పలిమెల మహాదేవపూర్ గోదావరి,కి ఆనుకొని ఎనిమిది ఇసుక క్వారీలు, ప్రారంభానికి అనుమతులు.
ఇసుక రవాణాకు మ్యానువల్ డంపింగ్ ప్రారంభం, త్వరలో ఇసుక రవాణాకు సిద్ధం.
ఇసుక క్వారీ డంపింగ్ పనులు ప్రారంభం, ఇసుక రవాణా కొరకు మాన్యువల్ పద్ధతిలో ఇసుక సిద్ధం.
కాంట్రాక్టర్ లు గ్రామస్తులకు ప్రత్యేక ఉపాధి కల్పించాలి, మాన్యువల్ పద్ధతితో తో ప్రజలకు ఉపాధి.
క్వారీల నిర్వహణలో సమాచార సాంకేతిక అపుహాలను నమ్మి మోస పోవద్దు, ఉపాధికి కోల్పోయి అనేక ఇబ్బందులు.
మహదేవపూర్- నేటి ధాత్రి;
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ని గోదావరి పరివాహక ప్రాంతానికి ఆనుకొని ఉన్న మహాదేవపూర్ ఉమ్మడి మండలం లో 2016 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి పరివాహక ప్రాంతం నుండి ఇసుక క్వారీలను ఏర్పాటు చేసి ప్రభుత్వ ఖజానా ఆదాయం సమకూర్చడం లో సఫలీకృతం కావడం జరిగింది. మరోవైపు ఉమ్మడి మండలంలోని ప్రజలకు సుమారు ఐదు సంవత్సరాల పాటు ఉపాధి కూడా లభించింది. కోవిడ్ అనంతరం 2021 మహాదేవపూర్ నుండి అంబడ్ పల్లి వరకు గోదావరి సరిహద్దుకు కొనసాగిన సుమారు 14 క్వారీలు మూసివేయడం, కాలేశ్వరం పరిధిలోని మరో 8 క్వారీలు మూసి వేసి నామమాత్రంగా క్వారీలు నిర్వహణ కొనసాగడం నేటికీ జరుగుతుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో క్వారీల మూసివేత ప్రభుత్వ ఖజానా, పేదా మధ్య తరగతి కుటుంబాలకు ఉపాధి కోల్పోయి ఇబ్బందులకు దారి తీసింది. ఉమ్మడి మండల ప్రజలు ఇసుక క్వారీల ప్రారంభంతో తమకు ఉపాధి కలుగుతుందని వేచి ఉన్న ప్రజలకు, ప్రకృతి సంపద తిరిగి ఆ పేద ప్రజలకు వరంగా మరే సందర్భం రావడం, ఉపాధి పొందే మరో సువర్ణ అవకాశం కలగడంతో, ప్రజల్లో ఆనందానికి అంతు లేకుండా పోయింది. మహాదేవపూర్ ఉమ్మడి మండలం పలిమెల అంబడ్ పల్లి గ్రామ గోదావరి నుండి ఇసుక రవాణాకు గత సంవత్సరం నవంబర్లో ఆరు ఇసుక క్వారీలు ఏర్పాటు చేస్తూ శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం 8 నూతన ఇసుక క్వారీల్లో యజమానులు పనులు మొదలు పెట్టారు.
ఉమ్మడి మండల ప్రజల కల సహకారం అయింది. మూడు సంవత్సరాలుగా ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ముక్తేశ్వరుడు కరుణించాడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహదేవ్పూర్ ఉమ్మడి మండలంలో 6 నూతన ఇసుక క్వారీలను ప్రారంభించుటకు టి ఎస్ ఎం డి సి శాఖ అంబడ్ పల్లి గ్రామ గోదావరి సరిహద్దు నుండి మొదలుకొని, పంకెన గ్రామం వరకు, అంబడ్ పల్లి 2 అంబడ్ పల్లి 3, అంబడ్ పల్లి 4, పంకెన1,పంకెన2, పెద్దంపేట 1, మహాదేవపూర్ మండలంలోని కుదురుపల్లి రెండు ఇసుక క్వారీలను ప్రారంభించుటకు యజమాన్యులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. టెండర్ దక్కించుకొని అగ్రిమెంట్ పూర్తి చేసుకున్న యజమానులు, ఇసుక రవాణాకు పనులను ప్రారంభం చేసుకునే క్రమంలో పడ్డారు. ఒక లక్ష మ్యాట్రిక్ టన్నులతో పాటు నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు అలాగే లక్ష అరవై వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను రవణ కొరకు శాఖ ఆరు క్వారీలకు, అనుమతులు ఇవ్వడంతో పాటు, మాన్యువల్ పద్ధతిలో ఇసుక రవాణా మరియు డంపింగ్, ట్రాక్టర్లలో స్థానిక ప్రజల నుండి ఇసుకను లోడ్ చేయడం, నిబంధనలతో ఆరు ఇసుక క్వారీలను ప్రారంభానికి అనుమతులు, జారీ చేయడం తో పనులు కొనసాగించడం
జరుగుతుంది.మిగితా క్వారీల ప్రారంభం కొరకు ఎదురు చూస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇసుక రవాణా విషయంలో ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా ఇసుక రవాణాలో అవక తవకలు జరగకుండా చర్యలు చేపట్టింది. ఇసుక క్వారీలు నిర్వహించే ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉపాధి కలిగేలా ప్రభుత్వం మరియు టిఎస్ఎండిసి, శాఖ ప్రత్యేక నిబంధనలతో క్వారీలు నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చింది. మాన్యువల్ డంపింగ్ లోడింగ్, లోడింగ్ చేసే క్రమంలో మిషనరీ లాంటి వాటిని నిషేధిస్తూ, గ్రామీణ ప్రజలతో లోడింగ్ చేసి, ట్రాక్టర్ల ద్వారా గోదావరి నుండి ఇసుక తీసుకువచ్చి డంపింగ్ చేసే విధానాన్ని అవలు పరచాలని ఆదేశించింది. టి ఎస్ ఎన్ డి సి అలాగే ప్రభుత్వం జారీ చేసిన మాన్యువల్ డంపింగ్ పద్ధతిని అనుసరిస్తూ ఇసుక క్వారీ యజమానులు ఆయా గ్రామస్తులతో ఇసుక డంపింగ్ పనులు చేపట్టే క్రమంలో పడ్డారు.ప్రస్తుతం మహాదేవపూర్ మరియు పలిమెల గోదావరి ప్రాంతాల్లో నిర్వహించ పడుతున్న ఇసుక క్వారీలకు సంబంధించి, గ్రామాల ప్రజలు ఉపాధి కోల్పోకుండా ప్రజలు ఇసుక డంపింగ్ వ్యవహారంలో కూలి విషయాలతో పాటు ఇతర రవాణా సౌకర్యాలకు సంబంధించి గ్రామస్తులు క్వారీల యజమానులతో పాక్షికంగా వ్యవహరిస్తూ, క్వారీల నిర్వహణ సాఫీల జరిగేలా ప్రజలు మరియు యజమాన్యులు కలిసి సమన్వయం తో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.
వాహనాల అలజడి ప్రజల కండ్లల్లో ఆనందం ఎటు చూసినా ఏదో ఒక పనిలో నిమగ్నమైన ఉమ్మడి మండలంలో మళ్ళీ ఆకల తిరిగి ప్రారంభం కాబోతుంది. టీఎస్ ఎండిసీ, శాఖ గత సంవత్సరం నవంబర్లో మెడిగడ్డ ప్రాజెక్ట్ గోదావరి వద్ద ఆరు నూతన ఇసుక క్వారీలను మంజూరు చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలుతో పనులు సాగించలేదు, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఇసుక క్వారీల రవాణా అవకతవకల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించిన ప్రభుత్వం మాన్యువల్ పద్ధతిని అడరాంగ్ నూతన 6 క్వారీల నిర్వహణకు అగ్రిమెంట్ చేస్తూ టిఎస్ఎండిసి శాఖ ఇసుక రవాణాకు అనుమతులు ఇచ్చింది. అంబడ్ పల్లి,2,3,4, లింకల గడ్డ 1,పంకేన,1,2 పేర్లతో ఆరు ఇసుక క్వారీలు 160 మ్యాట్రిక్ టన్ లక్ష క్యూబిక్ మీటర్లు నాలుగు క్వారీలకు కేటాయిస్తూ మరో రెండు క్వారీలకు నాలుగు లక్షల మెట్రిక్ టన్ ఆరు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తోడుటకు అనుమతులు ఇవ్వడం జరిగింది. ప్రక్రియ పూర్తి చేసుకున్న అనంతరం ఇసుక డంపింగ్ మాన్యువల్ పద్ధతిలో ప్రారంభించి ఇసుక రవాణా కొరకు సిద్ధం చేసుకోవడంలో నిమగ్నం కావడం జరిగింది.
