AYS రాష్ట్ర, జిల్లా నాయకులు మల్లయ్య,యుగేందర్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
ఈనెల 29న ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ హన్మకొండ లో జరుగే అంబేద్కర్ యువజన సంఘం 48వ వార్షికోత్సవ సభ కు సంఘం నాయకులు దళిత బహుజనులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య , జిల్లా సాంస్కృతిక కార్యదర్శి జన్నే యుగేందర్ లు కోరారు.
శుక్రవారం రోజున జయశంకర్ జిల్లా మొగుళ్ళ పెల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు మంగళ పెల్లి శ్రీనివాస్ అద్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ దళితులపై మహిళలపై జరుగుతున్న సంఘటనలు అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి అంబేద్కర్ సంఘాలను బలోపేతం చేయడం ఎంతో అవసరం ఉందన్నారు. గ్రామ, మండల, జిల్లా కమిటీలు పునః నిర్మాణం చేయాలని చెప్పారు. భారత రత్న, ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. *అంబేద్కర్ యువజన సంఘం 48వ వార్షికోత్సవ సభను ఈనెల 29న ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ హన్మకొండ లో జరుగుతున్న సభకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అద్యక్ష, కార్యదర్శులతో పాటు కార్యకర్తలు,SC ST BC మైనారిటీ వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు బండారి రాజు,, మండల నాయకులు అంబేద్కర్ యువజన సంఘం మండల ఉపాధ్యక్షులు రేణిగుంట్ల చందర్, అంబేద్కర్ యువజన సంఘం మొగుళ్ళపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు బండారి కుమార్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పేరుక తిరుపతి మొగిలి, బండారి బిక్షపతి, రేణికుంట్ల పోచయ్య, వంతడుపుల చందర్, మేకల సారయ్య,