katnam bhoomi samarpayami, ‘కట్నం’భూమి.. సమర్పయామి..!

‘కట్నం’భూమి..

సమర్పయామి..!

వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట మండలంలోని దివిటిపల్లి గ్రామానికి చెందిన కందిక కోమల సోమయ్య దంపతుల కూతురయిన రజి తను, పారనంది యాదమ్మ(సోమయ్య చెల్లెలు) కుమా రుడైన మధుకర్‌కు (2001లో) ఇచ్చి వివాహం జరిపిం చారు. కాగా, కట్న కానుకల కింద దివిటిపల్లి గ్రామంలో ఉన్న 376/ఎ ఉన్న తన 1.10 గుంటల వ్యవసాయ భూమిని రాసిచ్చారు. రజిత, మధుకర్‌ కాపురం అన్యో న్యంగా సాగింది. 2008 నుంచి మధుకర్‌ వ్యసనాలకు లోనయ్యాడు. భార్యా పిల్లలను పట్టించుకోకపోగా జల్సా లు చేయడం మొదలెట్టాడు.ఎంతకూ వినకపోవడంతో రజిత పెద్దమనుషులను ఆశయ్రించింది. మధుకర్‌ను మందలించి ప్రవర్తన మార్చుకుని సక్రమంగా కాపురం చేసుకుని చెడు వ్యసనాలను వదిలి వేయాలని పెద్దమనుషులు సూచించారు.అయినా వినిపించుకోని మధుకర్‌ తన తల్లిదండ్రులతో కలిసి రాయపర్తి మండలంలోని గన్నారం (గతంలో వారి స్వంత గ్రామం) గ్రామానికి మకాం మార్చాడు,

భూమినే నమ్ముకుని..

మధుకర్‌ తనకు దూరంగా తల్లిదండ్రులతో రజిత మాత్రం.. తన భూమినే నమ్ముకున్నది. వ్యవసాయంతో పాటు కూలీనాలీ చేస్తూ పిల్లలను పోషిస్తూ వస్తోంది. తన బిడ్డకు ఆధారంగా ఆ భూమి ఉందని భరోసాతో ఉన్న ఆమెకు ‘అత్తింటి’ రూపంలో అనుకోని గండం వచ్చిపడింది. రజితపై కనికరం చూపాల్సిన భర్త మధుకర్‌, అత్త యాదమ్మలు వివాహ సమయంలో కట్నం ఇచ్చిన భూమిని అత్త యాదమ్మ పేరుమీదకు మార్చారు. కుటుంబంలో గొడవలు జరుగుతున్న సమయంలో వివాదానికి కారణమైన భూమిని రజిత అనుభవదారుగా కూడా రికార్డుల్లో నమోదు చేశారు. దీంతో భూమి రజిత పేరున నమోదవుతుందని, అలా అయితే తమకు ఏం దక్కదని కుట్ర పన్నారు. అనుకున్నదే తడవుగా వివాదాస్పద భూముల కోనుగోళ్ళకు కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకునే మడికొండకు చెందిన ఓ రియల్టర్‌కు కట్టబెట్టినట్లు సమాచారం. ఇంకేముంది మూడో కంటికి తెలియకుండా భూమి చేతులు మారింది. ఈ విషయం తెలియని రజిత ఎప్పటిలాగానే భూమిలో సాగు చేసుకుంటున్న సమయంలో కొందరు అడ్డుకుని ఈ భూమిని తాము కొనుగోలు చేసినట్లు చెప్పారు. న్యాయం కోసం అప్పటి నుంచి ఆమె పోలీసుల చుట్టూ తిరుగుతూనే ఉంది.

పోలీస్‌ స్టేషన్లో పిర్యాధు…

వివాదానికి కారణమైన భూమిని కోనుగోలు చేసింది.మొదలు ఇప్పటి వరకు ఆ భూమి మీదకు రాని వారు తాజాగా బుధవారం రజిత సాగు చేసుకుంటుండగా వ్యవసాయ భూమి వద్దకు వచ్చి పనులను అడ్డుకుని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో అక్రమంగా భూమిని సాగు చేస్తున్నట్లు పిర్యాధు చేసినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *