BJP Slams Konda Surekha Remarks
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు అత్యంత బాధాకరం
బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి పాలకుర్తి తిరుపతి
పరకాల,నేటిధాత్రి
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి పాలకుర్తి తిరుపతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లాది మంది ఆరాధ్య దైవమైన శ్రీ రామున్ని,జై శ్రీరామ్ నినాదాన్ని ఎగతాళి చేయడం తెలంగాణ ప్రజల భావోద్వేగాలను అవమానించడమేనన్నారు.ప్రజల విశ్వాసాలతో ఆడుకోవడం ఒక ప్రజాప్రతినిధికి తగదని దేవాదాయ శాఖ మంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరమన్నారు.మంత్రి కొండా సురేఖ తక్షణమే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని,రామ భక్తులందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.ధర్మాన్ని అవమానిస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తిరుపతి అన్నారు.
