జైపూర్, నేటి ధాత్రి:
సుందిళ్ళ బ్యారేజిని శుక్రవారం రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి సందర్శించారు.
ఈ సందర్భంగా మంథని మున్సిపల్ చైర్ పర్సన్ రమాదేవి, మండల కాంగ్రెస్ నేతలు కలిసి మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం జాతీయ డ్యాం సేఫ్టీ నిపుణులు ఎన్ డి ఎస్ ఏ సూచనల మేరకు జరుగు తున్న మరమ్మత్తు, వరద ముప్పు నివారణ పనులను పర్యవీక్షించారు.
బ్యారేజి పిల్లర్ల రక్షణ కొరకు పనులు వేగవంతంగా జరు గుతున్నాయని నిపుణులు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల బ్యారేజీలు కుంగిపోయాయని ఆరోపించారు.
అలాగే నిపుణులు సూచనల మేరకు బ్యారేజీల పనులు యుద్ధ ప్రాతిపదికన జరుపడానికి సూచనలు చేసినట్టు తెలిపారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన విధంగా తమ్మిడిహట్టి ప్రాజెక్ట్ ను ప్రభుత్వం పూర్తి చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.