ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలి…
బిఆర్ఎస్ నాయకులు..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
అసెంబ్లీ లో బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ని సస్పెండ్ చేయడం అమానుషమని బీఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజా రమేష్ బాబు అన్నారు. ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పై వేసిన సస్పెన్షన్ ఎత్తివేయాలని నిరసన వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను రామకృష్ణాపూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ చౌరస్తాలో బిఆర్ఎస్ శ్రేణులు దహనం చేశారు. ఈ సందర్భంగా రాజా రమేష్ మాట్లాడుతూ…. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరచడం లేదని, ప్రజా పాలనలు కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయిందని అన్నారు. అసెంబ్లీ స్పీకర్ కు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని, ప్రజా సమస్యలను అసెంబ్లీలో గలం వినిపిస్తున్న జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం సరికాదని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ తన సత్తా చాటుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, నాయకులు బడికల సంపత్, రామిడి కుమార్, పోగుల మల్లయ్య, రేవల్లి ఓదెలు, అలుగుల సత్తయ్య, యువ నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.