`‘‘డిఆర్’’ ‘‘సంతోష్ రెడ్డి’’ ని కులమే కాపాడుతోందా?
`పేరుకు ‘‘రెడ్డి’’ తోడైతే తప్పులన్నీ ఒప్పులేనా?
`‘‘మంత్రిని మభ్యపెట్టి’’ ‘‘పెద్దల పేరు అడ్డుపెట్టి’’ ‘‘హ్యాపీ రెడ్డి’’ ఆడుతున్న నాటకం!!
`రంగారెడ్డి డిఆర్ హ్యాపీ రెడ్డి లీలలకు లింకులు!?
`అప్పుడు బావ…ఇప్పుడు పాల ‘కులం’!..రంగారెడ్డి డిఆర్ హ్యాపీగా వుండడానికి కారణం!?
`ఎన్‌ఫోర్స్‌మెంటు వద్ద కీలక ఆడియోలు? అయినా ‘‘డిఆర్’’లో భయం లేదు!?
`రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో డి ఆర్ సంతోష్ రెడ్డి పైనే చర్చలు?
`‘‘డిఆర్’’ సంతోష్ రెడ్డి మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అని గుసగుసలు?
`పై వాళ్లంతా నా గుప్పిట్లో! కింది వాళ్లంతా నా కనుసన్నల్లో!!
`గతంలో బావ అండదండలతో అందలం!
`కోరుకున్న చోట ఉద్యోగం!
`ఇప్పుడు పై వాళ్ల ఆశీస్సులతో పెత్తనం!
`ఒకే ఉద్యోగి ఒకే జిల్లాలో రెండు సార్లు ఉన్నత ఉద్యోగం చేయొద్దు!
`ప్రమోషన్ వస్తే అసలే అవకాశం ఉండదు.
`కానీ హ్యాపీ రెడ్డికి రెండు సార్లు రంగారెడ్డి జిల్లాలోనే పోస్టింగ్ ఎలా సాధ్యం!
`రంగారెడ్డి డిఆర్‌గా ఇతర జిల్లా డిఆర్‌లు ఎవరూ పనికి రారా!
`ఇతర జిల్లాలోని డిఆర్‌లు జిల్లాలకు జిల్లాలే మారుతున్నారు!
`మారు మూల జిల్లాలలకే పరిమితమౌతున్నారు!
`హ్యాపీ రెడ్డి మాత్రం కొలువులో చేరినప్పటి నుంచి ఇక్కడిక్కడే కొలువు వెలగబెడుతున్నాడు!
`అయితే రంగారెడ్డి, లేకుంటే మేడ్చల్ దాటి వెళ్లడం లేదు.
`రంగారెడ్డి డిఆర్‌గా పని చేసేందుకు ఇతర డిఆర్‌లకు అర్హత లేదా?
`అప్పుడు బావ పైరవీతో రంగారెడ్డి జిల్లాలో కొలువు కుదుర్చుకున్నాడు?
`మళ్ళీ రంగారెడ్డికే వచ్చి 600 కోట్ల భూమి అక్రమంగా బదలాయించాడు?
`రిజిస్ట్రేషన్ శాఖలో ఒక్కసారిగా సంచలనంగా మారిపోయాడు!
`అయినా పాలక పెద్దల దాకా వెళ్లకుండా ఎవరు కప్పి పుచ్చుతున్నారు!
`పెద్ద పెద్ద వాళ్లు నా సాయం తీసుకున్న వాళ్లే అంటున్న డి.ఆర్!
`ఎమ్మెల్యేలు కూడా సపోర్టుగా వున్నారు.
`అందుకే నేను తప్పించుకోగలిగాను!
`నా పవర్ మీడియాకు తెలియదు!
`రాసే వాళ్లు ఎన్ని రాసుకున్నా నన్నేం చేయలేరు!
`నాపై చర్యలు తీసుకునేంత సాహసం డిపార్ట్మెంట్ చేయలేదు! నేను పైవాళ్ళ జేబులు నింపాను?
`నన్ను ఇరికించడం ఎవ్వరి తరం కాదు!
`మీడియా నాపై ఎన్ని వార్తలు రాసినా జరిగేదేమీ లేదు!
`దటీస్ హ్యాపీ పవర్…నో ఫియర్!..’’నో.బడి.కెన్.టచ్.టు.మీ’’!
`డిపార్ట్మెంట్ పెద్దలకు నేను ఎంత చెబితే అంత!
`డిపార్ట్మెంటే నా చేతుల్లో వుంది!
`ఎవ్వరేం రాసుకున్నా ఐ డోంట్ కేర్!
`అయామ్ హ్యాపీ హియర్!!
హైదరాబాద్,నేటిధాత్రి:
ఒక వ్యక్తి కులం వ్యవస్ధను ఇంతగా ప్రభావితం చేస్తుందా? కులం పేరు చెప్పుకుంటే ఎంత పెద్ద స్ధాయిలో వున్న వ్యక్తులైనా సహరిస్తారా? అవినీతి సాగించిన వారిని కూడా వెనకేసుకొస్తారా? వారిని కాపాడుతుంటారా? రాజకీయ వ్యవస్ధలో కులం ప్రభావం ఎంత వుంటుందో తెలియంది కాదు. అంతే వాసిగా ఉద్యోగ వ్యవస్ధలో కులం ప్రభావం కూడా పనిచేస్తుందని చాలా మందికి తెలియదు. కాని అగ్ర కులం అనగానే ఎంతటి వారికైనా ఆప్తులౌతారు. అవసరమైతే భయపడతారు? సహరించడానికి ఎవరూ వెనుకాడరు? ఇంత దిగజారిన వ్యవస్ధలో అవినీతి అంతం జరుగుతుందా? ఉన్నత స్ధానంలోవుండి ఇతర కులాల ఉద్యోగులు చిన్న పొరపాటు జరిగినా భూతద్దంలో పెట్టి చూపించే వ్యవస్ధలో అగ్ర కులానికి చెందిన ఉన్నతోద్యోగులు ఎంత పెద్ద అవినీతికి పాల్పడినా కప్పి పుచ్చుతారా? ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడి విధానం? అవినీతికి పాల్పడి, మమ్మల్నీ ఎవరూ ఏం చేయలేరు? మా వెనుక పెద్దతలకాయలున్నాయి? అని ధైర్యంగా పది మందితో చెప్పుకునే వారికి పై స్ధాయిలో వున్న వారు గొడుగు పట్టడం, ఆదుకోవడం, తప్పు చేసిన వారినిపై ఈగ వాలనివ్వకపోవడం వెనుక వున్న ఆంతర్యమేమిటి? ఆ అదృష్య శక్తులకు అవినీతికి పాల్పడిన వారిపై ప్రేమేంటి? రంగారెడ్డి జిల్లాలో రూ.600 కోట్ల విలువైన భూమి మాయం గురించి మీడియాలో పుంఖాను పుంఖాలుగా వార్తలు వచ్చాయి? అంత పెద్ద భూ వ్యవహరం పెద్దవాళ్లకు తెలియకుండా కింది స్ధాయి ఉద్యోగులు చేశారంటూ వారిని పట్టుకున్నారు? వారిపై కేసులు నమోదు చేశారు. తప్పు ఎవరు చేసినా తప్పే? అవినీతికి పాల్పడితే నేరమే! శిక్షార్షులే!! కాని అంత పెద్ద నిర్ణయాన్ని కింది స్దాయి ఉద్యోగులు తీసుకోలరా? అంత సాహసం చేయగలరా? పెద్దల ఒత్తిడి లేకుండా జరిగిందా? వారికి తెలియకుండానే జరిగిపోతుందా? పెద్దల ఆదేశాలు లేకుండానే 600 కోట్ల రూపాయల భూమి బదలాయింపు పూర్తవుతుందా? ఒక వేళ కింది స్ధాయి ఉద్యోగులే చేరానుకుంటే కనీసం పై స్ధాయి అధికారులకు సమాచారం వుండదా? జిల్లా స్ధాయి అధికారులకు సమాచారం ఇవ్వ కుండానే కింది స్ధాయి అధికారులు తంతు పూర్తి చేస్తారా? ఇంత పెద్ద వ్యహరం పెద్దలకు తెలియకుండా జరిగిందంటే నమ్మశక్యంగా వుంటుందా? నిజమని నమ్మే అవకాశం వుందా? ఈ చిన్న లాజిక్ కూడా మిస్సయ్యి పనులు భూ బదలాయింపులు చేశారా? ఎవరి చెవుల్లో కాలిఫ్లవర్లు పెడుతున్నారు? ఎవరిని తప్పుదోవ పట్టిస్తున్నారు? ప్రజలను మోసం చేసి, వ్యవస్ధలను నిర్వీర్యం చేసి, ప్రభుత్వ భూములను అక్రమంగా బదలాయింపులు చేసి, కోట్లకు కోట్లు వెనకేసుకుంటున్న వాళ్లు నాటకాలు ఇలా వుండడం వల్లనే సామాన్యులు అష్ట కష్టాలు పడుతున్నారు. పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలంటేనే జంకుతున్నారు. ఎవరి భూమి ఎవరి పరమౌతుందో తెలియక ప్రజలు భయాందోళనలో వుంటున్నారు. ఉన్నత చదువులు చదువుకొని, ఉన్నతోద్యోగాలలో చేరి పేదలకు అండగా నిలవాల్సిన వాళ్లు, సామాన్యులను దోచుకుంటున్నారు. ప్రభుత్వాన్ని నిండా ముంచుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఓ ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు దారా దత్తం చేయడానికి అధికారులకు ఎంత దైర్యం కావాలి? ఉద్యోగం పోతుందనో, లేక జీవితం జైలు పాలౌతుందనో భయం లేకపోవడం మూలంగానే ఇంత విచ్చలవిడిగా అక్రమాలు జరుగుతున్నాయి. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. కొంత మంది అక్రమ సంపాదనకు అలవాటు పడిన ఉద్యోగుల జేబులు నిండుతున్నాయి. కోట్ల రూపాయల ఆస్ధులు కూడుతున్నాయి.
కమీషన్లకు కక్కుర్తిపడిన రిజిస్ట్రేషన్ కార్యాయల ఉద్యోగులు నకిలీ పత్రాలు సృష్టించిన వారికి తెలిసి సహకరించి రూ.600 కోట్ల ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు బదలాయింపు చేశారు. ఉద్యోగాలు పోగొట్టుకున్నారు? ఇంత వరకు బాగానే వుంది. కింది స్ధాయి ఉద్యోగులు రికార్డులను తారు మారు చేసేంత ధైర్యం చేస్తారా? శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం గ్రామ పరిధిలో జరిగిన ఈ భూ బదలాయింపు సంచలనం సృష్టించింది. 600కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేసేవారికి రిజిస్ట్రేషన్ కార్యాలయ బాధ్యులు సహకరించారన్నది రుజువైంది. బాలానగర్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్, ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్ తో సహా ఇందులో బాగస్వాములైన వారందరినీ అరెస్టు చేశారు. చేతులు దులుపుకున్నారు. కాని ఇంత పెద్ద వ్యవహారం జిల్లా రిజిస్ట్రార్‌కు తెలియకుండా జరిగిందా? అసలు జరిగే అవకాశం వుందా? అన్న ప్రశ్నలకు సమాదానాలు చెప్పేవారు లేరు. కాని డిఆర్ సంతోష్‌రెడ్డిపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ మీడియాలో అనేక కథనాలు ప్రచురితమయ్యాయి. నేటిధాత్రి కూడా ఆ వార్తను ప్రచురించింది. అయితే నేటిదాత్రి వార్తలను జీర్ణించుకోలేని డిఆర్ ఏం రాసుకుంటారో రాసుకోండి? నా వెనుక పెద్దలెంతో మంది వున్నారు. అధికారమే మా కులం చెలాయిస్తోంది. నా వెనకు మంత్రి వున్నారు. ఎంతో మంది ఎమ్మెల్యేలున్నారు. శాఖకు చెందిన పెద్దలంతా నాకు మద్దతుగా వున్నారు. నన్ను కాపాడుతారు? ఎవరు ఎన్ని వార్తలు రాసుకున్నా నీటి మీద రాతలు చెరిగిపోయినట్లే…పనికి రాకుండాపోతాయంటూ ఆంతరంగికుల వద్ద డిఆర్ సంతోష్‌రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిసింది. ఇంత ధైర్యంగా డిఆర్ చెబుతున్నారంటే అసలు డిఆర్‌ఎస్ సంతోష్ రెడ్డి ఎవరి పేరు చెప్పి తప్పించుకుంటున్నారని నేటిధాత్రి ఆరా తీసింది.
