ప్రజాబంధు పొంగులేటి!

ఏడాది ప్రజా సంక్షేమ పాలన ప్రయాణం.

మంత్రిగా ఏడాదిలో గణనీయమైన జిల్లా ప్రగతి.

రాజకీయంగా జిల్లాలో నెంబర్‌వన్‌

పాలకుడిగా జిల్లాలో నెంబర్‌వన్‌.

ఎన్నికల ముందు కాంగ్రెస్‌ గెలుపు కోసం శపథం.

ఆడిన మాట, ఇచ్చిన మాట నెరవేర్చిన రాజకీయ లక్ష్యం.

పార్టీని విజయ తీరాలకు చేర్చిన చాణక్యం.

బలమైన నేతగా తిరుగులేని సంచలనం.

జిల్లాను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు.

తొక్కేయాలని చూసిన వారిని అడ్రస్‌ లేకుండా చేశాడు.

జిల్లా రాజకీయాలకు కేంద్ర బిందువయ్యారు.

నిత్యం పల్లెల్లో… ప్రజలతోనే.

ప్రతి క్షణం ప్రజలకు అందుబాటులోనే.

అటు పార్టీ, ఇటు ప్రభుత్వం అలుపెరుగని బాధ్యతలు.

జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు.

రాజకీయంగా ఎదురులేని నాయకత్వం.

పాలనాపరంగా తిరుగులేని అభివృద్ధి సంతకం.

పొంగులేటిపై రోజు రోజుకూ పెరుగుతున్న ప్రజాభిమానం.

తన ప్రజల కోసం అహర్నిశల పొంగులేటి జీవితం.

 

హైదరాబాద్‌,నేటిధాత్రి:

నాయకుడు పట్టుదల కలిగి బలమైన ఆకాంక్ష తో ముందడుగు వేస్తే రాజకీయంగా ఎంతటి లక్ష్యాన్నైనా అవలీలగా చేధించవచ్చని నిరూపించిన నాయకుడు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. ఒంటి చేత్తో రాజకీయ ఎత్తుపళ్లాలను చిత్తు చేసి ఎప్పటికైనా నాదే పై చేయి అని చాటిన నాయకుడు పొంగులేటి. పొంగులేటిని అదుపాజ్ఞలో పెట్డుకోవాలని చూసిన వారి అహాన్ని ఖమ్మం జిల్లా ప్రజల సాక్షిగా రాజకీయ సమాధి చేశారు. తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని తోలు బొమ్మలాటాలాడుకోవాలనుకున్న వారి తోలుమందం రాజకీయాల తోలు వలిచిన నాయకుడు పొంగులేటి. తనకు తానుగా స్వయం ప్రకాశంగా ఎదిగిన చోట రాజకీయ నిశీదిని పరిచయం చేయాలని చూసిన బిఆర్‌ఎస్‌ కు కాళరాత్రిని మిగిల్చిన నాయకుడు పొంగులేటి. తన దాకా వస్తే తన రాజకీయ బలం ఎంత విలువైందో బిఆర్‌ఎస్‌ కు చెప్పి మరీ దెబ్బ చూపించారు. పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ని ఒంటరిని రాజకీయంగా అణచి వేయాలని చూసినా బిఆర్‌ఎస్‌ కు దిక్కు దివానం లేకుండా చేశారు. ఆదరించినట్లు నమ్మించి, అక్కున చేర్చుకొని ద్రుతరాష్ట్ర కౌగిలిలో పొంగులేటిని ఊపిరాడకుండా చేయాలని చేసిన వారిని ఊపిరిసలపకుండా చేశాడు. ఖమ్మం జిల్లాలో కనీసం జెండా పట్టుకునే దిక్కు లేని బిఆర్‌ఎస్‌ కు అండగా నిలిచారు. అయినా విశ్వాసం తప్పిన బిఆర్‌ఎస్‌ కు గత ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పారు. చరిత్రలో బిఆర్‌ఎస్‌ మాయని మచ్చలా మిగిలిపోయేలా రాజకీయ చాణక్యం చూపించారు. కలలో కూడా బిఆర్‌ఎస్‌ అధినాయకత్వం కలవరించేలా, కలత నిద్రలతో నిద్రలేని రాత్రులు గడిపేలా శాస్తి చేశారు.
కారు చీకట్లు కమ్ముకున్న ఖమ్మం కాంగ్రెస్‌ కు వెలుగులు పంచిన నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. రాజకీయంగా తనను అణచి వేయాలని చూసిన వారిని తీరంలో అలలు పోటెత్తినట్లు ఖమ్మం ఓటెత్తెలా చేసిన బిఆర్‌ఎస్‌ ను మట్టి కరిపించిన నేత పొంగులేటి. ఖమ్మం గుమ్మంలో గులాబీ పార్టీని నలిపి వుండ చేసిన నేత పొంగులేటి. కాంగ్రెస్‌ను ఖమ్మం లో తిరుగులేని శక్తిగా నిలబెట్టేందుకు తొడగొట్డి గెలిపించిన నాయకుడు పొంగులేటి. అచెంచలమైన ఆత్మ విశ్వాసం తో, ప్రజల మీద నమ్మకం తో గులాబీకి సవాలు విసిరి కారును తక్కుతుక్కు చేసి షడ్డుకు పంపించారు. బిఆర్‌ఎస్‌ ను ఖమ్మం నుంచి అసెంబ్లీ గేటు కూడా తాకకుండా చేస్తానని చెప్పి అన్నంత పని చేశాడు. ఇలా సవాలు చేసి ప్రజా క్షేత్రంలో ఒక పార్టీని మట్టి కరిపించిన నాయకుడు మరొకరు లేదు. ఆ ఘనత ఒక్క పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కే దక్కింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వారసత్వాన్ని నమ్ముకొని నాయకుడు కాలేదు. ఎవరి ప్రోద్బలంతోనో నాయకుడు గా ఎదలేదు. ప్రజల నుంచి నాయకుడయ్యాడు. ప్రజల కోసం నాయకుడయ్యాడు. నాయకుడు కావడం కోసం రాజకీయాలు చేయలేదు. రాజకీయాలను అడ్డం పెట్టుకొని ఎదగలేదు. ఎంచుకున్న అన్ని రంగాలలో విజయం సాధించిన తర్వాత రాజకీయాలలో వచ్చాడు. ప్రజాసేవ చేసి ప్రజలకు చేరువయ్యాడు. ప్రజలు కోరుకుంటే నాయకుడయ్యాడు. ప్రజల నాయకుడయ్యాడు. ప్రజానాయకుడయ్యాడు. అంతే తప్ప ఆయనను రాజకీయంగా తీర్చిదిద్దిన వారు ఎవరూ లేదు. ఆయన రాజకీయాలను అనుకూలంగా మార్చుకునేందుకు బిఆర్‌ఎస్‌ అర్రులు చాచింది. ఆయన మంచి తనాన్ని చేతగాని తనమనుకున్నది. పొంగులేటి విశ్వరూపాన్ని తక్కువగా అంచనా వేసింది. నిలబడ్డ గడ్డ మీద నుంచి గర్జించిన పొంగులేటి ని చూసి బిఆర్‌ఎస్‌ అదిరిపోయింది. బెదిరిపోయింది. ఖమ్మం నుంచి పారిపోయింది. పొంగులేటి అంటే బిఆర్‌ఎస్‌ ఒన్నులో వణుకుపుట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా బిఆర్‌ఎస్‌ ను ఎదిరించి ఖమ్మం జిల్లాలో తాను ఎంపిగా, మరో ఇద్దరిని ఎమ్మెల్యేలను చేసిన నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. అలాంటి నాయకుడిని బిఆర్‌ఎస్‌ పార్టీ ఆహ్వానించి, ఆయన రాజకీయ నాయకత్వం తడిగుడ్డతో గొంతు కోసినట్లు కోయాలనుకున్నారు. పొంగులేటిని రాజకీయంగా తొక్కేయాలని చూశారు. 2014-2019 వరకు ఎంపిగా వున్న పొంగులేటిని 2018 ముందస్తు ఎన్నికలలో మోసం చేశారు. టికెట్‌ ఇస్తామని చెప్పి నమ్మించారు. పార్లమెంటు సీటు నీదే అని నమ్మించి మోసం చేశారు. ఐదేళ్లు రాజకీయంగా బిఆర్‌ఎస్‌ లోనే ఇబ్బందులకు గురి చేసి ఆత్మాభిమానం దెబ్బ తీశారు. ఇప్పుడు మంత్రి శ్రీనివాస్‌ రెడ్డి రాజకీయంగా దెబ్బ కు దెబ్బ తీయడంతో బిఆర్‌ఎస్‌ అగ్రనేతలు గిలగిల కొట్టుకుంటున్నారు. స్వయం కృతాపరాధంతో ఖమ్మంలో గులాబీకి చోటు లేకుండా చేసుకున్నందుకు బిఆర్‌ఎస్‌ పెద్దలు కుమిలికుమిలి పోతున్నారు. ఖమ్మం గమ్మం ముందు నిలబడాలంటే ఒణికిపోతున్నారు.
అవును మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ముమ్మాటికీ ప్రజాబంధు అని చెప్పకతప్పదు. రాజకీయాలలో ఎంత దూకుడుగా వుంటారో, అదే ఉత్సాహంతో పాలనలోనూ అందరికంటే ముందున్నారు. మంత్రిగా ఏడాదిలో గణనీయమైన జిల్లా ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నారు. రాజకీయంగా ఖమ్మం జిల్లాలో నెంబర్‌వన్‌గా తన స్థానం పదిలం చేసుకోవడమే కాదు, ఇతర పార్టీలకు చోటు లేకుండా చేస్తున్నారు. పాలకుడిగా తెలంగాణలోనే జిల్లాను నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం కృత నిశ్చయంతో చేస్తున్నారు. ఆ మధ్య ఖమ్మం జిల్లాలో వచ్చిన వచ్చిన వరదల సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి చేసిన సాయం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అటు ప్రభుత్వ పరంగానే కాకుండా ఇటు వ్యక్తిగతంగా ప్రజల మీద ఆయనకు వున్న ప్రేమతో చేసిన సహాయ సహకారాలు అంతా ఇంతా కాదు. ఇరవై నాలుగు గంటలు ప్రతి క్షణం పరిస్థితిని సమీక్షిస్తూ, స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తూ రెండు రోజుల్లోనే ఖమ్మంలో మామూలు పరిస్థితులు నెలకొనేలా చేశారు. ప్రజల చేత శభాష్‌ అనిపించుకొని మంత్రి అంటే ఇలా వుండాలని జేజేలు పలకించుకున్నారు. ఏడాది ప్రజా సంక్షేమ పాలన ప్రయాణంలో ప్రభుత్వానికి బాసటగా, సమిష్టి నిర్ణయాలతో ముందుకు సాగుతూ జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రజలు తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి లో వేగం పెంచుతున్నారు. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ గెలుపు కోసం శపథం నిలిచి గెలిచి, పార్టీని గెలిపించిన నాయకుడు పొంగులేటి. ఆడిన మాట, ఇచ్చిన మాట నెరవేర్చిన రాజకీయ లక్ష్యం అనే మాటకు అర్థం నేర్పారు. అంకిత భావానికి మరో రూపంగా పొంగులేటి నిలిచారు. పార్టీని విజయ తీరాలకు చేర్చిన అపర చాణక్యుడయ్యారు. బలమైన నేతగా తిరుగులేని సంచలనాన్ని సృష్టించించారు. తొక్కేయాలని చూసిన వారిని అడ్రస్‌ లేకుండా చేశాడు. జిల్లా రాజకీయాలకు కేంద్ర బిందువయ్యారు. నిత్యం పల్లెల్లో… ప్రజలతోనే మమేకమౌతున్నారు. అటు పాలనలో ఇటు ప్రజా సేవలో తలమునకలౌతున్నారు. ప్రతి క్షణం ప్రజలకు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చుతున్నారు. అటు పార్టీ, ఇటు ప్రభుత్వం అలుపెరుగని బాధ్యతల నిర్వహిస్తూ, జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నారు. రాజకీయంగా ఎదురులేని నాయకత్వానికి వేదికయ్యారు. పాలనాపరంగా తిరుగులేని అభివృద్ధి సంతకమౌతున్నారు. రోజు రోజుకూ మరింత ప్రజాభిమానం పొందుతున్నారు. తన ప్రజల కోసం అహర్నిశల పొంగులేటి జీవితం అంకితం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!