Make PM Modi Meeting a Success
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయండి
ఎంపీ గోడం నగేష్
చందుపట్ల కీర్తి రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశానికి అదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ,రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ రెడ్డి ,రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి హాజరయ్యారు.
అనంతరం వారు మాట్లాడుతూ,మే 10న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించబడే జనాగ్రహ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్న నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని కోరారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిందని, ఇది దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ పార్టీ పై ఉంచిన నమ్మకానికి నిదర్శనమని తెలిపారు. అలాగే పశ్చిమ బెంగాల్, అస్సాం, పాండిచ్చేరి రాష్ట్రాల్లో మొన్న వెలువడిన ఫలితాల్లో కూడా ఘన విజయం సాధించామని, అదే ఉత్సాహంతో తెలంగాణలో కూడా త్వరలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.మూడవసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా హైదరాబాద్‌కు విచ్చేస్తున్నారని, తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుందని తెలిపారు. తెలంగాణలో అధికారంలో లేకపోయినా రాష్ట్రానికి సుమారు 7 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి ప్రధానమంత్రి వస్తున్నారని చెప్పారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ మరియు దాని మిత్రపక్షాలు అడ్డుకోవడం సిగ్గుచేటని, దేశంలోని మహిళలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని విమర్శించారు. తెలంగాణ రైల్వేలకు 95 వేల కోట్ల నిధులు, జాతీయ రహదారులకు వేల కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ, కేంద్రం నిధులు ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు.గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా ఇదే విధంగా కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేసి, చివరికి ప్రజల విశ్వాసం కోల్పోయిందని విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మహిళల ఆవేదన పెరుగుతోందని, ఇది ప్రభుత్వానికి ప్రమాదకరమని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షులు అశోక్ రెడ్డి, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నెంపల్లి పాపన్న, జన్నే మొగిలి, రాష్ట్ర నాయకులు రాయరాకుల మొగిలి, ఆరో వార్డు కౌన్సిలర్ ఎరుకల రేణుక గణపతి,జిల్లా ప్రధాన కార్యదర్శులు దొంగల రాజేందర్, పెండ్యాల రాజు, తాడికొండ రవి కిరణ్, జిల్లా ఉపాధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి, వెశాల సత్యవతి, తదితరులు పాల్గొన్నారు
