అన్నారం లక్ష్మి బ్యారేజ్ పనులను పరిశీలించిన ఉత్తంకుమార్ రెడ్డి.
బ్యారేజ్ నీటి సమస్యను, మంత్రి దృష్టికి తీసుకువచ్చిన గ్రామస్తులు.
టిఆర్ఎస్ ప్రభుత్వం సెంట్ భూమి లేకుండా చేసింది. గ్రామస్తులు ఆవేదన.
కరకట్ట నిర్మించి రైతులకు ఆదుకోవాలి, మంత్రికి విజ్ఞప్తి చేసిన గ్రామస్తులు.
మహాదేవపూర్,-నేటి ధాత్రి:
లక్ష్మీ బ్యారేజ్ పనుల్లో జాప్యం చేయకూడదని వర్షా కాలానికి ముందు పనులు పూర్తి కావాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ అన్నారు. శుక్రవారం రోజున మేడిగడ్డ మూడవ విడత పరిశీలన కార్యక్రమంలో భాగంగా జస్టిస్ ఘోష్ తో కలిసి సుందిళ్ల బ్యారేజ్ పరిశీలించిన అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండలం అన్నారం లక్ష్మీ బ్యారేజ్ ను సందర్శించడం జరిగింది. లక్ష్మీ బ్యారేజ్ సందర్శన కొరకు వచ్చిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి జిల్లా కలెక్టర్ స్వాగతం పలికారు. అనంతరం మంత్రి లక్ష్మి బ్యారేజ్ 34వ పిల్లర్ డౌన్ స్ట్రీమ్ వద్ద చేపడుతున్న కౌంటింగ్ పనులను పరిశీలించడం జరిగింది. అలాగే పనుల పురోగతిని ఇంజనీరింగ్ అధికారులు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వివరించడం జరిగింది.
అలాగే లక్ష్మి బ్యారేజ్ అప్ స్ట్రీమ్ లో తొలగించిన ఇసుక మేటులను అలాగే సిసి బ్లాక్ ల పనులను మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి క్షుణ్ణంగా పరిశీలించారు. స్థానిక ఇంజనీరింగ్ అధికారులు, స్థానికంగా ఉన్న రైతులు బ్యారేజ్ వర్షాకాలంలో వందల ఎకరాల పంటలు నష్టపోవడం జరుగుతుందని అనేకమార్లు అధికారులకు వీటి విడుదల సమయంలో తమకు ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పిన బ్యారేజ్ ఏ వైపున నీళ్లు వదిలిన పంట పొలాల్లో వచ్చి నష్టపోవడం జరుగుతుందని మంత్రికి తెలిపారు. గత ప్రభుత్వం తమకు ఏమీ చెప్పకుండా భూములు తీసుకోవడం జరిగిందని, ఇప్పటివరకు తమ భూములకు పరిహారం కూడా అంత లేదని గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే మీకు రకని మంత్రి స్థానికుల సమస్యలకు సమాధానం ఇస్తూ వారితో ఆప్యాయంగా పలకరించారు. అన్నారం సరస్వతి బ్యారేజ్ మరమ్మతు పనులకు సంబంధించి క్షుణ్ణంగా పరిశీలించి, సాధ్యమైనంత త్వరలో పనుల్లో పురోగతి పెంచాలని ఇంజనీరింగ్ అధికారులు అలాగే నిర్మాణ సంస్థ ప్రతినిధులకు మంత్రి సూచించారు.
గుండ్రాజ్ పల్లి గ్రామస్తులు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి గత ప్రభుత్వం తమ భూములను లాక్కొని అన్యాయం చేసిందని నేడు సెంటు భూమి లేకుండా చేసిందని మంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి అవార్డు అనేది తెలవదని కాన్సెట్ అవార్డు అన్న పేరు తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టుకుని భూములు తీసుకోవడం జరిగిందని ప్రస్తుతం గ్రామంలో బతుకుదెరువులకు పక్క ఊరికి కూలీలకు వెళ్లే పరిస్థితి ఉందని, చెప్పుకుందాం అన్న ఎవరికి దగ్గరికి రానివ్వలేదని ఈరోజు మీ దగ్గరికి వచ్చి చెప్పుకోవడం తమకు ఎంతో సంతోషంగా ఉందని గుండ్రాజ్ పల్లి గ్రామస్తులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వివరించడం జరిగింది. సాధ్యమైనంత త్వరలో మీకు జరిగిన నష్టాన్ని విచారణ జరిపించి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అక్కడి నుండి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి విడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ కు వెళ్లడం జరిగింది.
సరస్వతి బ్యారేజ్ పరిశీలన కొరకు వచ్చిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి అన్నారం గ్రామస్తులు రైతులు బ్యారేజ్ దిగువ ఉన్న భూముల రక్షణ కోసం దిగువ 10 కిలోమీటర్ల మేరకు కరకట్ట నిర్మించాలని, సండ్రుపల్లి నాగేపల్లి మద్దులపల్లి పలువుల కుంట్లం గ్రామాలకు ఆర్ అండ్ బి లో తీసుక రావాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. వారి సమస్యలను సానుకూలంగా స్పందించి పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. మంత్రిని వినతి పత్రం ఇచ్చిన వారిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మంచినీళ్ల దుర్గయ్య కాటారం మండల అధ్యక్షుడు ప్రభాకర్ మాజీ సర్పంచ్ రమా, శేఖర్ రెడ్డి, తిరుపతిరెడ్డి, నగేష్ యాదవ్, సంతోష్, మహేష్, సమ్మయ్య, తోపాటు ఇతర గ్రామస్తులు రైతులు ఉన్నారు.