్రి:

సింగరేణిలో ఉద్యోగం చేస్తూనే పిల్లలను ఉత్తమంగా తీర్చిదిద్దడంలో తన కర్తవ్యాన్ని నెరవేర్చిన దుర్గం సారమ్మను ఘనంగా సన్మానించారు. మంగళవారం రామకృష్ణపూర్ ఏరియా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూ పదవి విరమణ చేసిన సందర్భంగా సింగరేణి ఆఫీసర్లు,తోటి కార్మికులు ఘనంగా సన్మానించారు. పిల్లల చిన్నతనంలోనే భర్త చనిపోవడంతో తను కుంగిపోకుండా పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలని తపనతో వారిని ఉన్నత చదువులు చదివించి వారికి మంచి భవిష్యత్ అందించారు. సారమ్మకు మగ్గురు కూతుళ్లు, ఇద్దరు అబ్బాయిలు, పెద్దమ్మాయికి చిన్నతనంలోనే వివాహం చేశారు.రెండో అమ్మాయి విజయ మంచిర్యాల కలెక్టరేట్ లో రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో సీనియర్ అసిస్టేంట్ గా విధులు నిర్వహిస్తుంది. మూడో అబ్బాయి కృష్ణ సీసీసీలోని ఆంధ్రా బ్యాంకు లో అకౌంటెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు.నాలుగో అబ్బాయి మహేందర్ కాగజ్ నగర్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు.ఐదో అమ్మాయి లక్ష్మీ చదువుపై శ్రద్ద లేకపోవడంతో గృహిణిగా ఉంది. తండ్రి లేకపోయిన కృంగిపోకుండా పిల్లలకోసం ఎంత కష్టమైన భరించి వారిని ఉన్నంత స్థానంలో నిలిపిన సారమ్మను పలువురు అభినందించారు.1992లో ఉద్దోగంలో చేరి అప్పటి నుండి నేటి వరకు ఎటువంటి రిమార్క్ లేకుండా ఉద్యోగం చేయడం గొప్పవిషయమని పలువురు అబినంధించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రాజుపేట కేంద్రంగా గ్రంథాలయ మంజూరు చేయాలి ఎస్ఎఫ్ఐ

ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టీఎల్ రవి

మంగపేట :- నేటి ధాత్రి

రాజుపేట కేంద్రంగా గ్రంథాలయం అందరూ చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి ఎల్ రవి మాట్లాడుతూ మంగపేట మండలం రాజుపేట గ్రామంలో చుట్టుపక్కల 14 గ్రామపంచాయతీలు వరకు ఉన్నాయి గ్రామంలో యువకుల సంఖ్య ఎక్కువగా ఉంది రాజుపేట కేంద్రంగా గ్రంధాలయం మంజూరు చేయాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు
కార్యక్రమంలో నాయకులు రహీం ,నవీన్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు

నేషనల్ హైవే భూనిర్వాసిత రైతుఖాతల్లో డబ్బులు జమ

నూతన సంవత్సరంలో రైతులకు శుభవార్త

ఆర్డీవో మంగీలాల్

భూపాలపల్లి నేటిధాత్రి

గ్రీన్ఫోల్ద్నేషనల్ హైవే భూనిర్వాసిత రైతులకు ప్రభుత్వం నుండి చెల్లించే నగదు డబ్బులను రైతుల ఖాతాల్లో జమచేయడం జరిగిందని భూపాలపల్లి ఆర్డీవో మంగిలాల్ తెలిపారు. మంగళ వారం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మట్లాడుతూ..జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి వెల్లుతున్న నేషనల్ హైవే భూనిర్వాసితులకు ఇవ్వవలసిన డబ్బులు ఎకరానికి 21లక్షల నుండి 28 లక్షల వరకు పెంచి ఇవ్వడం జరిగిందన్నారు.చిట్యాల మండలంలోని కాల్వపెల్లి, గిద్దముత్తారం, నవాబుపేట, టేకుమట్ల మండలంలోని రాఘవపూర్,పంగిడిపల్లి, అంకుషాపూర్,సోమనపల్లి గ్రామాలు న్నాయిని, మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఈ గ్రామాలకు ఈ హైవే లో భూములు కోల్పోయారని అన్నారు.చిట్యాల మండలం నవాబ్ పేట, టేకుమట్ల మండలంలోని పంగిడిపల్లె గ్రామంలోని రైతులకు వారి ఖాతల్లో మంగళ వారం జమచేయడం జరిగిందని అన్నారు.మొత్తం 16 కోట్ల 29లక్షల 6వేల 413 డబ్బులను రైతుల ఖాతల్లో జమచేయడం జరిగిందని తెలిపారు. పంగిడిపల్లి,నవాబ్పట గ్రామాల రైతులకు 98 మందికి డబ్బులు జమచేయడం జరిగిందన్నారు. మిగిలిన రైతులు ఆర్డీవో ఆఫీస్లో సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో రైతులను కోరారు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున యునైటెడ్ క్రిస్మస్ వేడుకలు స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు

కాప్రా నేటిధాత్రి 31:

మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ హెచ్ బీ కాలనీ ఫేజ్-1 గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున యునైటెడ్ క్రిస్మస్ వేడుకలు స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం హౌసింగ్ బోర్డు పాస్టర్స్ ఫెలోషిప్ పాస్టర్ లతో కలిసి కేక్ కట్ చేసారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర గత ప్రభుత్వం అన్ని మతాల పండుగలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వమే ముందుండి అధికారికంగా పండగలు నిర్వహించిందని, అదే క్రమంలో ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ సాంప్రదాయన్ని కొనసాగించడం మత సామరస్యానికి నిదర్శనమని అన్నారు. ఇక ముందు ఆ యేసు ప్రభు మనందరిని కరుణించి ఎలాంటి ఆపద రాకుండా, అందరూ సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని కోరారు. ముఖ్య ప్రసంగీకులు పాస్టర్ పవన్ కుమార్ వేమూరి, బిషప్ రెవరెండ్ డాక్టర్ జేకరయ్య, బిషప్ రెవరెండ్ డాక్టర్ దేవదానం, రఘుయెల్ రాబర్ట్, మరియు డివిజన్ చర్చిల పాస్టర్లు విచ్చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న సుమారుగా 750 డివిజన్ పరిధిలోని చర్చిల సంఘ సభ్యుల కోసం భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, మరియు స్థానిక కాలనీల నాయకులు పాల్గొన్నారు.

పదవి విరమణ అనంతరం ప్రశాంత జీవితం గడపాలి

పంచాయతీ కార్యదర్శి హరిశ్చంద్రా రెడ్డిసేవలు మరువలేనివి

అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి

ఘనంగా పంచాయతీ కార్యదర్శి హరిశ్చంద్రా రెడ్డి కి వీడ్కోలు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో ఉద్యోగ రీత్యా ప్రజలతో మమేకమై పనిచేస్తే పది కాలాలు వారికి గుర్తుండిపోతామని అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి డిపిఓ లు అన్నారు. మంగళవారం మండలంలోని చెల్పూర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ పదవి విరమణ పొందిన చింతలపూడి హరిశ్చంద్రా రెడ్డి, పద్మా దంపతులకు చెల్పూర్ రైతు వేదికలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఘనంగా వీడ్కోలు పలికారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి జిల్లా పంచాయతీ అధికారి నారాయణ రావులు హజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శిగా హరిశ్చంద్రా రెడ్డి, గణపురం మండలంలో సుమారు 22 సంవత్సరాల పాటు సేవలు అందించడం గొప్ప విషయం అన్నారు. పనిచేసిన ప్రతిచోట వివాదరహితుడిగా ప్రజల మన్ననలు పొందారని అన్నారు. పాలకవర్గంలో ఎవరున్నా వివాద రహితుడిగా తన విధులు నిర్వహించడం వల్లే ఈరోజు ఆయన పదవీ విరమణ వీడ్కోలు సమావేశానికి పెద్ద సంఖ్యలో మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు సహచర ఉద్యోగులు ప్రజలు తరలివచ్చారని వారు ఈ సందర్భంగా అన్నారు. పదవి విరమణ అనంతరం ఆయన తమ కుటుంబ సభ్యులతో ప్రశాంత జీవనం గడపాలని వారు ఆకాంక్షించారు. అనంతరం తాజా మాజీ ప్రజా ప్రతినిధులు మండల పంచాయతీ కార్యదర్శులు రెవెన్యూ, ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది చెల్పూర్ గ్రామపంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో శాలువాలు పూలమాలలతో హరిశ్చంద్రా రెడ్డి, పద్మ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎల్ భాస్కర్,జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షులు ఉమ్మల్ల విజేందర్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు ఎర్రబెల్లి పున్నం చందర్ రావు
నేటి ధాత్రి
గడిచిన క్షణాన్ని స్మరిస్తూ..రాబోయే క్షణాన్ని ఊహిస్తూ..ఉదయించే ఉషస్సుల కోసం ఎదురుచూస్తూ నూతన సంవత్సరంలోకి అడివిడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు ఎర్రబెల్లి పున్నం చందర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ సందర్భంగా నూతన సంవత్సరానికి సంబంధించి మొగుళ్లపల్లి మండల ప్రజలకు పలు సూచనలు చేశారు. మండలంలోని ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. అధిక మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని యువకులకు సూచించారు. సంతోషకరమైన రోజుని..విషాదకరంగా చేసుకోవద్దన్నారు. సంతోషకరంగా, సురక్షితంగా నూతన సంవత్సర వేడుకలను తమ తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి జరుపుకోవాలన్నారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

ఎస్సై రేఖ అశోక్

వాహనాలను వేగంగా నిర్లక్ష్యంగా మద్యం మత్తులో నడపడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది

తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి సాధ్యమైనంత వరకు పిల్లలను కట్టడి చేసుకోవాలి

డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసేందుకు చట్టపరమైన చర్యలు ఉంటాయి

అతివేగం ప్రమాదకరంగా వాహన లు నడిపే వారు త్రిబుల్ రైడింగ్ నడిపే వారిపై నిఘ ఎస్ ఐ

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలోనూతన సంవత్సర వేడుకలు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీస్ శాఖ ప్రజలందరికీ ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నది.నూతన సంవత్సరం మొదటి రోజు ఏ కుటుంబం కూడా విషాదకర ఘటనతో ఆరంభం కాకుండా ఒకసారి గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలుతీసుకోవాల్సిందిగా కోరుచున్నాము.ముఖ్యంగా తల్లిదండ్రులు తమమైనర్ పిల్లలకు, బైకులు, కార్లను ఇవ్వకూడదని కోరారు.వాహనాలను వేగంగా, నిర్లక్ష్యంగా మద్యం, మత్తులో నడపడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కావున ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి, సాధ్యమైనంత వరకు పిల్లలను కట్టడి చేసుకొవాలి.న్యూ ఇయర్ సందర్భంగా డ్రంకెన్ డ్రైవింగ్ కేసులునమోదుచేసేందుకు,అతివేగంప్రమాదకరంగా వాహనాలు నడిపేవారు, త్రిబుల్ రైడింగ్ నడిపే వారి పై నిఘ పెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోబడును.31వ తేదీ రాత్రి 10 గంటల తర్వాత ఎవరైనా రోడ్లపై అనవసరంగా సంచరిస్తూ పౌరులను అసౌకర్యం కలిగే విధంగా తిరిగే వారిపై న్యూసెన్స్ కేసు బుక్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి తమ వేడుకలను అర్ధరాత్రి ఒంటిగంట లోపు పూర్తిచేసుకుని తమ తమ ఇళ్లకు వెళ్లాలనికోరుచున్నాము.అంతేకాకుండా నూతన సంవత్సర వేడుకల పేరుతో ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా రోడ్లపై న్యూసెన్స్ చేసినా, ఈవ్ టీజింగ్ లాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారిని అరెస్టు చేసి జైలుకు పంపడం జరుగుతుందని.
నూతన సంవత్సర వేడుకల గురించి ఎవరికి ప్రత్యేకమైన కార్యక్రమాలకు ఈవెంట్లకు పోలీస్ శాఖ ఎటువంటి అనుమతులు జారీ చేయలేదు. ఎవరైనా సరే నిబంధనలు ఉల్లంఘించి నూతన సంవత్సర వేడుకల పేరుతో ఈవెంట్స్ కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహిస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోబడతాయి. డి జె సౌండ్ సిస్టమ్స్ పెట్టి శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తూ, వృద్దలకు, పేషంట్లకు, గర్భవతులకు, పిల్లలకు ప్రాణహాని కలిగే విధంగా చేసే వారిపై కఠిన సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసి, వాహనాలనుఎక్విప్మెంట్ ను సీజ్ చేసి జైలుకు పంపే విధంగా చర్యలు తీసుకోబడును.కావున పై విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ పోలీసు వారితో సహకరించి పూర్తి శాంతియుత, ఆహ్లాదకరమైన వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని గణపురం ఎస్సై రేఖ అశోక్ కోరారు.

