తెలంగాణ జర్నలిస్టు సమాజ సంక్షేమం కోసం టి యు డబ్ల్యూ జే కట్టుబడి ఉంది

ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం లో
రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా

వేములవాడ నేటి ధాత్రి

తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జర్నలిస్టు సమాజ సంక్షేమం కోసం ఎల్లవేళలా కృషి చేస్తుందని యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా అన్నారు. వేములవాడ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా అకాడమీ చైర్మన్ ,యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ నేతృత్వంలోని టీయూడబ్ల్యూ హెచ్143 తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇప్పటివరకు సుమారు 12 కోట్ల రూపాయలకు పైగా కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. వివిధ కారణాల చేత మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు పెన్షన్ సౌకర్యం కల్పించి దేశంలో ఆదర్శవంతంగా నిలిచామన్నారు. యూనియన్లకు అతీతంగా జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న అల్లం నారాయణ సేవలు అభినందనీయమని కొనియాడారు. వేములవాడ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ కార్యవర్గం సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొలిపాక నర్సయ్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో అధ్యక్షులుగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సంఘ బలోపేతం, కోసం సభ్యుల సంక్షేమం కోసం ఆహర్నిశలు కృషి చేస్తానని సభ్యులకు హామీ ఇచ్చారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి లాయక్ పాషా ను సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యవర్గం,సభ్యులకు పూల మాలలు వేసి శాలువాతో ఘన సత్కారం జరిగింది. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు తాహేర్ పాషా, సంఘం ఉపాధ్యక్షులు రేగుల రాంప్రసాద్, ప్రధాన కార్యదర్శి అయాచితుల జితేందర్ రావు,కోశాధికారి నరెడ్ల కృష్ణ,సంయుక్త కార్యదర్శి పొన్నం శ్రీనివాస్,కార్యనిర్వహణ కార్యదర్శి కొత్వాల్ శ్రీనివాస్,ప్రచార కార్యదర్శి ఎం.డి రియాజ్ ,కార్య నిర్వాహక సభ్యులు దెబ్బెటి ప్రవీణ్,దుర్గం పర్శరామ్ ,జిల్లా రమేష్, బండి రజనీకాంత్ , బూర్ల సందీప్, ఎం డి జునైడ్,కొడెం గంగాధర్ లతో పాటు సభ్యులు విష్ణు ,తమ్మిషెట్టి రాజు, ప్రదీప్,పోగుల వేణు తదితర సభ్యులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *