దేవరకద్ర నియోజకవర్గ ఇన్చార్జి కొండా ప్రశాంత్ రెడ్డి..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం/ దేవరకద్ర మండలం గద్దె గూడెం గ్రామంలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమనికి దేవరకద్ర బిజెపి ఇన్చార్జి కొండ ప్రశాంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవరకద్ర నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ కొండ ప్రశాంత్ రెడ్డి.మాట్లాడుతూ,
ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ మెజార్టీ వచ్చే విధంగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో దేవరకద్ర మండల అధ్యక్షుడు కృష్ణంరాజు, సభ్యత్వ నమోదు ఇంచార్జ్ నారాయణరెడ్డి, గ్రామ నాయకులు దామోదర్,అనిల్, మహేష్, రాము, మహేందర్, దేవేందర్, యువ నాయకులు ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.