Press Freedom Day Wishes by Journalist Ambedkar Dommati
ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు
పరకాల,నేటిధాత్రి
ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా జర్నలిస్ట్ అంబేద్కర్ దొమ్మటి శుభాకాంక్షలు తెలిపారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛకు అత్యంత ప్రాధాన్యం ఉందని ఆయన పేర్కొన్నారు.సమాజంలోని సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని,ప్రజల హక్కులను కాపాడటంలో పత్రికల బాధ్యత మరింత పెరిగిందని ఆయన అన్నారు.నిజాయితీతో,నిబద్ధతతో జర్నలిజం కొనసాగాలని కోరారు.ప్రజలకు నిజమైన సమాచారం చేరేలా ప్రతి జర్నలిస్ట్ కృషి చేయాలని,పత్రికా స్వేచ్ఛను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు.
