Mollamamba Statue Unveiled at Narsampet
నర్సంపేటలో మొల్లమాంబ విగ్రహం ఆవిష్కరణ
పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ శ్రీలక్ష్మీ రామానంద్
నర్సంపేట, నేటిధాత్రి:
నర్సంపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట శాలివాహన కులస్తుల ఆహ్వానం మేరకు తొలి తెలుగు కవయిత్రి కుమ్మరి ఆతుకూరి మొల్లమాంబ విగ్రహాన్ని శుక్రవారం ఆవిష్కరించారు.మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ ముఖ్య అతిథిగా హాజరై శాలివాహన సంఘ సభ్యులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో సరళమైన శైలిలో ‘మొల్ల రామాయణం’ రచించి తెలుగు జాతి కీర్తిని దశదిశలా చాటిన కుమ్మరి శాలివాహన కుల రత్నం ఆతుకూరి మొల్లమాంబ అని కొనియాడారు. నేటి సమాజంలో మహిళలు, యువత, విద్యార్థులు మొల్లమాంబ జీవితాన్ని, ఆమె పట్టుదలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో కుమ్మరి కుల సంఘ ప్రతినిధులు, కులస్తులు పాల్గొన్నారు.
