నర్సంపేట,నేటిధాత్రి :
ఖానాపురం మండలంలోని అశోక్ నగర్ గ్రామంలో కోయకుల ఆదివాసి ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి పూజా కార్యక్రమ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్, జిల్లా అధికార ప్రతినిధి తక్కల్లపల్లి రవీందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రవీందర్ రావు మాట్లాడుతూ ఆదివాసి కులస్తులు, అశోక్ నగర్ గ్రామ ప్రజలు పెద్దమ్మ తల్లి దయదక్షిణాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి సంక్షేమం కొరకు నర్సంపేట ఎమ్మెల్యే మాధవ రెడ్డి దృష్టికి తీసుకుపోతానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ఎల్ది శ్రీనివాస్ గౌడ్, కోయ కుల సంఘం దొర వట్టం పేరుమన్న పటేల్, కొట్టెం నర్సయ్య, మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టి సారంగపాణి, మాజీ వార్డ్ మెంబర్ పొనుగోటి ప్రవీణ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కుస మునేందర్, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు ముసుకు మోహన్ రెడ్డి, గ్రామ కార్యదర్శి కర్ల రాజేందర్, యూత్ కార్యదర్శి దొడ్ల మురళి,బీసీ సెల్ గ్రామ శాఖ అధ్యక్షుడు కదురు సారయ్య, ఎస్సి సెల్ గ్రామ శాఖ అధ్యక్షుడు జాడి వెంకటేష్,ఈసం నర్సయ్య, బొంపల్లి అనిల్, దొడ్ల కిరణ్, ఏరూప లక్ష్మణ్, ఇరుప వీరస్వామి, గట్టి రవి, చెరుప శ్రీకాంత్, వజ్జ శ్రావణి, ఆదివాసి కుల సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు.