సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కవిత మల్లేష్
భూపాలపల్లి నేటిధాత్రి
మారపల్లి కవిత మల్లేష్ సోమనపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నేడు నామినేషన్ వేయడం జరిగింది స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో సోమనపల్లి సర్పంచి ఎస్సీ మహిళ రిజర్వేషన్ రావడం జరిగింది సర్పంచ్ అభ్యర్థిగా మారపల్లి కవిత మల్లేష్ అంకుశాపురం గ్రామపంచాయతీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్ పత్రాలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమనపల్లి గ్రామ ప్రజల అభివృద్ధి కోసం కష్టపడి పని చేస్తాను కావున ప్రజలు నాకు అవకాశం ఒకసారి ఇచ్చి నన్ను ఆశీర్వదించాలని సోమనపల్లి గ్రామ ప్రజలకు కు విజ్ఞప్తి చేస్తున్న కష్టపడి పనిచేసే నాయకుడిని కావున గత 20 సంవత్సరాల నుండి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నాను ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుని కావున ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి గ్రామ ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చింది నన్ను ఆశీర్వదించి సర్పంచిగా ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కార్యక్రమంలో వార్డ్ నెంబర్ అభ్యర్థులు నాయకులు పాల్గొన్నారు