సమగ్ర శిక్షలో 22వ రోజుకు చేరిన నిరవధిక సమ్మె

వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించాలి
ఉరి వేసుకుని నిరసన

భూపాలపల్లి నేటిధాత్రి

గత 18 ఏళ్లుగా తెలంగాణ సమగ్ర శిక్షలో వెట్టి చాకిరి చేస్తూ జీవనం సాగిస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కంకల రాజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల వేణు డిమాండ్ చేశారు. ఎస్ఎస్ఎ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె మంగళవారం 22 రోజులకు చేరింది. ముకుమ్మడిగా ఉరేసుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గత ఏడాది సెప్టెంబర్ 13న టిపీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు హనుమకొండలో ఏక శిల పార్క్ వద్ద చేస్తున్న దీక్ష శిబిరాన్ని సందర్శించా రని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వందరోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే అమ లు చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజే
షన్ చేయాలని, ఉద్యోగులకు 10 లక్షల హెల్త్ కార్డులు, సమగ్ర శిక్ష మహిళా ఉద్యోగులకు 108 రోజులు వేతనం తో కూడిన ప్రసూతి సె లవులు, 61 సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు 20 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్. మరణించిన ఉద్యోగ కుటుంబాలకు 15 లక్షలు ఎక్స్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మ హిళా ఉద్యోగుల మాదిరిగా అన్ని రకాల సెలవు లు ప్రభుత్వం వెంటనే ప్రకటించి వారి జీవితా లలో వెలుగులు నింపాలని విజ్ఞప్తి చేస్తున్నా మన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు చాలీచాలని వేటతనంతో అత్యంత దుర్భర పరిస్థితులలో జీవనం గడుపుతున్నారని, వారిని రెగ్యులర్ చే యాలని, లేనిపక్షంలో పే స్కేల్ ప్రకటిస్తే ఆనందంగా వారి వృత్తి నిర్వహణలో ప్రభుత్వా నికి, ఇటు ఉపాధ్యాయులకు మధ్య వారధిగా ఉంటూ కార్యనిర్వహణలో అంకితభావంతో పాల్గొంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చాంద్ పాషా, మహిళా అధ్యక్షురాలు చల్ల సునీత, మహేందర్ రెడ్డి, చంద్రకళ, నరేష్, రాజు, తిరుపతి, సుదర్శన్, సతీష్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

‘బాలానగర్ మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు’

ఎస్సై తిరుపాజీ.

