నర్సంపేట,నేటిధాత్రి :
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క,సీఎం సలహా దారులు వేం నరేందర్ రెడ్డిలను కలిశారు.వరంగల్ జిల్లా నర్సంపేట మండలం కమ్మపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు,మెపా వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల కృష్ణ ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా కృష్ణ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం లో పోరాడిన ఉద్యమకారులకు తగిన న్యాయం చేయాలని, అలాగే ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని అన్నారు.న్యాయం చేయకుంటే మరో ఉద్యమం చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ,సీఎం సలహా దారులు వేం నరేందర్ రెడ్డి లతో మాట్లాడినట్లు తెలిపారు.వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు