BJP Gears Up for Modi Rally
ప్రధాని మోడీ బహిరంగ సభను విజయవంతం చేయండి
భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిశీధర్ రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిశీధర్ రెడ్డి అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది మే 10న నిర్వహించబడనున్న భారీ బహిరంగ సభపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షులు ఎడ్ల అశోక్ రెడ్డి జిల్లా ఇంచార్జ్ ఆరుట్ల దశమంత రెడ్డి హాజరైనారు
అనంతరం వారు మాట్లాడుతూ, హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రతి బూత్ స్థాయిలో కార్యకర్తలు చురుకుగా పనిచేసి ప్రజలను చైతన్యపరచాలని, సభకు భారీగా ప్రజలను సమీకరించాలని సూచించారు. బూత్ ఫ్యామిలీ సభ్యులు, శక్తికేంద్ర ఇన్చార్జ్లు, మండల జిల్లా స్థాయ గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమై పార్టీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయని, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం దేశానికి దిశానిర్దేశం చేస్తోందని నాయకులు పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఈ సభ కీలకమని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపయ్య చదువు రామచంద్రారెడ్డి నాలుగో వార్డ్ కౌన్సిలర్ కన్నం యుగదీశ్వర్ 6వార్డ్ కౌన్సిలర్ ఎరుకల రేణుక గణపతి జిల్లా ప్రధాన కార్యదర్శులు దొంగల రాజేందర్ పెండ్యాల రాజు తాడికొండ రవి కిరణ్ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, వివిధ మోర్చా అధ్యక్షులు, మండలాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