బాలానగర్ / నేటి ధాత్రి

నూతన సంవత్సరాన్ని కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని.. మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలను ఎస్సై తిరుపాజీ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. గత సంవత్సరం కంటే… ఈ నూతన సంవత్సరం మండల ప్రజల జీవితాలు సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. యువత నూతన సంవత్సరాన్ని బయట కాకుండా.. కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని, యువత మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, రోడ్లపైకి రాకూడదన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కు 4 బృందాలు ఏర్పాటు చేశామన్నారు. మద్యం సేవించి రోడ్డుపైకి వచ్చి ఇతర వాహనదారులను, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే.. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. నూతన చట్టం ప్రకారం డ్రంకన్ డ్రైవ్ లో దొరికితే.. రూ.10 వేల జరిమానా.. మరియు వారం రోజులు పాటు జైలు శిక్ష పడుతుందన్నారు. మండల ప్రజలు నూతన సంవత్సరాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు.

గిరిజనులు స్వయంపాలనలో బ్రతకడం ఎమ్మెల్యే మాదవరెడ్డికి ఇష్టం లేదా?

ఎమ్మెల్యే దొంతి సొంత గ్రామంలో పతినాయక్ తండాను జీ.పీ విలీనం..!

గిరిజనుల స్వయంపాలనకు తూట్లు పొడుస్తున్న కాంగ్రేస్ ప్రభుత్వం..

తండాల ఆత్మగౌరవం కోసమే జీ.పీ లుగా కేసీఆర్..

పత్తినాయక్ తండా ఘటనను ఖండించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి..

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట డివిజన్ పరిధిలోని గిరిజనులు స్వయంపాలనలో బ్రతకడం ఎమ్మెల్యే మాదవరెడ్డికి ఇష్టం లేదా? అని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. చెన్నారావుపేట మండలంలోని పత్తినాయక్ తండా గ్రామపంచాయతిని అమీనాబాద్ లో విలీనం చేయాలనే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పెద్ది తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో తండాలు ఆత్మగౌరవం,స్వయం ప్రతిపత్తితో బ్రతకాలనే ఉద్దేశంతో నాటీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తండాలను గ్రామపంచాయతీలుగా మార్చారని పేర్కొన్నారు.అందులో బాగంగానే నర్సంపేట నియోజకవర్గం పరిధిలో 76 నూతన గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసామని మాజీ ఎమ్మెల్యే పెద్ది వివరించారు.గత ప్రభుత్వం తండాలకు రోడ్లు వేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. ఈ నేపథ్యంలో వివిద దశల్లో ఉన్న రోడ్డు పనులను వెనక్కిపంపి తండాల అభివృధ్ధిని అడ్డుకున్న చరిత్ర కాంగ్రేస్ ది అని పేర్కొన్నారు.నేడు స్థానిక ఎమ్మెల్యే సొంత గ్రామం అమీనబాద్
లో పత్తినాయక్ తండాను విలీనం చేయాలనుకోవడం తండావాసుల ఆత్మగౌరవాన్ని దెబ్పతీయటమే అవుతుందని ఎద్దేవా చేశారు.తండా ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా భయటవారిని తీసుకువచ్చి దౌర్జన్యం చేయడం ఎంతవరకు సమంజసం అని ఆరోపించారు.గ్రామసభ అనేది గ్రామస్తులు,గ్రామ సంబందిత అధికారుల సమక్షంలో జరగాలి..అలాంటిది గిరిజనేతర,నియోజకవర్గ కాంగ్రేస్ నాయకుల సమక్షం వారి అభిప్రాయాన్ని తండావాసులపై రుద్దటాన్ని ఖండిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే పెద్ది పేర్కొన్నారు.ఎమ్మెల్యే మాధవరెడ్డి సహకారంతో అదికారులు, పోలీసులను అడ్డు పెట్టుకుని గ్రామస్తుల సమ్మతి లేకుండా గ్రామసభ నిర్వహించాలనుకోవడం మూర్కత్వం కాదా..? అని ప్రశ్నించారు.గిరిజనుల స్వయంపాలనలో బ్రతకడం ఎమ్మెల్యే మాదవరెడ్డికి ఇష్టం లేదా..? అని అడిగారు.నర్సంపేట డివిజన్ పరిధిలోని మిగిలిన 76 తండాల గ్రామపంచాయతీలను విలీనం చేసి గిరిజనులకు స్వయంపాలనను దూరం చేసే కుట్రలో బాగమే నేటి పత్తినాయక్ తండా సంఘటన అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.నేడు నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రేస్ నాయకులకు పోలీసులు,అదికారులు వంతపాడటం హేయమైన చర్య,గ్రామపంచాయతీల ఉనికి ప్రశ్నార్థకం చేసేదిగా ఎమ్మెల్యే తీరు ఉందని మాజీ ఎమ్మెల్యే పెద్ది ఆరోపించారు.పత్తినాయక్ తండా గ్రామపంచాయతీని విలీనం చేసే కుట్రలో సొంత గ్రామంలోనే ప్రజలు తిరగబడే స్థితికి వచ్చింది,ఇది ఇలాగే కొనసాగితే గిరిజన లోకం మీకు తగిన బుద్ది చెబుతుందని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని హెచ్చరించారు.నేడు నియోజకవర్గంలో తండాలకు రోడ్లను అడ్డుకున్నదేకాక,గ్రామపంచాయతీలుగా ఉన్న తండాలను విలీనం చేయాలనుకోవటం ఎమ్మెల్యేకు గిరిజనుల పట్ల ఉన్న చిన్నచూపుకు ఇది నిదర్శనమని ఎద్దేవా చేశారు.
మీరు చేసిన ఈ దుశ్చర్యను తండా వాసులు వ్యతిరేఖిస్తుంటే పోలీసులు,అదికారులను తీసుకెల్లి భయబ్రాంతులకు గురిచేయడం సమంజసం కాదని ఎమ్మెల్యేపై మండిపడ్డారు.ఇప్పటికైనా తండా విలీన ప్రక్రియ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు.

నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి

ఎస్సై పరమేశ్వర్

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల ప్రజలం దరూ నూతన సంవత్సర వేడుకలను నిబంధనలకు లోబడి జరుపుకోవాలని ఎస్సై పరమేశ్వర్ తెలియజేయడం జరిగింది.మండల ప్రజలకు ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మద్యం తాగి వాహనాలు నడపరాదని, 31 రాత్రి గుంపులు గుంపులుగా తిరగరాదని అన్నారు. ఎటు వంటి ఎంటర్టెన్మెంట్ కార్యక్ర మాలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు.కేక్ కట్ చేయాలి అనుకునే వారు తమ తమ ఇళ్ళలోనే చేసుకోవాలని సూచనలు ఇవ్వడం జరిగింది నూతన సంవత్సర ఆరంభ వేడుకలు ఎటువంటి గొడవలను తావివ్వకుండా ప్రజలు ప్రశాంత వాతావరణం లో నిర్వహించుకోవాలని ఎస్సై ఒక ప్రకటనలో తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించకుండా నూతన సంవత్సరానికి స్వాగత వేడుకలు ప్రశాంత వాతావ రణంలో జరుపుకోవాలని హితవుపలికారు. సంవత్సరం నూతన సంవత్సర వేడుకలు శృతిమించకుండా పోలీసుల సూచనలు తప్పకుండా పాటించ వలసిందిగా సూచించారు. టపాసులు పేలుస్తూ ఇతరులకు అసౌక ర్యం ఇబ్బంది కలిగించరాదని తెలిపారు. ఎవరైనా శృతి మించి మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ కనిపిస్తే, వారిపై చట్ట పరమైన కఠిన చర్యలు తీసు కోవడం జరుగుతుందని హెచ్చరిం చారు. మైనర్లు మోటార్ సైకిల్ (ద్విచక్ర వాహనాలు) నడుపు తూ రోడ్లపై కనిపిస్తే ఆ మోటార్ సైకిల్ యజమానిపై,తల్లిదండ్రు లపై చర్యలు తీసుకోబడు తుందని హెచ్చరించారు.

సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించు కుందాం

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా

నేటి ధాత్రి:
సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ప్రజలకు సూచించారు. నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని ప్రజలు ప్రశాంతవంతమైన వాతవరణంలో ఎలాంటి ఆవాంనీయ సంఘటనలు జరగకుండా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోనేందుకు పలుసూచనలు చేస్తూ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సోమవారం ప్రకటన విడుదల చేసారు. డిసెంబర్‌ 31 రాత్రి నిర్వహించుకునే నూతన సంవత్సర వేడుకల సందర్బం గా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ పరిధిలో స్థానిక పోలీసులతో పాటు ట్రాఫిక్‌, టాస్క్‌ఫోర్స్‌, క్రైమ్‌, షీ టీమ్స్‌తో పాటు పెట్రోలింగ్‌ విభాగాలకు చెందిన పోలీసులు ముమ్మరంగా పెట్రోలింగ్‌ నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ వేడుకలను ప్రజలు ఆర్థరాత్రి 12.30 గంటలలోపు ముగించుకోవా ల్సి వుంటుందని. ఈ నూతన సంవత్సర వేడుకుల సందర్బంగా ఎర్పాటు చేసే సంస్కృతిక కార్యక్రమాలకు నిర్వహకులు తప్పని సరిగా పోలీసు అధికారుల నుండి ముందస్తూ అనుమతులు తీసుకోవడంతో పాటు, వేడుకలు నిర్వహించుకునే ప్రాంతంలో ఎలాంటి అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని. అలాగే కార్యక్రమాల నిర్వహణ ప్రదేశంలో తప్పనిసరిగా సిసి కెమెరాల ఏర్పాటు చేయడంతో పాటు సెక్యూరీటీ సిబ్బంది ఎర్పాటు చేసుకోవాల్సి వుంటుందని. ఈ వేడుకలు జరిగే సమయంలో ఎలాంటి ట్రాఫిక్‌ సమస్యలతో పాటు పరిసర ప్రాంతాల్లోని ఇండ్లవారికి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని, వేడుకల్లో ఎలాంటి మత్తు పదార్థాల వినియోగించడం లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని. ప్రధానంగా ఈ వేడుకల వేళ యువకలు మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనీఖీల్లో పోలీసులకు చిక్కితే జరిమానతో పాటు జైలు శిక్ష విధించబడుతుందని. అలాగే వేగంగా వాహనాలు నడపడం, రోడ్లుపై వెళ్ళేవారిని ఇబ్బందికి గురిచేసే వ్యవహరిస్తే సదరు వాహనదారులకు చట్టపరమైన తిప్పలు తప్పవని, రోడ్లపై ట్రాఫిక్‌ సమస్యలు రాకుండా ట్రాఫిక్‌ సిబ్బందితో పాటు స్థానిక పోలీసుల అధ్వర్యంలో ట్రై సిటితో పాటు, గ్రామీణా ప్రాంతాల్లోను ముమ్మరంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌ తనీఖీలు నిర్వహించబడుతాయని. అలాగే ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే విధంగా బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలను నిర్వహిస్తే వారిపై తగు చర్యలు తీసుకోబడు తుందనిపై అంక్షలను ఎవరైన అతిక్రమించిన, ఉల్లంఘించిన ట్లుగా ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 100 నంబర్‌కు సమాచారం అందిం చడం ద్వారా తక్షణమే స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతాయని, ఈ వేడుకలను ప్రజలు, యువత తమ ఇండ్లలోనే తమ కుటుంబ సభ్యులతో కల్సి సంతోషకరమైన వాతరణంలో నిర్వహించు కోవాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ప్రజలకు సూచించారు.