ఉమ్మడి మండలంలో ఇసుక రవాణా నూతనంగా ఏర్పాటు చేసిన ఇసుక క్వారీలు మెన్యువల్ పద్ధతిలో ఇసుక డంపింగ్ పనులు చేపట్టడం, తో గ్రామస్తులు ఉపాధి కలగడం ఆనందంగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఆరు ఇసుక క్వారీల్లో గత పది రోజుల నుండి పెద్దంపేట ఇసుక క్వారీ 160 మ్యాట్రిక్ టన్ లక్ష క్యూబిక్ మీటర్ల అనుమతి గల క్వారీ స్థానికులకు ఉపాధి కల్పిస్తూ గోదావరి నుండి టాక్టర్ నుండి మాన్యువల్, పద్ధతి ద్వారా గ్రామస్తుల తో ఇసుకను నింపి రవాణా కొరకు స్టోర్ చేయడం మొదలుపెట్టింది. మాన్యువల్ పద్ధతిలో ఇసుక లోడింగ్ విషయంలో గ్రామానికి చెందిన అనేకమంది ఉపాధి పొందడంతోపాటు వారికి గిట్టుబాటు ధర కూలి అందడంతో గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేయక తప్పడం లేదు. పెద్దంపేట ఇసుక క్వారీ మరి కొద్ది రోజులపాటు మాన్యువల్ పద్ధతితో ఇసుకను స్టోర్ చేసి రవాణా చేయుటకు సిద్ధంగా ఉంది. అలాగే ఇతర ఐదు క్వారీలు కూడా ఇసుక స్టోర్ కొరకు భూముల లీజు వ్యవహారంతో పాటు గ్రామస్తులతో కూలి విషయంలో చర్చలు అలాగే ట్రాక్టర్ లోడింగ్ వ్యవహారంపై గిట్టుబాటు ధర తోపాటు రహదారి కొరకు భూముల లీజు లాంటి ఒప్పందాల కొరకు చర్చలు సాగిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో మిగతా ఇసుక క్వారీలు ప్రారంభం కానున్నాయి.
ఆరు ఇసుక క్వారీల కు సంబంధించి కాంట్రాక్టర్ లు క్వారీల ఇసుక డంపింగ్ మాన్యువల్ పద్ధతి ద్వారా పనులు ప్రారంభించారు.మిగితా ఇసుక క్వారీలు ప్రారంభానికి నోచుకోలేదు. మాన్యువల్ పద్ధతిలో ఇసుక లోడింగ్ వ్యవహారంలో గ్రామస్తులు కూలి గిట్టుబాటు కుదరక పోవడం, భూముల లీజు విషయాలు, స్థానిక ట్రాక్టర్ ల ద్వారా గోదావరి నుండి ఇసుక రవాణా చేసి స్టోర్ చేసే వ్యవహారం, ధర నిర్ణయంపై సుముఖత లేకపోవడం ప్రారంభం కావడం లేదు . యజమానులు ప్రాంత ప్రజలకు ఉపాధి విషయంలో కాస్త సహనాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్టర్ లు ప్రజల తో పాటు ప్రభుత్వా ఆదాయం అనే విషయం , ప్రత్యేకంగా కాంట్రాక్టర్ లు స్థానిక ప్రజలు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. మ్యానువల్ పద్ధతి తో ఒక ఇసుక క్వారీలో సుమారు ప్రతిరోజు 200 ఒక ట్రాక్టర్ లు సుమారు 30 ట్రిప్పులు ఒక్కొక్క ట్రాక్టర్ కు 20 నుంచి 40 కూలీలతో మాన్యువల్ పద్ధతి ద్వారా ఇసుక రవాణాకు అవసరం పడుతుంది.6 ఇసుక క్వారీలకు సుమారు 1200 ట్రాక్టర్లు అలాగే సుమారు మూడు వందల నుండి 450 వరకు ప్రతిరోజు గ్రామస్తులకు ఉపాధి లభిస్తుంది. ట్రాక్టర్ మరియు కూలీల ధర విషయానికొస్తే ఒక ట్రాక్టర్ 30 ట్రిప్పులకు ట్రిప్పుకు 200 నుండి 350 రూపాయల వరకు యాజమాన్యం అందిస్తే ఒకరోజు 6000 నుండి 9000 వరకు ట్రాక్టర్ ధర, కూలి విషయానికొస్తే 150 రూపాయల నుండి 250 రూపాయల వరకు సుమారు 30 ట్రిప్పుల ఒక్క కూలికి 1500 నుండి 2500 రూపాయల వరకు లభిస్తుంది. గ్రామస్తులు, కాంట్రాక్టర్లు ఏకతాటిపై వచ్చి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని సంపూర్ణంగా అందేలా కృషి చేయాల్సిన అవసరం ఉంది.
ఇసుక రవాణా విషయంలో కాంట్రాక్టర్ మరియు గ్రామస్తులు, టీఎస్ఎండిసి అధికారులు క్వారీల నిర్వహణపై, సాంకేతిక సమాచార మాధ్యమంలో అపూహలు నమ్మి. పేద ప్రజలకు ఉపాధికి దూరం చేసే లా వ్యవహా రించకూడదు. కాంట్రాక్టర్లు అపూహలు నమ్మి ఇబ్బందులకు గురి కావడం అంతకు లేదు, గతంలో అపూహలకు భరించ లేక, కాంట్రాక్టర్లు క్వారీలను వదిలి పెట్టడం జరిగింది. ప్రజలు ఉపాధిని కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది.