సీఎం రేవంత్ రెడ్డికి మాదిగ జాతి రుణపడి ఉంది.
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య.
చిట్యాల, నేటిధాత్రి :
తెలంగాణ మాదిగ జాతికి సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు అని చెప్పిన మాట ప్రకారం హామీని నెరవేరుస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మార్గజాతి తరపున ధన్యవాదాలు తెలియజేశారు.
చేవెళ్ల డిక్లరేషన్ భాగంగా కోర్టు తీర్పు వచ్చిన రోజు అసెంబ్లీలో
ప్రకటించి వెను వెంటనే క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి వారి యెక్క సూచనల మేరకు ఏకసభ్య కమిషన్ నియమించి రాష్ట్రంలో వర్గీకరణ తీసుకోవాల్సిన చర్యలు అన్ని తీసుకొని అసెంబ్లీలో వర్గీకరణ చర్చ చేసి క్యాబినెట్ సమావేశంలో ఆమోదిం న్యాయం చేయాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం హర్షణీయం అని తెలియజేశారు
రానున్న రోజుల్లో జనాభా దామాషా ప్రకారం విద్య ఉద్యోగ రంగాలలో కాక చట్ట సభల్లో మరియు నామినేటెడ్ పదవుల్లో కూడా మాదిగ జాతికి న్యాయం జరుగుతుంది గత 45 సంవత్సరాలుగా అన్యాయం తొలగిపోయి జనాభ దామాషా ప్రకారం అని పదవుల్లోనూ మాదిగలకు వాటా లభిస్తుందని అన్నారు
ఎస్సీ వర్గీకరణ కోసం అహర్నిశలు కృషి చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన
రాష్ట్ర ముఖ్యమంత్రి కి మాదిగ జాతి తరపున కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.