న్యూయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి

నూతన సంవత్సర శుభాకాంక్షలు

పరకాల సీఐ క్రాంతికుమార్

పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు నూతన సంవత్సర శుభాకాంక్షలు పరకాల సీఐ క్రాంతికుమార్ తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ డిసెంబర్ చివరి రోజు కావడంతో నూతన సంవత్సర ఉత్సాహంతో యువత మద్యం సేవించి వాహనాలు నడిపినా,మైనర్లు వాహనాలు నడిపినా కేసులు నమోదు చేస్తామని నిబంధనలకు విరుద్ధంగా డీజీలు వినియోగిసే చట్టరీత్యా చర్యలుతీసుకుంటామని వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించుకోవాలని తెలిపారు.

క్రమశిక్షణ,విద్యపై అవగాహన సదస్సు

విద్యార్థుల కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్సై

మరిపెడ ఎస్సై బొలగాని సతీష్ గౌడ్.

మరిపెడ నేటిధాత్రి

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో ని గ్లోబల్ స్కూల్లో గ్లోబల్ స్కూల్ కరస్పాండెంట్ కాలు నాయక్, డైరెక్టర్ అఫ్జల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విద్య క్రమశిక్షణతో కూడిన అవగాహన సదస్సు ను నిర్వహించిన సందర్భంగా ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా మరిపెడ ఎస్సై బొలగాని సతీష్ గౌడ్ హాజరయ్యారు, అనంతరం విద్యార్థుల ను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుకొని మంచి క్రమశిక్షణతో ముందుకెళ్లాలని మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదని భవిష్యత్తులో మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని చెడు మార్గాలకు అలవాటు పడకూడదని, పదవ తరగతిలో మంచి ఉత్తీర్ణత సాధించి ఇంటర్ డిగ్రీ పై స్థాయిలకు వెళ్లి మంచిగా చదువుకొని భవిష్యత్తులో స్థిరపడి మీ తల్లిదండ్రులకు మీ గ్రామానికి మీరు సేవ చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు, విద్యార్థులు చదువు మానేసి
రోడ్లపై తిరగడం బైకులపై రాష్ డ్రైవింగ్ చేయడం వంటివి చేయకూడదని మంచి సత్ప్రవర్తనతో జీవితంలో ముందుకెళ్లాలని విద్యార్థులను ఉద్దేశించి చెప్పడం జరిగింది విద్యార్థుల కు ముందు గా
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు,ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తామస్ బెన్నీ , ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
తెలిపారు. 2025 సంవత్సరం అందరికీ శాంతి, సంతోషం, ఆరోగ్యం, అభివృద్ధి కలిగించాలని ఆకాంక్షించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన చిట్ట చివరి కుటుంబం వరకు చేరేలా అన్ని శాఖల అధికారుల సమిష్టి కృషితో ముందుకు ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితాలు ఆనందమయం కావాలని అన్నారు. జిల్లా అభివృద్ధిలో ఆదర్శంగా నిలవాలని ఆయన పేర్కొన్నారు.
అధికారులకు బొకేలు, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలపడం సహజమని, అయితే వాటికి బదులుగా పేద విద్యార్థులకు ఉపయోగపడేలా నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, ఇతర సామగ్రి ఇవ్వాలని ఆయన సూచించారు. శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే వివిధ శాఖల అధికారులు, తదితరులు బొకేలు, పుష్ప గుచ్చాలకు బదులు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు వంటివి అందించి పేద విద్యార్థులకు చేదోడువాదోడుగా నిలవాలని తెలిపారు. త్వరలోనే వాటిని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అధికారులతో కలిసి చెక్ డ్యామ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే

నడికూడ,నేటిధాత్రి:

మండలంలోని నార్లాపూర్ గ్రామం ముంపునకు గురి కాకుండా శాశ్వత ప్రతిపాదికన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశించారు.
మంగళవారం నడికూడ మండలం నార్లపూర్ గ్రామంలోని పెద్దవాగుపై బ్రిడ్జి, చెక్ డ్యామ్,మత్తడి కాల్వను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు.నార్లాపూర్ గ్రామం ముంపుకి గురి కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కల్వర్టు ఇరువైపులా,మత్తడి పక్కన ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని, గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు.

error: Content is protected !!
Exit mobile version