గత ప్రభుత్వంలో కీలక భూమిక పోషించిన ఓ ఉన్నతాధికారి డిఆర్ సంతోష్‌రెడ్డికి స్వయానా బావ. ఆయన వల్లనే గ్రూప్ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన సంతోష్‌రెడ్డి రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ శాఖలో చేరారు. అక్కడే కొంత కాలం ఉన్నతోద్యోగం చేశారు. అది కూడా డిఆర్ పోస్టుకు సమానమైన ఉద్యోగంలోనే కొనసాగారు. తర్వాత మేడ్చల్ జిల్లాకు బదిలీ అయ్యారు. తర్వాత మళ్లీ రంగారెడ్డి జిల్లా డిఆర్‌గా వచ్చారు. ఒక ఉన్నతోద్యోగి రెండుసార్లు ఒకే జిల్లాలో ఉద్యోగం చేయడం అన్నది రూల్స్‌కు విరుద్దం. అందులో రిజిస్రేషన్ శాఖలో ఒకసారి కొలువు చేసిన స్ధానంలోకి మళ్లీ రావడం కష్టం. కాని సంతోష్‌రెడ్డి మాత్రం డిఆర్‌గా రంగారెడ్డి జిల్లాకు ఇటీవలే వచ్చారు. వచ్చిన తర్వాత 600 కోట్ల రూపాయల భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఉద్యోగుల వేటుకు కారణమైంది. కాని డిఆర్‌కు సంబంధం లేదని ఉన్నతాధికారులు తేల్చారని అంటున్నారు. కాని డిఆర్‌కు సంబంధించిన ఆడియో ఎన్‌ఫోర్స్ మెంటు వద్ద వుందని కూడా సమాచారం. కాని దాన్ని కూడా దాచి పెట్టేంత దాకా సంతోష్ మేనేజ్ చేసుకున్నాడనే అంటున్నారు. గత ప్రభుత్వంలో కీలక భూమిక పోషించిన ఓ ఉన్నతోద్యోగికి స్వయాన సంతోష్ రెడ్డి బావమర్ధి కావడంతో ఆయనకు శాఖలో ప్రాధాన్యత పెరిగింది. ఆ ప్రాధాన్యతే ఇంకా కొనసాగుతోంది. అందుకే ఉన్నతోద్యోగులు ఆయనపై అపరిమితమైన ప్రేమ కురిస్తున్నారని అంటున్నారు. ఎంతలా అంటే ఇటీవల రిజిస్ట్రేషన్ల శాఖలో ఆయనతో సహా ఎంతో మంది ఉద్యోగుల బదిలీలలో సంతోష్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. శాఖకు చెందిన ఉన్నతోద్యోగుల పక్కన కూర్చొని క్షణాల్లో బదిలీలు పూర్తి చేయించానని కూడా డిఆర్. సంతోష్‌రెడ్డి చెప్పుకుంటున్నట్లు ఉద్యోగులు అంటున్నారు. బైట పడిన 600 కోట్ల భూ అక్రమ బదలాయింపు డిఆర్ కనుసన్నల్లోనే జరిగిందని అందకు పైస్ధాయిలో వున్న వారికి పెద్ద ఎత్తున ముట్ట జేప్పినట్లు కూడా స్వయంగా డిఆరే చెప్పుకుంటున్నట్లు ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు. సంబంధిత శాఖకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో అనేక అనుమానాలు వ్యక్తంచేస్తూ ఉద్యోగులు మెసేజ్‌లు ఫార్వర్డు చేసుకుంటున్నారు. నిజానికి మంత్రి శ్రీనివాస్‌రెడ్డికి ఎలాంటి వివరాలు అందకుండా శాఖ ఉద్యోగులు ఎంతో గోప్యంగా వుంచుతున్నారు. ఇటీవల జరిగిన బదిలీలను స్వయంగా మంత్రి కొన్ని రోజులు ఆపాలని సూచించినా, మంత్రి మీద ఒత్తిడి తెచ్చి ఆయనకు తెలియకుండానే తంతు పూర్తి చేశారన్న వార్తలున్నాయి. అయినా మంత్రి ఆశీస్సులు నాకు పుష్కలంగా వున్నాయి? ఉన్నతాధికారుల అండదండలున్నాయి? అందుకే నేను ఆడిరది ఆట, పాడిరది పాట అంటూ సంతోష్ రెడ్డి చెప్పుకుంటున్నాడని సమాచారం. అయినా ఒక ఉన్నతోద్యోగి రెండుసార్లు ఒకే స్ధాయి ఉద్యోగం చేయకూడదు. రంగారెడ్డి జిల్లా డిఆర్‌గా పనిచేసేందుకు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద అంతటి సమర్ధవంతమైన అధికారులే లేరా? అందుకే సంతోష్ రెడ్డికి రెండుసార్లు అవకాశం కల్పించారా? అని ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. కులం పేరు బలంగా వుంటే ఎన్ని అక్రమాలు చేసినా వెనకేసుకొచ్చేవారు వుంటారని చెప్పడానికి సంతోషే నిదర్శమని ఉద్యోగులే అంటున్నారు. ఇప్పటికైనా శాఖ పెద్దలు కళ్లు తెరుస్తారా? లేక సంతోష్ రెడ్డినే వెనకేసుకొస్తొరా? ఆయనకు కొమ్ము కాస్తారా? సంతోష్ రెడ్డి చెప్పిన మాటలే నిజం చేస్తారా? అన్నది చూడాలి.