Headlines

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే.. రాష్ట్రం పరిస్థితి కుక్కలు చింపిన విస్తరే

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తున్న బీ ఆర్ ఎస్ పార్టీకి ఓటు వేయండి

స్థానికుడు, సౌమ్యుడు బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ ను కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి.

## రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినిపల్లి వినోద్ కుమార్

బోయినిపల్లి,నేటిధాత్రి:


రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొత్తపేట గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఓటర్లతో మాట్లాడిన వినోద్ కుమార్

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బోయినిపల్లి మండలం కొత్తపేట గ్రామంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినిపల్లి వినోద్ కుమార్ పాదయాత్ర నిర్వహించి ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
అభ్యర్థి సుంకె రవిశంకర్ నర్సింగాపూర్,వెంకట్రావుపల్లి, కొత్తపేట, మాన్వాడ, మల్లాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఆదివారం కొత్తపేట గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన అనంతరం కార్నర్ మీటింగ్ లో వినోద్ కుమార్ మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి గ్రామస్తులకు వినోద్ కుమార్ వివరించారు.

రాష్ట్రాన్ని అన్ని రకాలుగా విధ్వంసం, దగా చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రం పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారుతుందని వినోద్ కుమార్ అన్నారు.ఈ సందర్భంగా అభ్యర్థి సుంకె రవిశంకర్ మాట్లాడుతూ….

కాంగ్రెస్, బీజేపీ లు తెలంగాణ అభివృద్ధిని జీర్ణించుకోలేకపోతున్నాయి.

కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష.

కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కళ్యాణలక్ష్మీ ఎందుకు లేదు?

24గంటల కరెంటు ఎందుకు లేదు?

రైతు బంధు ఎందుకు లేదు?

రైతు బీమా ఎందుకు లేదు?

ఆసరా పెన్షన్లు ఎందుకు లేవు?

కాంగ్రెస్, బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి.

తెలంగాణలో నవంబర్ 30వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో రాష్ట్ర ప్రజల ఆశలకు అనుగుణంగా ఉంది.అన్ని వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేలా ఉంది.మేనిఫెస్టో, అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓటు వెయ్యండి.
తెల్లరేషన్ కార్డున్న ప్రతి పేదింటికి కేసీఆర్ బీమా పథకం కింద రూ.5లక్షలు బీమా ఇవ్వడం..ప్రతి కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ చేస్తామనడం,ప్రతి పేదింటి మహిళకు రూ.400లకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
ప్రస్తుతం ఉన్న ఆసరాను రూ.5వేలకు,దివ్యాంగులకు రూ.6వేలకు పెంచడం అభాగ్యులకు ఆర్థిక భరోసానిస్తుంది.
దేశానికి అన్నం పెట్టే రైతన్నకు పంటపెట్టుబడి సాయాన్ని రూ.16వేలకు పెంచడం జరుగుతుంది.బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోరైతులను,మహిళలను ,అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించడం కేసీఆర్ కార్యదక్షతను తెలియజేస్తుంది.బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో అన్ని వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతుంది.
ఆరోగ్య శ్రీ చికిత్స మొత్తాన్ని 15లక్షలకు పెంచుతాం.
వ్యవసాయానికి 24గంటల కరెంటు ఇవ్వడం లేదని విమర్శిస్తున్న కాంగ్రెస్, బిజెపి నాయకులు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా కరెంటు తీగలు పట్టుకుంటే తెలుస్తుంది.
స్థానిక బిడ్డనైన నన్ను ఆశీర్వదించాలని కోరారు.
నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నానని సుంకె రవిశంకర్ అన్నారు.గతంలో స్థానికేతరులు ఎమ్మెల్యేలుగా గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారు.ఎన్నికల ముందు వచ్చి తర్వాత వెళ్లిపోయే నాయకులకు ఈ ప్రాంతం మీద మమకారం ఉండదు.
పార్టీలకు అతీతంగా నేను అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందజేస్తున్నాని అన్నారు.
అందరికీ అందుబాటులో ఉంటున్న.ఏ ఆపద వచ్చినా నేను అండగా నిలుస్తానని అన్నారు.
60 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని అన్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద హనుమాన్ దేవాలయం కొండగట్టులో రూపుదిద్దబోతుంది.గతంలో నెర్రెలుబారిన నేలలు,బీడు భూములు కనిపించేవి.కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పంతో తెలంగాణ భూములు ఈరోజు పచ్చబడ్డాయి.ఎటు చూసినా పచ్చని పంట పొలాలు దర్శనం ఇస్తున్నాయి. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు జోగినిపల్లి రవీందర్రావు, జోగినిపల్లి ప్రేమ్ సాగర్ రావు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి, ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్, జెడ్పిటిసి కత్తెరపాక ఉమా కొండయ్య, మండల కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ అజ్జు, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, డాక్టర్ చెన్నాడి అమిత్ కుమార్, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, మండల ఆర్బిఎస్ అధ్యక్షులు కొనకటి లచ్చిరెడ్డి, ఏ ఎం సి వైస్ చైర్మన్ సిక్కాల సుధాకర్ రావు, కొత్తపేట లేదా కవిత రమేష్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు భీమనాథుని రమేష్, నల్లగొండ అనిల్ కుమార్, నాగుల నాగరాజ్ గౌడ్, కొండం నారాయణరెడ్డి, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *